Tuesday, November 26, 2024

అద్భుత అవతారమూర్తి భీష్ముడు

కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సేనాధిపతిగా 9 రోజులు అత్యంత వీరోచితంగా యుద్ధంచేసి అర్జునుని వాడి బాణాలచే నేలకూలి, అంపశయ్యపై శయనించి, తండ్రి శంతనుని ద్వారా పొందిన స్వచ్ఛంద మరణ వరంతో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా తన ప్రాణాలు నిల్పుకొని, మాఘ శుద్ధ సప్తమి నుండి తన పంచప్రాణాలను ఒక్కొక్కటిగా విడుస్తూ వచ్చిన భీష్ముడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాఘ శుద్ధ ఏకాదశి రోజున, సాక్షాత్‌ శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీకృష్ణుని కోరికపై, ఆయన ఎదుట మహమాన్వితములైన విష్ణు సహస్ర నామాలను, ప్రత్యక్షంగా పాండవులకు, పరోక్షంగా సకల మానవాళికి బోధించాడు. కాబట్టి భీష్మ ఏకాదశి ఎంతో పుణ్యమైన, పవిత్రమైన దినంగా ప్రసిద్ధి చెందింది. నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా ఆ అద్భుత అవతార మూర్తిని స్మరించుకుందాం.
శ్రీకృష్ణుడు మహావిష్ణువు అవతారమని తెలిసిన మహాజ్ఞా ని భీష్ముడు. ధర్మశాస్త్రం, రాజనీతి శాస్త్రం, తత్వశా స్త్రం, యుద్ధతంత్రం లాంటివెన్నో ఆయనకు కరతలామ లకాలు. కేవలం తెలియడమే కాదు. వాటిని స్వయంగా ఆచరిం చి చూపినవాడు ఆయన. అందుకే భీష్మా’చార్యుని’గా గౌరవింప బడినాడు. దేవవ్రతుడు… గాంగేయుడు… భీష్ముడుగా వ్యవహ రింపబడిన ధర్మస్వరూపుడు కురు పితామహుడు అయిన ఆయనను దేవతలు తమ ధర్మసందేహాలను నివృత్తి చేసుకోడా నికి తరచుగా సంప్రదించేవారని మహాభారతం చెబుతుంది. ఆజన్మ బ్రహ్మచారిగా జీవించి, తాను మరణించేదాకా కురు వంశ పరిరక్షకునిగా ఉంటాననే భీషణ ప్రతిజ్ఞ చేసి, దానికి కట్టు బడి ఉన్నందున భీష్ముడని పిలువబడినాడు.
తండ్రి శంతన మహారాజు ఆనందంకోసం తండ్రి వివాహమాడ దలచిన సత్యవతి తన సంతానాన్నే కురు రాజ్య పాలకునిగా చేయాలని పెట్టిన నిబంధన మేరకు స్వచ్ఛందంగా కఠోర బ్రహ్మ చర్యాన్ని స్వీకరించి తాను కేవలం రాజసలహాదారునిగా, రాజ్య పరిరక్ష కునిగా ఉండిపోయాడు.
పసిపిల్లవాడిని తీసుకుని మాయమైన గంగాదేవి దేవవ్రతు డు యుక్తవయసుకు వచ్చాక తిరిగి కుమారుడుని తీసుకువచ్చి శంతనుడుకు ఇస్తూ ఇలా చెబుతుంది. ”వశిష్టుని వద్ద వేదాలు, శుక్రాచార్యుని వద్ద నీతి శాస్త్రము, బృహస్పతి వద్ద సదాచారము, పరశురాముని వద్ద సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్పించాను. అన్నింటి కంటే ధర్మనిష్టా గరిష్టునిగా తీర్చిదిద్దాను. ఇప్పుడు నీకు ఇస్తున్నాను. యువరాజుగా పట్టాభిషేకం చేసి ఆనం దించు” అని చెప్పి అదృశ్యమయింది. తరువాత యువరాజుగా దేవవ్రతుడు అందరి మన్ననలు పొందుతూ తండ్రికి చేదోడువా దోడుగా నిలిచాడు. కాలం విచిత్రమయినది, ఒకనాడు శంతనుడు దాశ రాజు పుత్రిక అయిన సత్యవతిని మోహించాడు. దాశరాజును అడిగాడు కాని తన కుమార్తెకు జన్మిం చిన సంతానానికే రాజ్యం కట్టబెట్టాలని షరతు పెట్టాడు. శంతనుడు ఆలోచనలో పడి హస్తినాపు రం చేరుకున్నాడు. విచారగ్రస్తుడై ఉన్న తండ్రిని చూసి దేవవ్రతుడు విషయం అడిగి తెలుసుకున్నా డు. వెంటనే దాశరాజు వద్దకు వెళ్ళి నా తండ్రి ఆనం దం కోసం, సుఖం కోసం నేను రాజ్యాధికారాన్ని వదులుకొంటున్నాను. నాకు సంతానమే లేకుండా ఆజన్మ బ్రహ్మచారిగా వివాహం చేసుకోకుండా ఉంటా నని భీష్మించి ప్రతిజ్ఞ చేసి దాశరాజును, సత్యవతిని తీసుకువచ్చి శంతనునికి అప్పగించాడు. అప్పటి నుండి దేవవ్రతుడు భీష్ముని గా ఖ్యాతిగాంచాడు. అతని త్యాగానికి తండ్రి శంతనుడు స్వేచ్ఛా మరణాన్ని వరంగా ఇచ్చాడు.
ధర్మవర్తనుడైన భీష్ముడు జీవితమంతా కురు సామ్రాజ్యా న్ని పరిరక్షించడంలోనే గడిపాడు. ధర్మాధర్మ విచక్షణా నిర్ణయా లలో నలిగిపోయాడు. అనేక క్షోభలకు గురయ్యాడు. చివరకు విధివశాత్తు అధర్మం వైపుకు యుద్ధం చేయాల్సి వచ్చింది. భీష్ము ని నాయకత్వంలో పదిరోజులు యుద్ధం జరిగింది. పాండవసేన చాలావరకు తరిగిపోయింది. అటువంటి పరిస్థితిలో ధర్మరాజు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, ధర్మానికి భంగం లేకుండా భీష్ముని ఓడిం చే మార్గం చెప్పమని కోరాడు. అప్పుడు భగవానుడు తండ్రి కోసం జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప త్యాగి, పైగా మీ పితామ హుడు కావున ఆ మహాజ్ఞానిని నీ విజయం కోసం సలహా ఇమ్మని ఆయననే కోరడంలో నీవు అభ్యంతరం పడవు కదా! అన్నాడు. అంత ధర్మరాజు అంగీకరించడంతో పాండవులు భీష్ముని వద్దకు వెళ్ళి ఏ ఉపాయంతో ఈ మారణహోమం ఆగుతుందో తెలియ చేయమని కోరారు. అంత భీష్ముడు వాసుదేవునికి నమ స్కరించి ”నన్ను వధిస్తే గానీ నీకు విజయం దక్కదు. నా చేతిలో ఆయుధ ముండగా అది అసాధ్యం. కావున నేను స్త్రీలతో, స్త్రీ నామం ఉన్న వారితో, స్త్రీగా జన్మించి తరువాత పురుషునిగా మారిన వారితో యుద్ధం చేయను. మీ పక్షంలో అటువంటి వాడు శిఖండి. ఇక మీ ప్రణాళిక రూపొందించుకోండి” అని చెప్పాడు.
పదిరోజులలో భీష్మాచార్యుడు అనేక వీరులను వధించా డు. నిజానికి ఆయనలో గొప్ప నిర్వేదం కలిగింది. అదే సమయం లో శిఖండిని ఎదురు నిలిపి అర్జునుడు యుద్ధానికి సిద్ధపడ్డాడు. నిర్వేదంలోనున్న భీష్ముడు శిఖండిని చూచి ఆయుధాలు విడిచి పెట్టాడు. అర్జునుడు, శిఖండి ఆయనపై తమ శరపరంపరను కొనసాగించారు. భీష్ముని దేహమంతా బాణాలతో నిండిపో యింది. పాండవులు తీవ్రమైన దు:ఖానికి లోనయ్యారు. యుద్ధనియమం ప్రకారం ఒక్క శిరస్సు తప్ప దేహమంతా శర మయ్యింది. సూర్యాస్తమయమయింది. కురుపితామహుడు రథం నుండి క్రిందకి దిగి భూమిపై పడిపోయాడు. అయితే దేహ మంతా బాణాలుండడం వల్ల ఆయన దేహం భూమిని తాకలేదు. ఆ అంపశయ్యపైనే పుణ్యకాలమైన ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ అలాగే ఉండిపోయాడు త్యాగశీలి భీష్ముడు. ఇరుపక్షాల వారు ఆయన చుట్టూ చేరారు. మానవుడైన ఆయన శరశయ్యపై నుండే అనేక ధర్మసూత్రాలను, విష్ణు సహస్ర నామాలతో శ్రీకృష్ణ భగవానుని స్తుతించి వాటిని సమస్త మానవాళికి అందించిన మహోన్నతుడు. శ్రీకృష్ణుని అనుమతితో భిన్నమైన యోగక్రియ తో బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణాలను భగవానునిలో ఐక్యం చేసాడు. చరితలో అద్భుత అవతారమూర్తిగా నిలిచాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement