Thursday, November 21, 2024

ఆధ్యాత్మిక ఆనందాల మేళవింపు!కార్తిక వన భోజనం

కార్తికమాసం అనగానే వనభోజనాల హడావిడి మొదలౌతుంది. ఊరూవా డా సందడిగా ఉంటుంది. వనభోజనాల ప్రసక్తి అనేక ధార్మిక గ్రంథాల్లో ఉంది. ముఖ్యంగా ‘కార్తిక పురాణం’లో కార్తిక పౌర్ణమినాడు నైమి శారణ్యంలో మునులందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేసుకు న్నట్లు లిఖితమైంది.
ఉసిరిచెట్టు కింద కార్తిక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ప్రతిష్ఠించి, ఉసిరికలతో హరిని పూజించి, గోవింద నామ స్మరణ చేస్తూ షోడశోపచారాలతో పూజించి వనభోజనాలు చేశారు. అలా పూర్వం మ#హర్షు లు ఆచరించిన కార్తిక వనభోజనాలు ఇప్పటికీ ఏర్పాటు చేసుకుంటున్నాం. కార్తిక వనభోజ నాలు ఎలా ఉండాలంటే…
కార్తిక మాసంలో వన భోజనాలకు ఎం తో ప్రాధాన్యం ఉంది. ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం, ఆరోగ్య సందేశాన్ని కార్తిక వనభోజనాలు మనకు చాటిచెబు తున్నాయి. దేశ సంస్కృతి, సంప్రదాయాలను, హందవ ధర్మ మార్గాన్ని అనుసరించి అనాదిగా వస్తున్న ఎన్నో పర్వదినాలను మనం పాటిస్తూ వస్తు న్నాం. ఇందులో భాగమే కార్తిక మాసంలో జరుపుకునే వన సమారాధన కార్యక్రమం. దీనినే కార్తిక వన భోజనాలుగా పేర్కొంటారు.
భారతీయ ఆయుర్వేదంలో వృక్ష జాతికి ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయ మే. అందుకే మంచు కురిసే సమయంలో ఉసి రి చెట్టు కింద విష్ణువును పూజించి, వండిన ఆహారాన్ని ఆ చెట్టు కిందే ఆరగిస్తే కార్తిక మా సంలో గొప్ప పుణ్యఫలం దక్కుతుందని కార్తిక పురాణం చెబుతోంది.
భక్తి ఆధ్యాత్మిక భావనే మూలం
పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావర ణంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సపరివారంగా విందు భోజనాలు చేయడం వెనుక భక్తి ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్నాయి. కార్తిక మాసంలో ఉసిరిచెట్టు కింద అన్ని అశ్వమేధ యాగాల ఫలం దక్కుతుందని కార్తిక పురాణంలో ఉంది. అందుకే వన భోజ నాల సమయంలో ఉసిరి చెట్టు కింద విష్ణు పూజ నిర్వ#హంచి , పంచ భక్ష్యాలతో స్వామికి నివేదన చేసి, అనంతరం బ్రాహ్మణులకు దానా లిచ్చి బంధుమిత్ర సపరివారంగా భుజిస్తే అఖి లాండ భూమండలంలో ఉన్న సమస్త పుణ్య క్షేత్రాలలో మహా విష్ణువును కొలిచిన పుణ్యం దక్కుతుంది.
కృష్ణుడి వన భోజనం

ఎవరూ మరచిపోలేనంత గొప్ప వన భోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్ము డు. బలరాముడు, ఇతర స్నేహతులతో ”రేపు మనమందరం వనభోజనానికి వెళు తున్నాం!” అన్నాడు. వాళ్ళు రోజూ వెళ్ళేది ఆ వనానికే. ప్రతి రోజూ మధ్యాహ్నం ఆహా రం తినేది కూడా అక్కడే. అలాంటి వాళ్ల కు కొత్తగా వన భోజనం ఎందు కంటే- వన భోజనం ఎలా ఉంటుందో రుచి చూపిం చాలనేది ఆయన ఉద్దేశం. అందరూ పొద్దు న్నే లేచారు. గోపాల బాలురకి ఉండే లక్షణం ఏమిటంటే, వాళ్ళు ఉదయం స్నానం చేయరు. సాయంకాలం వచ్చి స్నానం చేస్తుంటారు. అం దుకే వారు ఎప్పుడూ చద్ది అన్నమే తింటారు. ప్రతి రోజు మాదిరిగానే అన్నం మూటకట్టు కొని వన భోజనానికి వెళ్దాం పదండి అని బయ లుదేరారు. అక్కడ కృష్ణుడు చూపించిన లీల లు ఒకటా రెండా!
అందుకే వనం అంటే బ్రహ్మం కాబట్టి.. బ్రహ్మాన్ని ఆరిగించడం.. అంటే కృష్ణ భగ వానుడి లీలల్ని ఆస్వాదించటమే వన భోజ నం. ఆ వన భోజనంలో ఏ అరమరికలూ లేవు. గోపాలురు కృష్ణుడితో తాదామ్యత పొందారు. మనం కూడా వనంలోకి వెళ్ళీ ఆ ఉసిరి చెట్టు కింద, తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి, అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని, ఆ ప్రకృతి అన్రుగహాన్ని, పరమాత్మ అనుగ్ర హాన్ని పొంది ఇంటికి తిరిగి రావడమే వన భో జనం. వనభోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి.
ముక్తికే కాదు సమైక్యతకు, చక్కని ఆరో గ్యానికి ఇలా చేయడం వలన ఆయా వృక్షాల మీదుగా వచ్చే గాలులు, ముఖ్యంగా ఉసిరిక వృక్షం నుంచి వచ్చే గాలి శరీరారోగ్యానికి ఎం తో ఉపయుక్తమని ఆయుర్వేద వైద్య విధానం లో చెప్పడం జరిగింది. ఈ ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షం అంటారు. అందుకే ధాత్రి భోజనం అని కూడా పేరు. పలు వృక్ష జాతులున్న వనంలో ప్రధానంగా ఉసిరి చెట్టు కింద భక్తితో భుజిస్తే ఆశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని వేద, పురాణాల వచనం.

Advertisement

తాజా వార్తలు

Advertisement