పూజ్యాయ రాఘవేంద్రాయ
సత్యధర్మ రతాయచ
భజతాం కల్పవృక్షాయ
నమతాం కామధేనవే.
శ్రీ గురు రాఘవేంద్రస్వామి (1595-1671) హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ప్రముఖ గురువు. 16వ వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనున యించారు, మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు.
మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్ర తీర్థులు భక్త కోటికి కష్టా లు కడతేరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుం టున్నారు. మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు మానవ కళ్యాణం కోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. భక్తులు రాఘవేంద్రస్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు. తమిళనాడు లోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠా ధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఆయన శ్రీమూల రాముడి, శ్రీ పంచముఖ ముఖ్య ప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) పరమ భక్తులు. పంచముఖిలో తపస్సు చేశారు. పంచముఖ #హనుమంతుణ్ణి దర్శించారు. (హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామచంద్రులు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్ధులు మాత్ర మే) మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు. అక్కడే జీవ సమాధి పొందారు. శ్రీ రాఘవేంద్ర తీర్థస్వామి విలక్షణ ప్రతిభ గల, అద్భుత మహిమలు నెఱపిన మహనీయుడు. రాఘవేంద్ర తీర్థస్వామి అన్నది సన్యాసాశ్రమపు నామము. పూర్వాశ్రమంలో ఆయన పేరు వెంకట భట్టు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడైన వెంకటభట్టు చాలా తెలివైనవాడు. సంస్కృతంలో, కావ్యములు వేదాలు, మీమాంస ము న్నగునవి మధురకు చెందిన శ్రీలక్ష్మీ నరసింహాచారి వద్ద చదువు కున్నారు. తాత శ్రీకృష్ణ దేవ రాయల ఆస్థాన వైణికుడిగా వుండేవారు. వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు.
విద్యాభ్యాసానంతరము సరస్వతి బాయిని వివాహం చేసుకుని, పేదరికం కారణంగా, తన కాపురాన్ని కుంభకోణమునకు మార్చారు. అక్కడ శ్రీ మధ్వాచార మత గురువులలో ఒకరైన శ్రీ సుధీంద్ర తీర్థస్వా మి వారికి శిష్యుడయ్యారు. గురువు చెప్పగా శిష్యుడు వ్యాఖ్య వ్రాస్తూ ఉండేవారు. ఒకనాడు ఒక ఘటం గురువుకే విడివడలేదు. ఆలోచించి రేపు చెబుతానని గురువు ఆనాటికి పాఠం చూపించారు. ఆ రాత్రి శిష్యు డు గురువుకు సందేహం వచ్చిన ఘట్టానికి సంబంధించిన వ్యాఖ్య తాను రచించి మరీ నిద్రపోయారు. మరునాడు గురువు శిష్యుని ఎంత గానో పొగడి, ఇతర శిష్యుల సమక్షంలో ‘పరిమళ ఆచార్య అను బిరు దం ఇచ్చారు. కొన్నాళ్లకు శ్రీ సుధీంద్ర తీర్థస్వామి తనకు అవసాన కాలం సమీపించిన విషయం తెలుసుకుని, తన అనంతరం మధ్వ పీఠం నడప డానికి వెంకట భట్టే తగినవాడని నిర్ణయించారు భగవత్ కైంకర్యానికే తన భవిష్య జీవితాన్ని అంకితం చేయడానికి కృత నిశ్చయుడయ్యారు. సుధీంద్రులు వెంకటనాథుని తంజావూరు చెంతగల హనుమంత పురంలోని తన ఆశ్రమానికి తీసుకునిపోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్ష నిచ్చి పీఠాధిపత్యం అప్పగించారు. దీక్షానామం ”శ్రీ రాఘవేంద్ర తీర్థ స్వామి” అనే పేరు స్వీకరించారు. కొద్ది కాలానికి అనంతరం సుధీంద్ర తీర్థస్వామి తనువు చాలించారు. శ్రీ రాఘవేంద్రుడు పీఠ అధిపతి అయ్యారు. ఆయన ప్రహ్లాదుని అపరావతారమని, అందువలన యెన్నో యోగ మహిమలు నెరపగలుగుతున్నారని ప్రఖ్యాతి కలిగింది. కాల క్రమాన రాఘవేంద్రస్వామి వృద్ధుడయ్యారు. భౌతిక కాయం బృందా వనంలో ప్రవేశింపవలసిన కాలం వచ్చిందని తెలుసుకున్నారు.
ప్రహ్లాదుడు యాగం చేయడం చేత పవిత్రత కూర్చుకున్నదని ప్రఖ్యాతి గల మాంచాలి అనే గ్రామాన్ని స్వామి తన బృందావన స్థానం గా ఎంచుకున్నారు. ఆ గ్రామం తుంగభద్ర తీరాన ఆదోని తాలూకా ఉత్తరపు కొనన ఉన్నది. స్వామి బృందావనం వెళ్ళాక, అక్కడికి వెళ్లిన రోగులు కుష్టు, మూగ, గుడ్డి మున్నగు దారుణ వ్యాధులతో బాధపడే వారు. మంత్రముగ్ధులయి రోగ నిర్ముక్తులవుతూ ఉండడంవల్ల దానికి మంత్రాలయం అనే పేరు వచ్చింది. 1671లో తన శిష్య బృందంతో రా బోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయం లో జీవ సమాధి పొందడానికి సంసిద్ధుడైనాడు. 1671వ సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ గురువారం నాడు శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనంలో ప్రవేశించారు. వేదమంత్ర పఠనం జరుగుతూ ఉండ గా స్వామి అందులో కూర్చున్నారు. అక్కడ చేరిన వేలకొలది భక్తులు హరినామ కీర్తన సాగి స్తూ ఉండగా స్వామి నైమిత్తికాలు పూర్తి చేసు కుని శుచియై చేతిలో వీణను పట్టుకుని సమాధిలో ప్రవేశించారు. శ్వాస నిలిపివేసి మనోలయం చేశారు. గండకీ నది నుంచి తెప్పించిన 1200 సాలిగ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. సమాధిగతు డైన తర్వాత ఆయన చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు.
రాఘవేంద్ర స్వామి జయంతి వేడుకలు ఆరు రోజుల పాటు సంప్ర దాయ రీతిలో నిర్వ#హంచడం సాంప్రదాయం. ఈ నెల 21న మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులస్వామి వారి పాదుకలకు నవరత్నా లు, పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. 26వ తేదీ రాఘవేంద్రస్వామి 428వ జన్మదినం సందర్భంగా మూల బృందావనానికి పంచామృతం అభిషేకాలు, పూజ లు నిర్వహిస్తారు.