Saturday, November 23, 2024

సచ్చిదానందమయ రూపిణి ఆదిశక్తి భగవతి

త్రిమూర్తులు సృష్టి, స్థితి, లయములకు కారకులయినా వారిని నడిపించు ఆద్యాశక్తి భగవతి భువనేశ్వరి. సహస్రనామము లు గల ప్రకృతీదేవి భగవతి విధాత్రి. సచ్చిదానందమయ విగ్ర హ రూపిణి భువనేశ్వరి విశ్వమును ఉత్పత్తి చేయు కేంద్రము. సృష్టి, స్థితి, సంహార, అనుగ్రహ, తిరోభావ అను పంచ కార్యములను రూ పొందించిన ఆదిశక్తి. భగవతి మాయ సర్వవ్యాపకమై ఉన్నది. చైతన్య వంతులకు మాత్రమే ఆమె విస్తార రూపము గోచరమగును. యోగు లకు ఆమె దర్శనము ఒక ఇంద్రజాలము వంటిది. భగవతి శక్తి లోపిం చినచో భగవంతుని వ్యవస్థీకర శక్తి సఫలము కాదు. ప్రళయకాల మం దు యథార్థముగా సృష్టి ఆమెలో లయమగును.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిత్యమూ భగవతిని ఆరాధించుచుందు రు. సకల భువనములు ఆ జగన్మాత కనుసన్నలలో కాపాడబడుచున్న వి. భగవతి ఇచ్ఛాశక్తి వల్లనే త్రిమూర్తులు ఈ సృష్టిని నడుపుచున్నారు. భూలోకమును ప్రకాశింపచేయు ఆదిత్యుని శక్తి ఆమె నుండి జనించు చున్నది. విశ్వాంతరాళమునకు ఆది అంతమూ కలదు అని భావించే వారికి సనాతన దేవి ఈ సహస్ర నామములు గల ఆదిశక్తి భగవతి. భూ లోకమున వేదమాతగా వెలసినది. గాయత్రి, స్వాహా, స్వధా, ఓం అను స్వరరూపములకు కారణము భగవతి. దేవతా స్వభావులను కాపాడి, వారికి మహావిద్యా స్వరూపిణిగా నిలిచి దారిచూపుచున్నది.
త్రిమూర్తులు ప్రతి యుగమున భగవతి నుండే ప్రకటితమగుచు న్నారు. పంచభూతములు, పంచేంద్రియములు, కర్మేంద్రియములు, అంత:కరణములు భగవతి ఆజ్ఞానుసారమే నడచుచుకొనును. పరమ శివుడు భగవతి నుండి నవార్ణవ మంత్రమును స్వీకరించినాడు. ఈ నవార్ణవ మంత్రము బీజాక్షర సహితమైన అత్యంత మహిమ కలది. దీనినిభక్తిశ్రద్ధలతో, సుచిర్భూతులై ఉపాసించవలెనని తెలియచున్నది.
జగదంబిక తన స్వరూపమును త్రిమూర్తులకు వర్ణించి చెప్పే వారికి మహాసరస్వతి, మహాలక్ష్మిని, మహాకాళిని సమర్పించి కర్తవ్య మును బోధించినట్లు దేవీభాగవతములో ఈ విధముగానున్నది.
సదైకత్వం న భేదోస్తి సర్వ దైవమ మాస్యచ
యోసౌ సాహమహం యో సౌభేదోస్తి మతివిభ్రమాత్‌
దేవీ ఉవాచ. ”నేనును, బ్రహ్మయు ఒక విధమే, నాలో, బ్రహ్మలో ఏమాత్రము భేదములేదు. పరబ్రహ్మము ఒక్కటే, కాని సృష్టి సమయ మున అది ద్వైతముగా కనబడును. కావున ‘ఏకమేవా ద్వితీయం బ్ర హ్మ’ అనేది పరమ సత్యము. సృష్టికి ముందు అనగా ప్రపంచము లేన పుడు స్త్రీగాని, పురుషుడు గాని, సపుంసకుడు అనిగాని ఏదీలేదు. ఏ భేదమూ లేదు. మనము సృష్టి ఆరంభించిన పిదప మనచే కల్పించబడి నది. ఇంకా బుద్ధి, శ్రీ, ధృతి, కీర్తి, స్మృతి, శ్రద్ధ, మేధ, దయ, లజ్జ, క్షమ, కాంతి, శాంతి, పిపాస, నిద్ర, తంద్ర, జర, అజర, విద్య, అవిద్య, స్పృ హ, వాంఛ, శక్తి, అశక్తి, వస, దృ ష్టి, సత్యము, అసత్యము, వాక్కు, పరా, మధ్యా, పశ్యంతి మొదలయినవి నా నుండి వెలువడిన అన్య భేదము లు. అనేక నాడులు కూడా నా రూపములు.
గౌరి, బ్రాహ్మీ, రౌద్రి, వారాహి, వైష్ణవి, శివా, వారుణి, కౌబేరీ, నార సింహి, వాసవి ఇవి కూడా నా రూపములే. విభిన్న కార్యములను నిర్వ హించుటకు విభిన్న నామములతో, విభిన్న శక్తిరూపములతో ఈ మర్త్య లోకముతో పాటు సకల విశ్వమును వ్యవస్థీకరించుచున్నాను. ఇక ఈ భూలోకమున జలమునందు శీతలత్వము, అగ్ని యందు ఉష్ణము, సూర్యునిచే ప్రకాశము, చంద్రునిచే చల్లదనము మొదలయినవి నా శక్తి యే! నాచే ఈ శక్తిని తొలగించినచో సకల దేవగణములు, సృష్టిలోని చైతన్యము ఆగిపోయి ఏ ప్రాణియూ కదలలేదు. నా సృష్టి విలాసము లో ఈ భూమి మీదకు వచ్చిన జీవులు తమకు తాము నిలపుకొనుటకు అసమర్థులయిననూ, భయపడిననూ, హృదయ దౌర్భల్యముతో ఉం డిననూ, శత్రువుల బారినపడిననూ, వారిని ‘శక్తి’హీనులని భావింతు రు. నన్ను పరమ సత్యమని తెలుసుకున్న జ్ఞానులను ‘శక్తి’తో నింపి కాపాడెదను. త్రిమూర్తులైన మీరు కూడా నా యోగము మీకు లభించ నిచో మీ కార్యములందు సఫలమునొందజాలరు. ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, యముడు, వరుణుడు, వాయువు, వీరంద రూ నా శక్తి సహయోగము లేకుండా ఏమియూ చేయజాలరు. నేను సహకరించినపుడే ఈ పృథివి స్థిరత్వము కలిగి నడచును. సకల జీవు లలోని ప్రాణశక్తి నా ఇచ్ఛాశక్తియేనని తెలుసుకొనుము. ఈ భూమి నా విశ్వరూపములో ఒక పరమాణువు.” ఈవిధముగా మొదట బ్రహ్మ దేవునితో పలికినది జగదంబిక. తరువాత మహాసరస్వతిని బ్రహ్మదేవు నికి సహయోగశక్తి గా నొసంగినది. ఆమెను ఈ విధముగా వర్ణించినది. మహాసరస్వతి మహా సౌందర్యరాశి, నిరంతర దరహాసిని, సమస్త రజో గుణ విద్యామానిని, దివ్యశరీరము కలది, దివ్య స్వచ్ఛ వస్త్రధారిణి, ఈమెను స్వీకరించి సత్యలోకమునకు వెళ్ళి సృష్టి కార్యము చేయుమని ఆదేశించినది. తదుపరి విష్ణువుకు ”మహాలక్ష్మిని సత్త్వగుణ సహయో గశక్తిగా నొసంగినది. ఈమెను నీ వక్షస్థలమున నిలుపుకొనుము. ఈమె కళ్యాణియై సకల మనోరథములను నెరవేర్చును. ”ఈమెను ఎప్పు డూ తిరస్కరించకుము. ఇకనుండి నీవు లక్ష్మీనారాయణుడవై వెలు గొందుము. దుష్టశిక్షణ, శిష్టరక్షణా చేయుమ”ని పలికెను. విష్ణువు మహాలక్ష్మిని తీసుకొని వైకుంఠమునకు వెళ్ళినాడు. చివరిగా మహా కాళీ అను గౌరిని శంకరునకు సహయోగశక్తిగా నొసంగి ఈ విధముగా పలికినది ”నీ లీలలయందు ఈమె తమోగుణ ప్రధానమగును. సత్త్వ, రజో గుణములు గౌణములుగా నుండును. విశ్వమునందు సకల పదార్థములు త్రిగుణములు. ఎవరౖౖెతే త్రిగుణాతీతులగుదురో వారికి నేను ముక్తిని ప్రసాదించున”ని పలికి కైలాసమునకు వెళ్ళమని ఆదేశిం చినది. ఎవరైతే ఈ నవరాత్రుల్లో ఆ ఆదిశక్తి భగవతిని ధ్యానింతు రో వారికి శాంతి సౌఖ్యములు లభించును.

Advertisement

తాజా వార్తలు

Advertisement