రావణ సంహారం అయిన తరువాత రాముని చేరిన సీతమ్మను చూసి ”ఓ జానకీ! ఈ యుద్ధంలో శత్రువులను జయించి నిన్ను సంపాదించుకున్నాను, నాకు జరిగిన అవమానాన్నీ, నా శత్రు వును ఏకకాలంలో నిర్మూలించాను. ఇప్పుడు నా పౌరుషం నిలి చినది, నా ప్రతిజ్ఞ నేరవేరినది” అన్నాడు.
”ఓ సీతా! నేను లేనప్పుడు ఓ రాక్షసుడు నిన్ను ఎత్తుకువ చ్చాడు, నాకు అవమానం అయినది. నేను నా పరాక్రమంతో అధిగమించాను. సుగ్రీవ, విభీషణ, హనుమాది వీరుల సహా యంతో సాకారమైంద”ని రాముడు పలకడంతో మైథిలి నేత్రాల నిండా కన్నీళ్లు నిండాయి. తిరిగి రాముడు కన్నీళ్లతో ”సీతా! ఈ అవమానం పొగొట్టుకొనేందుకు మానవుడిగా చేయవలసింది అంతా చేసామన్నాడు. ఓ సాధ్వి! ఈ యుద్ధం నేను నీ కోసం చేయలేదు, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకో, కేవలం సదాచా రం కాపాడడానికి, నా వంశానికి అపకీర్తి రాకుండా ఉండడానికి యుద్ధం చేసాను.
ఓ సీతా! ఇప్పుడు నీ చిత్తం వచ్చిన చోటుకుపోవచ్చు, నేను అనుమతిస్తున్నాను. పరాక్రమవంతుడైన వాడు పర గృహంలో నివసించిన భార్యను తిరిగి స్వీకరించగలడా? రావణుడి దుష్ట చూపులు నీ మీద పడ్డాయి. అతని ఒడి నుంచి జారినావు, నేను సద్వంశంలో పుట్టినాను, నిన్ను ఎట్లు పరిగ్రహంచగలను. నీ మీద నాకు ఆసక్తి లేదు. నీ ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చు. నీవు ఎక్కడ సుఖం కలదని భావిస్తావో అక్కడికి వెళ్లవచ్చు. నీవు మనో హరమైనదానివి, రావణుని అంత:పురంలో ఉన్నావు. అతడు నిన్ను చూస్తూ బహుకాలం ఉపేక్షించి ఉండడు” అన్నాడు.
రాముడి అప్రియమగు ఈ మాటలు వినగానే జానకి ఒక్క సారిగా ఏనుగు తొండం తగిలి దెబ్బతిన్న తీగవలె వణికిపోయి సంతధారగా కన్నీళ్లు కార్చింది. జన సమూహం మధ్య రాము డు తనను అలా మాట్లాడుతుంటే సీత సిగ్గుపడింది. తల భూమి లో కుచుంచుకుపోయినట్లయింది. ఒంటి నిండా సూదులు గుచ్చుకున్నట్లు అయింది. కన్నీళ్లతో గద్గద స్వరంతో ”ఓ వీరు డా! ఓ పామర స్త్రీని అన్నట్లు మీరు అనరాని మాటలు అన్నా రు. నేను అలాంటి దానను కాను. మీరు ఎలాంటి ప్రమాణం చేయ మంటే అలా చేస్తాను. ఎవరితోనో నన్ను పోల్చవద్దు. నేను వివశ గా ఉన్నప్పుడు అపహరించిన సమయంలో రావణుడు నా శరీ రాన్ని స్పృశించాడు. అదీ నేను అంగీకరించలేదు. ఆ అపరాధం దైవానిదని, నాది కాదు. నా అధీనం ఉన్న మనస్సు ఎల్లప్పుడు నీమీదే నిలిచి ఉంది. నా దేహం విషయంలో అప్పుడు నేను పరాధీనను. హనుమంతుడు లంక వచ్చినప్పుడు నన్ను ఎందుకు వదిలిపెట్టలేదు. హనుమ ఎదుటనే ప్రాణాలు వదిలి పెట్టే దానిని కదా. ఇప్పుడు మీకు ఈ శ్రమ తప్పేది. మీరు ఒక అల్పుడు వలె స్త్రీత్వాన్ని కించపరిచారు. నేను జనకుడి పుత్రికనే కాక, భూమి పుత్రికను. చిన్ననాడే నా ప్రాణిగ్రహణం చేసారు. మీమీద నా భక్తిని, నా సౌశీల్యాన్ని అనుమానిస్తున్నారు” అని కన్నీరు కార్చింది.
దీనుడై చూస్తున్న లక్ష్మణుడిని చూస్తూ ”సౌమిత్రి! నా భర్త నన్ను వదిలేసారు, నాకు అగ్ని ప్రవేశం మినహా గతిలేదు. చితిని పేర్చిపెట్టు, ఇక జీవించడం నాకు ఇష్టం కాదు” అంది. రాముని సమ్మతితో లక్ష్మణుడు చితి పేర్చాడు.
జానకి అందరికి నమస్కరిస్తూ రాముడికి ప్రదక్షిణం చేసిం ది. అగ్నిహోత్రునికి నమస్కరించి, ”నీవు లోక సాక్షివి, నా మన స్సు నా భర్తపైనే నిలచి ఉంది. అన్యత్రా చలించలేదు. ఇది వాస్త వం అయినట్లయితే నన్ను రక్షించు. రాముడు అనుకుంటున్న ట్లు నాలో దోషం లేకపోతే నన్ను రక్షించు. సూర్యచంద్రులు, సమస్త దేవతల సాక్షిగా నేను పతివ్రతను అయితే నన్ను రక్షిం చు” అని ప్రార్ధించింది. అక్కడ ఉన్న సమస్త వానర, రాక్షసాది వీ రులు హాహాకారాలు చేస్తుండగా జానకి అగ్నిలో ప్రవేశించింది.
బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై రావణ సంహారంతో లోక కల్యాణం చేసిన రాముని ప్రశంసించారు. రాముడు సాక్షాత్ విష్ణువు అవతారంగా అభివర్ణించి స్తోత్రం చేసారు. ఇంతలో అగ్ని దేవుడు మంటల్లోంచి సీతను ఎత్తుకొని తీసుకువచ్చాడు. అగ్నిప్రవేశం ముందు ఎలా ఉందో అలా బయటకు వచ్చింది. రాముడితో అగ్నిదేవుడు ”ఈమె పరిశుద్ధ హృదయ, పాపరహ త, ఈమెను స్వీకరించు. నేను ఆజ్ఞాపిస్తున్నాను.” అని చెప్పాడు. అగ్నిదేవుడి మాటలకు రాముడు సంతోషపడినాడు. ఆ తరువా త బ్రహ్మ దేవుడిని చూస్తూ ”ఓ దేవా! ఈమె స్వద్వృత్తం నాకు తెలుసు. ఆమె ప్రాతివత్యం ముల్లోకాలకు తెలియవలసి ఉంది. ఆమెను పరీక్షించక పోయినట్టయితే దశరథ పుత్రుడు రాముడు కాముకుడని లోకాలు అంటాయి. ఆమెను అతిక్రమించే శక్తి దురాత్ముడు రావణునికి లేదు.” అన్నాడు. తదుపరి రాముడు సీత దగ్గరకు వెళ్ళి ”నీవు పరిశుద్ధురాలివి” అంటూ సీతను పొదవి పట్టుకుని దగ్గరకు తీసుకున్నాడు.
అగ్ని పునీత జానకి!
Advertisement
తాజా వార్తలు
Advertisement