Tuesday, November 26, 2024

శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశం!

రామ – రావణ యుద్ధంలో, రావణుడి అంతిమ ఘడియలు సమీపించడానికి కొంత సమయం ముందర, శ్రీరాముడి బాణాలకు తట్టుకోలేక, రావణుడి క్షేమాన్ని కోరి, రథాన్ని సారథి దూరంగా తీసుకుపోయినప్పుడు, ఆ తరువాత కార్యం ఏమిటా అని రామచంద్రమూర్తి ఆలోచన చేస్తున్నప్పుడు, అగస్త్యుడు రామ చంద్రమూర్తి దగ్గరికి వచ్చి ఈ కింది విధంగా ఆదిత్య హృదయం ఉపదేశిస్తాడు.

ధ్యానమ్‌!

నమస్సవిత్రే జగదేక చక్షుసే
జగత్ప్రసూతి స్థితి నాశహేత‌వే
త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే
విరించి నారాయణ శంకరాత్మనే!
తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్‌!
రావణం చాగ్రతో దష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్‌!! 1
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్‌!
ఉపగమ్యా బ్రవీద్రామమ్‌ అగస్త్యో భగవాన్‌ ఋషి:!! 2
రామ రామ మహాబాహూ ణు గుహ్యం సనాతనమ్‌!
యేన సర్వానరీన్‌ వత్స సమరే విజయిష్యసి!! 3
ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్‌!
జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్‌!! 4
సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్‌!
చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమమ్‌!! 5
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్‌!
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్‌!! 6
సర్వదేవాత్మకో హ్యష తేజస్వీ రశ్మిభావన:!
ఏష దేవాసుర గణాన్‌ లోకాన్‌ పాతి గభస్తిభి:!! 7
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ: స్కంద: ప్రజాపతి:!
మహేంద్రో ధనద: కాలో యమ: సోమో హ్యపాం పతి: !! 8
పితరో వసవ: సాధ్యా హ్యశ్వినౌ మరుతో మను:!
వాయుర్వహ్న: ప్రజాప్రాణ: ఋతుకర్తా ప్రభాకర: !! 9
ఆదిత్య: సవితా సూర్య: ఖగ: పూషా గభస్తిమాన్‌!
సువర్ణసదృశో భాను: హిరణ్యరేతా దివాకర:!! 10
హరిదశ్వ: సహస్రార్చి: సప్తసప్తిర్ఖ్మరీచిమాన్‌!
తిమిరోన్మథన: శంభు: త్వష్టా మార్తాండకో?0శుమాన్‌!! 11
హిరణ్యగర్భ: శిశిర: తపనో భాస్కరో రవి:!
అగ్నిగర్భో?దితే: పుత్ర: శంఖ: శిశిరనాశన: !! 12
వ్యోమనాథ స్తమోభేదీ ఋగ్యజు:సామ- పారగ:!
ఘనావృష్టి రపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమ:!! 13
ఆతపీ మండలీ మృత్యు: పింగళ: సర్వతాపన:!
కవిర్విశ్వో మహాతేజా రక్త: సర్వభవోద్భవ:!! 14
నక్షత్ర గ్రహ తారాణామ్‌ అధిపో విశ్వభావన:!
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్‌- నమో?స్తుతే!! 15
నమ: పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమ:!
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ:!! 16
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ:!
నమో నమ: సహస్రాంశో ఆదిత్యాయ నమో నమ:! 17
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ:!
నమ: పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమ:!! 18
బ్రహ్మశా నాచ్యుతేశాయ సూర్యాయాదిత్య- వర్చసే!
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమ:! 19
తమోఘ్నాయ హమఘ్నాయ
శత్రుఘ్నాయా మితాత్మనే!
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమ:!! 20
తప్త చామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే!
నమస్తమోభి నిఘ్నాయ రుచయే లోకసాక్షిణే!! 21
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభు:!!
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభి:!! 22
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠిత:!
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్ని హోత్రిణామ్‌!! 23
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ!
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవి: ప్రభు:!! 24
ఉపదేశించిఇ ఇలా చెప్పాడు.
”శ్రీరామా! నేను చెప్పేది విను. వింటే నీ శత్రువులంద రినీ యుద్ధంలో గెలుస్తావు. నువ్వు మహాభుజ బలప రాక్రమం కలిగినవాడివైనప్పటికీ శత్రు సంహారంలో నీకిది తోడ్ప డుతుంది. ఆదిత్యహృదయం సంపత్కరమైనది. పుణ్యప్రదమై నది. సకల బాహ్యాభ్యంతర శత్రువులను నాశనం చేస్తుంది. మిక్కిలి శుభకరమైనది. క్షేమానికి హితువైనది. క్షయం కానిది. పూర్వోత్తర పాపాలన్నిటినీ నాశనం చేసి గెలుపు ప్రసాదించేది. దేహబాధ, మనో వేదన తొలగిస్తుంది. మంత్రాలలో ఉత్తమమైనది. విహితమైన ఆయువుకంటే అధికమైన ఆయువు కలిగిస్తుంది. సమస్త మంగళా లలో మిక్కిలి మంగళమైనది. జపించే వారికి అధికమైన కీర్తిని కలిగి స్తుంది. కాబట్టి ఆ మంత్రంతో రశ్మిమంతుడై ఉదయించే సూర్యుడి ని, దేవతల, రాక్షసుల, మనుష్యుల నమస్కారాలందుకునే సూర్యు డిని, సమస్త లోకాలకు ప్రియమైనవాడిని, వివస్వంతుడిని కొలువు.
ఇతడే అమితమైన తేజస్సుకలవాడు. సర్వ వేదస్వరూపుడు ఇతడే. కాంతులు కలవాడు. తన కిరణాలతో సమస్త దేవతల, అసురుల సమూహాన్ని, ప్రపంచాన్ని రక్షించేవాడు. ఇతడే బ్రహ్మ, ఇతడే విష్ణు. ఇతడే స్కందుడు. ఇతడే శివుడు. ఇతడే ప్రజాపతి. ఇతడే మహేంద్రుడు. కుబేరుడు. యముడు. కాలుడు. సోముడు, వరుణుడు, పితరు లు, వసువులు, మరుత్తుడు ఇతడే. సాధ్యులు, అశ్వులు, మనువు, వాయువు, వహ్న, ఋతుకర్త, ప్రభాకరుడు అన్నీ ఇతడే.”
”అఖండ భూమండలానికి పతియగువాడు లేక పరమాకాశానికి పతియగువాడు ఆదిత్యుడు నువ్వే. సర్వం ప్రేరేపించేవాడివి నువ్వే. వర్షం కురిపించి పైరులు పండించేది నువ్వే. పరమాకాశంలో వుండే వాడివి నువ్వే. పోషించేవాడివి, లక్ష్మీదేవితో నిత్య సంయోగం కలవా డివి, ప్రపంచ సృష్టికి కారణమైన సాధనం కలవాడివి, ప్రకాశించే వస్తువులకు ప్రకాశం ఇచ్చేవాడివి, సూర్యచంద్రాగ్ని యమాదులను ఆజ్ఞతో తపింప చేసేవాడివి నువ్వే. ఆశ్రితులకు జ్ఞానం కలిగించేవాడి వి, జీవకోటుల హృదయంలో వుండేవాడివి, లోకాన్ని సన్నగిల్ల చేసేవాడివి, గరుత్మంతుడిని వాహనంగా కలవాడివి, అనంత కల్యా ణ గుణాలు కలవాడివి, సుదర్శనాన్ని ధరించినవాడివి, సమస్త పదార్థాల లోపల వెలుపల వ్యాపించి వున్నవాడివి, కల్క్యవతారం లో గుర్రాన్ని వాహనంగా కలవాడివి, అజ్ఞాన నాశకుడివి, సౌందర్య సౌశీల్యాలలో సుఖం కలిగించేవాడివి, నష్టమైన ప్రపంచాన్ని పునర్జీ వింప శక్తికలవాడివి, స్తోత్రం చేయతగ్గవాడివి, అగ్నిని తనయందు కలవాడివి నువ్వే. సాయంకాలాన శమించేవాడివి, ప్రళయవేళ వ్యాపార రహతుడై వున్నవాడివి, చక్రాయుధుడివి, తాపత్రయ బాధితులకు తాపం ఆర్చుకోవడానికి చల్లటి ఆశ్రయమైనవాడివి, నిజభక్త విరోధులను తపించచేయగలవాడివి నువ్వే.”
”దేవా! నువ్వే హిరణ్యగర్భుడివి. నువ్వే వామనమూర్తివి. నువ్వే కర్మకుల కర్మఫలాలను ఇచ్చేవాడివి. నువ్వే పరమాకాశనాథుడివి. ఉదకాలకు మిత్రుడివి నువ్వే. భక్తుల హృదయంలోని చీకటిని పోగొ ట్టేవాడివి నువ్వే. వేదాల అంతాన్ని పొందినవాడివి నువ్వే. కవిరాజు నువ్వే. ముక్తులను సుషుమ్నానాడిలో ప్రవేశపెట్టేవాడివి నువ్వే. సుశీ లుడివి. ప్రకృతి శరీరంగా కలవాడివి. స్వరూప గుణాల విభవాలతో పూర్ణుడివి. ప్రపంచ నిర్మాణ విషయంలో సంకల్పం కలవాడివి. కౌస్తభాద్యలంకారాలు కలవాడివి. ప్రపంచాన్ని అంతా ఒక్కసారిగా తపింప చేయగలవాడివి. సర్వ భూతకోటుల రంజింప చేయగల వాడివి. సమస్తం వాటివాటి స్థానాలలో స్థాపించగలవాడివి. గ్రహ నక్షత్రాదులకు అంతర్యామివై వాటిని శాసించగలవాడివి.”
”తేజోవంతులలో తేజోవంతుడవైనవాడా! పన్నెండు మూర్తులు కలవాడా! దినాధిపతీ! ప్రకాశించేవాడా! భక్తులకు జయం క్షేమం కలిగించేవాడా! జయస్వరూపుడా! కమల నాయకా! నీకు నమస్కా రాలు. ఉదయపర్వతానికి, పశ్చిమపర్వతానికి, పాపాత్ములకు భయంకరమైన వాడికి, ముక్తులకు అధిపతి అయినవాడికి, హర్యశ్వునకు, జయుడికి మొక్కుతాను. ఆదిత్యుడికి, ఎల్లప్పుడూ వెలిగేవాడికి, సారంగమూర్తికి, మార్తాండుడికి మొక్కుతాను. సృష్టి స్థితి సంహార కర్తలైన బ్రహ్మ, విష్ణు, శివుడికి మొక్కుతాను. ప్రపం చాన్ని సృష్టించే వాడికి మొక్కుతాను. ప్రాణికోటులను సంహరించి, మరల సృజించి, రక్షించే ప్రభువు ఇతడే. తపింప చేసేవాడు ఇతడే.”
సూర్యుడు దేవతా మధ్యలో నిలిచి రావణ వధకు సహాయ పడునని శ్రీరామచంద్రమూర్తికి అగస్త్యుడు చెప్పాడు. ఇలా చెప్పి, ఈ ఆదిత్య హృదయం మంత్రాన్ని ఆపదల్లో, కష్టాలలో, భయం కలిగినప్పుడు మానవులు చదువుతే వారికి మేలు జరుగుతుంది సీతానాథా! ఏకాగ్ర మనస్కుడివై దేవదేవుడిని పూజించుము. అలా చేస్తే మరుక్షణంలోనే రావణుడిని వధిస్తావు” అని అంటాడు. అలా చెప్పి అగస్త్యుడు అంతర్థానం అయ్యాడు. శ్రీరాముడు ముని చెప్పి నట్లే మంత్రాన్ని జపించాడు. ఆ తరువాత రావణుడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇంద్రుడు పంపిన రథం ఎక్కి, బ్రహ్మాస్త్రంతో రావ ణుడిని చంపాడు. అలా ముగిసింది రామ- రావణ యుద్ధం.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం యుద్ధకాండ మందరం ఆధారంగా)

  • వనం జ్వాలా నరసింహారావు 8008137012
Advertisement

తాజా వార్తలు

Advertisement