కవచము అంటే రక్షణ కలిగించేది. సాధారణంగా సైనికులు ప్రాణాపాయం లేకుండా కవచం ధరిస్తారు. అది రక్షణ కవచం. ఇప్పుడు మనం ఆధ్యాత్మిక కవచం గురించి తెలుసుకుందాం.
భోగ భాగ్యాలు సమకూరడానికి, మన: శాంతికి, దీర్ఘకాలపు సమస్యలు పరిష్కారానికి, ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, కుటుంబ సభ్యుల వివాహాలు పూర్తి అవ్వడానికో భగవంతుని శరణాగతి పొందుతాము. అందుకు సహస్ర నామాలు, స్తోత్రాలు కావ్యములు వంటివాటిని స్తుతిస్తాము.
మనకు లక్ష్మీ కవచము, ఆంజనేయ కవచం, దుర్గా కవచం వంటివి తెలుసు. కాని సర్వ వ్యాధి నివారణకు, సకల సంపదకు, మన:శాంతికి కల్పతరువులాంటి ”శ్రీమన్నారాయణ
కవచము” చాలామందికి తెలియదు. దీనిని విశ్వరూప మునీంద్రుడు ఇంద్రుడుకు ఉపదేశించినట్టుగా భాగవతంలో చెప్పబడింది. ఇప్పుడు ఆ శ్రీ మన్నారాయణుని కవచాన్ని అవగాహన చేసుకొందాం.
ముందుగా కాళ్ళుచేతులు శుభ్రం చేసుకుని ఉత్తర ముఖంగా ఆసీనులై, అంగన్యాస, కరన్యాసాలు చేసి మహమాన్వితమైన ఈ కవచాన్ని పారాయణ చేయాలి. అంగన్యాసంలో
” ఓం నమో నారాయణాయ” అనే ప్రణవ పూర్వకమైన, అష్టాక్షరీ మంత్రంలోని ఎనిమిది అక్షరాలకు పాదాలు, జానువులు, గురువులు, ఉదయం, హృదయం, వక్షస్థలం, ముఖం, శిరస్సు అనబడే అష్టాంగాలను విన్యాసం చెయ్యాలి. తర్వాత ‘ఓం విష్ణవే నమ:’ అనే మంత్రాన్ని గ్రహంచి, శ్రీ మన్నారాయణ కవచాన్ని ప్రారంభించాలి.
”గరుత్మంతుని భుజాగ్రాలపై రెండు పాదాలు ఉంచి కూర్చొన్నవాడూ, తన ఎనిమిది చేతులయందు శంఖం, చక్రం కవచం, ధనుస్సు, ఖడ్గం, బాణం, పాశం, గద అనే ఆయు ధాలు ధరించినవాడూ అయిన భగవంతుడు కరుణార్ద్ర దృష్టితో నన్ను కాపాడు గాక!”
ప్రణయకాలంలో తాను ఒక్కడే మిగిలి అనుపాన కీర్తితో ప్రకాశించే మత్స్యావతార మూర్తి అయిన శ్రీహరి నన్ను వరుణ పాశాలలో పడకుండా, జలాల యందు సర్వదా రక్షిం చును గాక. మాయా వటుడై నటించి బలిచక్రవర్తి సంపదను అపహరించిన త్రివిక్రమ దేవు డు నన్ను అన్ని ప్రదేశాలయందు కాపాడును గాక. దేవతలకు శత్రువులైన రాక్షసులను శిక్షిం చినవాడు, అత్యంత భయంకరమైన అట్టహాసంతో కూడిన ముఖం కలవాడు, తన కోరల నుండి బయలు వెడలిన అగ్నిజ్వాలలచే చెదరగొట్టబడిన దిగవంతాలు కలవాడూ, ఊహం ప శక్యము కాని మహమ కలవాడు అయిన నృసింహదేవుడు ప్రతీచోటా నాకు కలిగే ఇక్కట్ల యందు నాకు దిక్కగునుగాక.
సమస్త లోకాలూ మహాజల మధ్యలో మునిగిపోయినప్పుడు సముద్ర గర్భంలో నిమ గ్నమై ఉన్న భూదేవిని తన నోరు కొనయందు ధరించిన ఆదివరాహమూర్తి, ఆ క్రీడా వినోది, ధరణీ మనోహరుడు కారుణ్య నిధి నన్ను సదా రక్షించుగాక! అన్ని ఆపదలకు మూలమైన అభిచార ప్రయోగాల నుండి, నారాయణుడు నన్ను రక్షించుగాక!
నానావిధాలైన నరకాల నుండి శ్రీకూర్మమూర్తి నన్ను రక్షించుగాక. అపథ్యం, అనా రోగ్యం నుండి ధన్వంతరి నన్ను రక్షించును గాక. శీతోష్ణాది ద్వందాలనుండి జితేంద్రియు డు అయిన ఋషభుడు నన్ను రక్షించునుగాక. జనన- మరణాలు కలిగించే ఆపత్కర్మల నుండి బలభధ్రుడు నన్ను కాపాడును గాక. ఎవరినైనా అవహళన చేసిన అపరాధం నుండి నన్ను శ్రీ హయగ్రీవస్వామి రక్షించునుగాక. వేలుపులకు నమస్కారం చేయకుండా, తిర స్కరించినందుకు, పూజలో లోపం చేసినందుకు, నారద మహర్షి నన్ను రక్షించును గాక.
జనాపవాదం నుండి అగ్ని, కాలం ప్రభావం నుండి యముడు నన్ను కాపాడుదురు గాక. సర్ప సమూహం నుండి ఆదిశేషుడు, అజ్జానం నుండి కృష్ణ ద్వైపాయనుడు కాపాడును గాక. ధర్మ రక్షణ పరాయుణుడైన శ్రీ మన్నారాయుణిని అవతారాలు సదా నన్ను చల్లగా కాపాడును గాక!
”ఓ! సుదర్శన చక్రమా! ప్రణయ కాలాన జ్వాలలతో అతి తీవ్రంగా తిరుగుతూ నీ పరాక్ర మంతో రాకాసి మూకలను చికాకు పరచే నీవు పెనుగాలికి ఎండు గడ్డితో నిండిన అడవులను భస్మం చేసినట్లు, భగవంతునిచే ప్రయోగింపబడిన దానవై, నా శత్రువులను నిశ్శేషంగా దహంచు. ఓ! పాంచజన్యమా! నీవే శంఖరాజము. సకల లోక జయశీలుడైన శ్రీ కృష్ణ పుణ్య సదనమైన వదనం నుండి పూరింపబడి, ఉన్మత్తములైన, భూతాలు, ప్రేత పిశాచాలు మొదలైనవాటిని పారద్రోలు విధంగా నా విరోధి వీరుల గుండెల్లో పెద్దగా ధ్వనించు.
భగవంతుని నామాలు, రూపాలు, వాహనాలు, దివ్యాయుధాలు, పాపగ్రహాల వలన, దుష్టజనుల వలన, క్రూరమృగాలు వలన, సర్పాలవలన, అడవి జంతువులు వలన సంభ వించే ఉపద్రవాలను తొలగించి, నన్ను రక్షించును గాక.
నానా విధాలైన సామగానాలతో స్తోత్రం చేయబడే గరుత్మంతుండు రక్షాదక్షుడై నన్ను కటాక్షించును గాక. శ్రీమన్నారాయణుని నామరూప వాహనాలు దివ్యాయుధాలు నా బుద్ధిని, ఇంద్రియాలను, మనస్సు ను ,ప్రాణాలను రక్షించును గాక.
భగవంతుడైన శేషుడు ఉపద్రవాలన్నింటినీ దూరం గా తొలగించు గాక. ఈ విశ్వం సమస్తమూ భగవంతుని స్వరూపంగా భావించి ధ్యానించే వారిని మాయామయుడై అలం కారాలు , ఆయుధాలు ధరించి తిరుగులేని వాడైన విరాజిల్లే మహావిష్ణువు అవశ్యం కాపా డును గాక!”
శ్రీరామ చంద్రుని అవతారంలో తాటకను, మారీచ సుబాహువులు సంహరించి, విశ్వామిత్రుని యాగాన్ని జయప్రదం చేసిన వాడవు నీవే కదా! ధైర్యసంపన్నుడై బలాడ్యులైన విరాథుడు , కబంధుడు ,దూషణుడు వంటి రాక్షసులను తుద ముట్టించిన వాడవు! వానర రాజైన సుగ్రీవుడును చేరదీసి సీతను కనుగొని, హనుమంతుడుతో కలిసి లంకానగరంపై దాడిచేసి, వీరాధివీరులైన రావణ కుంభకర్ణాదులను రూపుమాపిన వాడవు . సీతాసమేతుడై సాకేతపురానికి విచ్చేసి పట్టాభిషిక్తుడవైనావు. అటువంటి రామభద్రుడు నన్ను సదా రక్షిం చును గాక !”
ఈ కవచాన్ని విశ్వరూపుడు దేవేంద్రుడుకు ఉపదేశించాడు.
లోకంలో ఎవరైనా సరే మాలిన్యం లేని మనసుతో ఈ నారాయణ కవచాన్ని స్వీకరించి ప్రతీదినం పఠించినచో అత్యంత దుర్భరాలైన కష్టాలు వలననూ , ఘోరాతి ఘోరమైన దుష్ట గ్రహాలు వల్లనే, క్రూరమైన మారణ కర్మలు వలన, ఏవిధమైన బాధలు పొందకుండా సుఖం గా ఉంటారు. ఎటువంటి మనోవ్యధలు లేకుండా, అన్నింటా విజయం సాధించిన చక్కని ఆరోగ్యం తో ఆనందిస్తారు.
ఆధ్యాత్మిక కవచము
Advertisement
తాజా వార్తలు
Advertisement