Saturday, November 23, 2024

అజ్ఞానాన్ని తొలగించే సద్గురువు

ప్ర తి ఒక్కరికి గురుకృప తప్పకుండా ఉండా లని తరచుగా సాయిబాబా చెబుతుండే వారు. గురువు ఉండటమే కాదు… ఆ గురు వు కూడా ఎలా వుండాలో, సరయిన వాడు దొరకా లని అనేవారు. ఉత్తముడైన గురువు మాత్రమే మార్గ దర్శనం చేయగలడు. అజ్ఞానపు అంధకారాన్ని తొల గించే వ్యక్తి మాత్రమే అసలైన గురువు. విద్యాగర్వం గురువుకు ఉండరాదంటారు సాయి. గురువు శిష్యుల కు విద్య, విజ్ఞానం, వినయం నేర్పాలి తప్ప అహంకా రానికి చోటు ఇవ్వకూడదు. ఇలాంటి వివేచన వున్న గురువు మాత్రమే తన శిష్యుల్ని కరుణతో దగ్గరకు తీసుకొని జ్ఞానబోధ చేయగలడని, ఆత్మజ్ఞానాన్ని ప్ర సాదించగలడని చెబుతారు సాయిబాబా.
”వెలుగంటే చీకటిని పారద్రోలడమే. జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించడమే. శిష్యుడు సహజంగా జ్ఞాన స్వరూపియేగాని అతడే జీవుడనని, శరీరమే తానని తలచి సుఖదు:ఖాలకు, కర్మబంధాలకూ లోనవుతా డు. జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది గాని, మాటలకు, ఊహలకు అందదు. కనుక దానిని వాచా బోధించడం సాధ్యం కాదు. కాలులో గ్రుచ్చు కున్న ముల్లును మరో ముల్లుతో తీసినట్లు, పాత్రకు పట్టిన మసిని మట్టితో రుద్ది పోగొట్టినట్లు, గురువు తన బోధనలు అనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు. అప్పుడు శిష్యునిలో దాగివున్న జ్ఞానం శిష్యునికే అనుభవమవుతుంది. కనుక గురువు వాచా బోధించేది గూడా అజ్ఞానమే. సర్వమూ దైవ స్వరూపమని, తత్వద్రష్టలందరూ ఆ భగవంతుని రూపాలేననీ సద్భక్తుడు గుర్తిస్తాడు. తత్త్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞానియైన గురువు కూడ శిష్యుణ్ణి ఆ భగ వంతుని రూపంగానే దర్శిస్తాడు. అటువంటి గురువు ప్రాశస్త్యం తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలన్నాడు” అని చెప్పారు సాయిబాబా.
ఈ విషయాన్ని ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు ‘శ్రీసాయి లీలామృతము’ గ్రంథంలో వివరంగా పేర్కొన్నారు.
సాయిబాబాని సద్గురువుగా ఆరాధించవలసిన అవసరాన్ని ‘శ్రీ గురుచరిత్ర’ గ్రంథంలో ఆచార్య భర ద్వాజగారు విపులంగా వివరించారు. బాబాను గురు వుగా తలపోశాక ఆయన కృపను పొందడానికి ఎలా నిష్ఠగా ఉండాలో, సాటివారి పట్ల ఎలా నడుచు కోవాలో, శత్రువులను కూడా మిత్రులుగా చూడడం ఎలానో వివరించారు. శ్రీసాయి భక్తులకు ‘శ్రీగురు చరిత్ర’ పారాయణ ఎంతో ముఖ్యమని చెప్పారు ఆచార్య భరద్వాజగారు.
మనుషులకు ఆత్మజ్ఞానం ముఖ్యం. స్వస్వరూప జ్ఞానం గురువును ఆశ్రయించకనే తెలుసుకోగలిగిన వారు అరుదు. చిన్నచిన్న విషయాల్ని కూడా తెలుసు కోలేక చీకట్లో రోజులు వెళ్ళబుచ్చేవారి గురించి బాబా చింతిస్తారు. గురువు అంటే మాయ, మర్మం, వేదాం తం కాదు. జీవితానికి సంబంధించిన జ్ఞానం అందిం చాలి. మనుషులుగా ఎలా మసలుకోవాలో తెలియ జేయాలి. మనుషుల్ని మంచి వైపు నడిపించాలి. జీవ న తాత్వికతని చెప్పారు. తాము చెప్పేదే సరైనది అని ఏ గురువూ ఎప్పుడూ అనలేదు. ఎవరికి వారు తమ తమ మార్గాలను తాము అన్వేషించుకుంటూ ముం దుకు సాగాలని మాత్రం అనేవారు.
అంతేకాదు సాయిబాబా ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలని అనేవారు. ఎల్లవేళలా అహంకారం లేని వ్యక్తులే గురువులుగా ఉండదగినవారన్నారు. తెలియకనే తప్పులు చేయడం వేరు. తెలిసి కూడా తప్పుగా నడుచుకోవడం సరికాదు. అందుకని ఎవరో ఒకరిని గురువుగా చెప్పుకుని, వారి బాటలో నడిచి నంత మాత్రాన సరిపోదు.
అలాగే సాయిబాబాని సద్గురువుగా సేవించినంత మాత్రాన ఆధ్యాత్మిక పథంలో ఇమిడిపోయినట్టు కాదు. ‘గురుబోధ సారం గ్రహించి దాని ప్రకారం మన యోచనను, పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్టు” అని ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు చెబుతారు. కనుక బాబాని సద్గురువుగా ఆరాధించడమంటే వారి జీవిత సారాన్ని గ్రహించి జీవితాన్ని పరులకు హితంగా మలచుకోవాలి. ఇతరులకు హాని తలపెట్టక, సాటివారి కీడెంచక మంచిగా మసలుకోవాలి. అప్పుడే సద్గు రువు కృపకు అర్హులవుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement