Monday, November 18, 2024

విష్ణు సహస్ర నామాలలో ఆదిత్యుడు!

సూర్యారాధనకు అత్యంత శ్రేష్టమైన మాసం మాఘమాసం. ఆదిత్యుడు అంటే ఆది నుండి ఉన్నవాడు. అంటే సృష్టికి పూర్వం, సృష్టి ఆవిర్భావం నుండి ఉన్నవాడు. ఈయనే ప్రత్యక్ష దైవంగా అందరిచేత కొలవబడుతున్న వాడు. జ్యోతి స్వరూపుడు. ఈ మాసంలో ప్రతీ ఆదివారం సూర్య కిరణాలు పడేవిధంగా, ఆవు పాలతో పరమాన్నం వండి, సూర్యస్తుతి, ఆదిత్య హృదయం పఠించి సూర్యనారాయణ మూర్తికి నైవేద్యం పెడతారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తన విభూతులను అర్జునుడికి వర్ణించి చెప్పే సందర్భంలో-
”ఆదిత్యానా మహం విష్ణు: జ్యోతిషాం రవిరంశుమాన్‌!
మరీచిర్మరుతామస్మి నక్షత్రాణా మహం శశీ!!”
అంటే ద్వాదశాదిత్యులలో నేనే ”విష్ణువు” అనే ఆది త్యుడను. జ్యోతి స్వరూపాలలో సహస్రకిరణుడైన సూర్యు డును నేనే.అని వివరించాడు. ఒక్కో నెలకు ఒక్కో ఆదిత్య నామంతో సూర్య భగవానుడు ఆరాధింపబడుతున్నాడు. ఈ మాఘ మా సంలో పూషుడు అనే ఆదిత్యుడే సూర్యుడు. విష్ణువు అనే ఆదిత్య నామంతో సూర్యుడు కార్తీకమాసం లో ప్రకాశిస్తాడు. అందుకే ఆ మాసం శివకేశవులు మాసం గా చెపుతారు. విష్ణు సహస్రనామాలలో సూర్య భగవాను డి నామాలు, అదేవిధంగా సూర్య నామాలలో విష్ణు నామ ములు మిళితమై ఉన్నాయి. ఒకసారి పరిశీలిద్దాం! విష్ణు సహస్రామాలలో
1) ఓం ఆదిత్యాయనమ: : 38, 64 నామాలుగా రెండుసార్లు వస్తుంది) ఈ నామం భావం: 38వ నామం భా వం: సృష్టికి ముందు, సృష్టి తర్వాత కూడా సూర్య మండల అంతర్భాగంగా ఉన్న హరణ్యమయుడు అంటే ఆదిత్యు డు. ఆదిత్యుడు ఒక్కడే అయినా అనేక జలపాత్రలలో ప్రతి బింబిస్తున్న సూర్యుడు అనేక రూపాలుగా (సూర్యులు) కనపడుతున్నారు. అదేవిధంగా పరమాత్మ అనేక జీవుల శరీరాలలో ”ఆత్మ”గా ప్రకాశిస్తున్నాడు.
ఇక రెండవసారి వచ్చిన ”ఓం ఆదిత్యాయనమ:” అర్థం: అదితి- కశ్యపులకు వామనరూపంలో జన్మించిన ఆదిత్యుడు. 564వ నామంగా ”జ్యోతిరాదిత్య” అని. దీని భావం సూర్యమండలంలోని ”తేజస్సు” తానే అయిన వాడు. సూర్యుని తేజస్సు కూడా విష్ణువు యొక్క విభూతే. 65వ నామం ”ఓం! ప్రాణదాయనమ:” అంటే ప్రాణదాత. పరమాత్మే జీవుల ప్రాణాలను చైతన్యవంతం చేస్తూ ,ప్రాణ శక్తిని కలిగించేవాడు. అలాగే సూర్యుడు ఉదయించగానే సర్వ జీవకోటికి ఎన్నో శక్తులు చేకూరతాయి. సూర్యోద యం స్థంభి స్తే క్రిములు పెరిగి, జీవశక్తిని కోల్పోతారు. అనారోగ్యం తో సమస్యలు వస్తాయి. వృక్షసంపద, ఓషధు ల మొక్కలు పెరుగుదలకు సూర్యకాంతి అవసరం.
”ఓం ఆది దేవాయనమ:” ఈ నామం కూడా రెండు సార్లు (334 నామంగా 490 నామంగా) వస్తుంది. మొదటి సారి (334 వనామం) భావం: దేవతలందరికీ మూలపురు షుడు. అని. రెండవసారి(490 నామం) భావం: ప్రళయ కాలంలో సర్వభూతాలను తనలోకి గ్రహించేవాడు. కావున ఆదిదేవుడు. ఇక సూర్యభగవానుని నామాల్లో కూడా విష్ణునామాలు వస్తాయి. ఉదా: ఓం అచ్యుతాయ నమ:, ఓం వాసుదేవాయ నమ:, ఓం విశ్వరూపాయనమ: ఇలా ఎన్నో నామాలు ఏకీకృతంగా గోచరిస్తాయి. భగవ ద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ—(జ్ఞాన యోగంలో)
”ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహ మవ్యయమ్‌
వివస్వాన్‌ మనవే ప్రాప మను రిక్ష్వాక వేబ్రవీత్‌!!”
అన్నాడు. అంటే ”అర్జునా! నాశనం లేని యోగవిద్యను నేను మొదట సూర్యునికే ఉపదేశించాను. సూర్యుడు తన కుమా రు డైన వైవశ్వత మనువుకు ఆ మనువు ఇక్ష్వాకు వంశ మహా రాజు కు చెప్పాడు. సూర్యుడు ఎప్పటివాడో ఊహకు అందని విషయం. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ అంత కంటే పూర్వపువా డు. అవగాహన కొరకు కొన్ని నామాల విశ్లేషణ చేయడం జరిగింది. సూర్యుని నామాలలో విష్ణు నామాలు ఉన్నాయి. అందుకే సూర్యభగవానుని ప్రత్యక్ష నారాయణుడు అని అంటారు కదా!
సూర్యభగవానునుడు ఐశ్వర్య ప్రదాత. సూర్యభగ వానుడు ఆరోగ్య ప్రదాత. సూర్యభగవానుడు తేజోమ యుడు. సూర్య భగవానుడు త్రిమూర్తి స్వరూపుడు. అందుకే
”బ్రహ్మ విష్ణు శ్చ రుద్ర శ్చ ఈశ్వర శ్చ సదాశివ:
పంచ బ్రహ్మ మయాకార యేన జాతా స్త మీశ్వరమ్‌!”
అని కొలవబడుతున్నాడు.

  • అనంతాత్మకుల రంగారావు
    7989462679
Advertisement

తాజా వార్తలు

Advertisement