శ్రీమహావిష్ణువు స్త్రీ అవతారమైన మోహనీ రూ పాన్ని ధరించిన వైశాఖ శుద్ధ ఏకాదశి రోజును మోహనీ ఏకాదశిగా హందువులు జరుపుకుంటారు.
దేవ దానవుల క్షీర సాగర మధనంలో అమర త్వాన్ని ఇవ్వగలిగిన అమృత భాండం ఉద్భవించింది. కానీ ఈ అమృత భాండం తమకే సొంతం కావాలని భావిం చిన దేవ దానవుల మద్య జరిగిన పోరులో, దానవుల చేతికి అమృత భాండం చిక్కితే వారు అమరులవడం వలన, వారి చేష్టల వల్ల లోకాలు అల్లకల్లోల మవుతాయని భావించిన దేవతలు, మహావి ష్ణువే సమస్యకు పరిష్కారాన్ని చూపాలని వైకుంఠ నాథుని ఆశ్రయించారు. దానవులతో భౌతికంగా యుద్దానికి దిగడం కన్నా, తెలివితో జయించవచ్చని భావించిన విష్ణువు, అప్సరస వంటి మో#హనీ రూపాన్ని ధరించాడు. మోహనీ అనగా ఆకర్షణ అని అర్ధం కూడా. అప్సరసను తలపించే అందంతో దానవుల దృష్టిని తనవైపు తిప్పుకోగలిగిన మోహని, దానవులకు అనుమానం రాకుండా దేవతలకు అమృ తాన్ని అందివ్వడంలో సఫలీకృతమైంది. ఆ కారణం చేతనే దేవతలు అమరులయినట్లు పురా ణ కథనం. మోహని ఏకాదశి గొప్పతనాన్ని మొదట రాముడికి వసిస్థుడు; అలాగే యుధిష్ఠిరునికి శ్రీ కృష్ణుడు వివరించారు. మో#హని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే… తీర్థయాత్రలు చేయ డం, దాతృత్వం ఇవ్వడం లేదా యజ్ఞాలు చేయడం ద్వారా సాధించిన వాటి కంటే చా లా ఎక్కువ అని నమ్ముతారు. ఉపవాసం ద్వారా వెయ్యి ఆవులను దానం చేయడం ద్వా రా సాధించినంత కీర్తిని పొందుతారని చెపుతారు. రోజంతా నిష్ఠతో దేవుని భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండడం ద్వారా ఆర్ధిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకర, లాభదాయక జీవనానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల నమ్మకం. వ్రతాన్ని ఆచరించేవారు జనన మరణ చక్రం నుండి విముక్తి… తద్వారా మోక్షాన్ని పొందుతారని విశ్వాసం.
దశమి సాయంత్రం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు ఉపవాస దీక్షను చేయవలసి ఉంటుంది. ఏకాదశి ద్వాదశి మధ్య రాత్రి సమయంలో జాగరణ సూచించబ డినది. విష్ణువును పూలతో పూజించుట, విష్ణు స#హస్ర నా మం పఠించడం, భజనల్లో పాల్గొనడం, దేవాలయాలకు వెళ్ళడం, హారతిని సమర్పించి భక్తులకు ప్రసాదా న్ని పెట్టడం ఆచరణీయం.
దాన ధర్మాలు చేయకుండా ఏకాదశి వ్ర తం పూర్తికాదు. అర్హులైన… పేదలకు లేదా అవసరమైన వారికి దానధర్మాలు చేయ డం విధిగా సూచించబడినది. తద్వా రా అన్నదానాలు, గోవుల పంపిణీ, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి వి చేయడం ద్వారా ఉపవాస దీక్షను విరమించవచ్చు. ఎక్కువసేపు ఉపవా స దీక్ష చేయలేని వారు, ఆరోగ్యం సరి గ్గాలేని వారు, వయసు పైబడిన వారు ఉపవాస దీక్షలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసు కోవడం లేదా విరమించుకోవడమే అన్నివి ధాలా శ్రేయస్కరం. మధుమే#హ, ఇతర దీర్ఘకా లిక వ్యాధిగ్రస్తులు మొదలైనవి ఉన్నవారు ఉపవా సాల విషయంలో జాగరూకతతో ఉండాలి.
అఖండ ఫలప్రదంవెూహినీ ఏకాదశి వ్రతం!
Advertisement
తాజా వార్తలు
Advertisement