బెంగళూరు సమీపంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని సీఎం బసవరాజ్ బొమ్మై గత రాత్రి ఆవిష్కరించారు. చిక్‌బళ్లాపూర్ తాలూకాలోని అవలగుర్కి గ్రామ సమీపంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. ముఖ్యంగా ఆదియోగి విగ్రహంపై ఏర్పాటుచేసిన రంగురంగుల లేజర్ షో అందరినీ కట్టిపడేసింది.
విగ్రహావిష్కరణ అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ‘మనం శివుడిని అర్థం చేసుకుంటే, సృష్టిని అర్థం చేసున్నట్లే. మన సంస్కృతిని నిలబెట్టే కార్యకలాపాలకు మా ప్రభుత్వం ఎప్పుడూ మద్దతు ఇస్తుంది. ప్రస్తుతం దేశంలో సంఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. సమతౌల్యాన్ని కాపాడుకోవడానికి ఆదియోగి కావాలి. ఈ విగ్రహావిష్కరణతో చిక్‌బళ్లాపూర్ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అంటూ అభిభాషించారు.