Tuesday, November 26, 2024

ఆధ్యాత్మిక జీవనంలో ధ్యానము ప్రాధాన్యత

ఆధ్యాత్మిక జీవితంలో ధ్యానమునకు అత్యుంత ప్రముఖమైన పాత్ర వుంది. ఆధ్యాత్మిక జీవితంలో ధ్యానం యొక్క ప్రాధాన్యత గురించి చాలామందికి అనేక అభిప్రాయాలున్నాయి. భక్తి, ఆకాంక్ష, సమర్పణ, పవిత్రత జీవితం పట్ల సానుకూలమైన వైఖరి, ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితానికి ముఖ్యాంగములే. ఇవి లేకుండా ఆధ్యాత్మిక జీవితం సాధ్యంకాదు.
ధ్యా నము అనే భారతీయ భావనను ఆంగ్లం లో మెడిటేషన్‌ తదేక సూచన, కాంటెమ్‌ ప్లేషన్‌, పరిశీలన అనే రెండు పదాలతో సూచిస్తాము. ఒకే విషయాన్ని సాధించు ఒకేరకమైన భావ పరంపరపై మనస్సును లగ్నం చేయడం మెడి టేషన్‌ అంటారు.
కాంటెమ్‌ప్లేషన్‌ అనగా మానసికంగా ఒకే వస్తువు పై, రూపంపై, భావంపై యోచించటం. అయితే ఒకే విషయం లేదా దాని రూపం యొక్క భావాన్ని మాన సికంగా ఏకాగ్రతతో చింతన చేయడం ద్వారా ఆ విష యం గురించిన జ్ఞానం మనస్సులో స్వాభావికంగా కలగడం. ఇవి రెండు ధ్యాన స్వరూపాలే. ఎందుకంటే అంతర్దర్శనంలోగాని, జ్ఞానపరంగా గాని ఏకాగ్రతే ముఖ్యమైన ధ్యాన సూత్రం అంటారు అరవిందులు.
నీ ఆలోచనల నుండి వెనుకకు నిలబడి ఆలోచన లను వాటి దోవన వాటిని పోనిచ్చి, ప్రేక్షకుడిగా అదే మిటో చూడు అంటారు స్వామి వివేకానంద. ఇది ఆ త్మావలోకనంపై ఏకాగ్రత. ఇదొక ధ్యాన రూపం.
ధ్యానం చేయాలనుకుంటే అందుకోసము కొంత పూర్వ సన్నాహం అవసరం ఓ అరగంట ధ్యానం చేయాలనుకుంటే అందుకు 23 1/2 గంటల కాలం పూర్వ సన్నాహం అవసరమంటారు. ఆధ్యాత్మిక జీవి తాన్ని పటిష్టంగా గడపాలంటే, అందుకు సరైన సన్నా హంగా శ్రీమాతను లిప్తకాలమైనా మరువకుండా సదా గుర్తులో ఉంచుకోవాలి అని శ్రీ అరవిందులు అంటారు. ఒకవేళ అది కుదరని పక్షంలో పనిని ప్రారంభించేముందు, ఆ పని పూర్తి అయిన తర్వాతనై నా ఇష్టదైవాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదలా కొనసా గుతున్నప్పుడు, మధ్యమధ్యలో కూడా జ్ఞాపకం చేసుకోవడం సాధ్యం అవుతుంది. ఇలా ధ్యానానికి పూర్వ సన్నాహంలా ఉపయోగపడి చివరికి ధ్యానం చేయకుండా ఉండలేని స్థితి వస్తుంది.

ధ్యానం ఎలా చేయాలి?

ధ్యానంపట్ల ఒక సుస్థిరమైన వైఖరి కలిగి వుం డాలి. తన బలం మీదనే ఆధారపడి ఎవరూ ధ్యానం చేయలేరు అనేది ముందుగా తెలుసుకోవడం అవ సరం. ధ్యానం అనే దానిని శ్రీమాతకు అర్పించు కోవాలి. ఆమె సహాయాన్ని ఆకాంక్షించాలి.
ధ్యానం లక్ష్యం ఏమై ఉండాలి. అది క్రియాశీ లమైనదిగా వుండాలా లేక చలన రహితమైనదిగా వుండాలా అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. అచలమైన ధ్యానం ద్వారా దైవంతో ఏకమై శాంతి, సామరస్యం, ఆనందాన్ని అనుభవిస్తూ వుండిపోవ చ్చు. ఇంక ఇది క్రియాశీలమైన ధ్యానం అయినపుడు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకొనం, ఏమాత్రం పొరపాట్లకు, తప్పటడుగులకు ఆస్కారం లేని దైవాని కి చెందిన మంచి ఉపకరణమవుతుంది.
ధ్యానంలో ఉన్నప్పుడు మన ఇష్టదైవాన్ని మనోనేత్రంలో చూస్తూ వుండడం అమోఘంగా వుం టుంది. ఇష్టదైవాన్ని తన హృదయంలో ముఖ్యంగా బంగారు వర్ణంతో ఊహించడం చా లా మంచిది.
ధ్యానంలో ఈ మూడు కేంద్రాలలో ఏదో ఒక చోట ఏకాగ్రత కోసం ఎంచుకోవాలి. 1. శిరస్సుకు పై న, 2. రెండు కనుబొమ్మల మధ్య (త్రిపుటి, బొట్టు పెట్టుకొనే ప్రదేశం), 3. చైత్య జ్వాల నిరంతరం వెలు గుతూ ఉండే హృదయం మధ్య చైత్య పురుషునితో ఏకం చేసి అతనిని ముందుకు తీసుకువచ్చేందుకు దోహదం చేస్తుంది గనుక హృదయం మధ్యలో ఏకా గ్రత చాలా మంచిది అని శ్రీమాత అంటారు.
ధ్యానంలో ఆలోచనలు వచ్చి భంగం కలిగిస్తు న్నప్పుడు, వాటితో మమేకం కాకుండా సచేతనంగా వాటిని సాక్షీభూతంగా చూడడం అలవర్చుకోవాలి. దానివల్ల ఆలోచనలు ఆగి ధ్యానం కొనసాగుతుంది.
ధ్యానంలో శారీరక భంగిమ కూడా ముఖ్యమై నదే. ధ్యానానికి కూర్చున్నప్పుడు చాలా సౌకర్యంగా హాయిగా, ప్రసన్నంగా ఉండాలి. ధ్యాన సమయంలో పైనుండి శక్తిపాతం జరుగుతుంది. దానిని ఆహ్వానిం చడం కోసం వెన్నుబాము నిటారుగా ఉండేవిధంగా కూర్చుని మంత్రోచ్ఛారణ చేసుకోవాలి.
”ఓం ఆనందమయి, చైతన్యమయి, సత్యమయి, పరమే” అన్న మంత్రం మనసు శ్రీమాత చేతనతో కలు పుతుంది. దీని ప్రభావం నిత్య జీవితంపై వుంటుంది.
ప్రతి ఉదయం 4.30 గంటలకు నిద్రలేచి 20 నిమిషాలపాటు ధ్యానం చేయడం మంచిది. ఈ సమ యాన్ని బ్రాహ్మి ముహూర్తం అంటారు. మహర్షులు, ఋషులు, యోగులు, సాధు సత్పురుషులు, సాధకు లు అంతా ఆ సమయంలోనే ధ్యానం చేస్తుంటారు. వాతావరణమంతా ఆ పవిత్ర ప్రకంపనలతో ప్రశాం తంగా ఉంటుంది. మనకు తెలియకుండానే వారి సహాయం మనకు అందుతుంది.
ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రతిరోజు ఒక అరగం టైనా చదివి, అలా చదివిన విషయం మీద ధ్యానం చేయడం సాధనకు ఎంతో ఉపకరిస్తుంది.
వృధా ప్రసంగాలలో తలదూర్చగూడదు. అది మన చేతనను దిగజారుస్తుంది. వీలైనంత వరకు మా టలు తగ్గించి మౌనం పాటించాలి. అంతర్మౌనం మరింత అవసరం. అపుడే శ్రీమాత చేతనతో సంప ర్కం పెట్టుకోగలుగుతాం. మనకేం కావాలో మనక న్నా ఆమెకే బాగా తెలుసు. తల్లి ఒడిలో బిడ్డలాగ అ మ్మ ఒడిలో జీవించడం అన్నింటికన్నా ముఖ్యం.
ఇవి కొన్ని మార్గదర్శకాలు మాత్రమే. అన్నింటిక న్నా ముఖ్యం శ్రీమాతతో అంతరంగంలో ఏకం కావ డము. ప్రతివారికి దివ్యచేతనతో తమదైన అనుసం ధానం వుంటుంది.దానితోనే శ్రీమాత ముందుకు నడి పిస్తుంది. జీవితంలో అవసరమైన వాటినిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement