వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు కొన్ని పనులు తప్పకుండా చేయాలి. పొర పాటున కూడా కొన్ని పనులను చేయకూడదు. ఈ రోజు చేయాల్సిన పను లు, చేయకూడనివి ఏమిటో తెలుసుకుందాం.
ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి.
వరలక్ష్మీ వ్రతం చేసేవారు చాలా ప్రశాంతంగా ఉండాలి.
భక్తి శద్ధలతో అమ్మవారిని పూజించాలి.
ఇంటి గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. బియ్యంపిండి తో సింహద్వారం గడపపై ముగ్గులు వేయాలి.
తెల్లవారుజామునే నిద్రలేచి వాకిట ముగ్గులు పెట్టి తలస్నానం చేయాలి.
ఇంటిని మామిడితోరణాలతో అలంకరించాలి.
లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే శుభం. అందుకుగాను ఈశాన్యభా గంలో ముగ్గులు వేసి పూజకు స్థలాన్ని సిద్ధం చేయాలి.
ముగ్గుపై పసుపురాసి ముగ్గులు పెట్టిన పీటను వేయాలి.
పీటపై తెల్లటి వస్త్రం పరిచి, బియ్యం పోసి దానిపై కలశాన్ని ప్రతిష్టించు కోవాలి.
తొమ్మిది పోచలు దారాన్ని తీసుకుని పసుపురాసి తొమ్మిడి ముడులు వేసి తోరాలను సిద్ధం చేసుకోవాలి.
అమ్మవారికి ఆవునెయ్యి అంటే ఇష్టం. ఆవునేతి దీపాలను వెలిగించాలి.
ఆవుపాలతో చేసి న పరమాన్నం నివేదిస్తే అమ్మవారు ప్రసన్నులవుతారు వీటితోపాటు ఎవరి శక్తి కొలది వారు మూడు, అయిదు, తొమ్మిది రకాల పిండివంటలను అమ్మవారి నైవేద్యానికి సిద్ధం చేసుకోవాలి.
కొబ్బరికాయ, అరటిపండ్లు అంటే అమ్మవారికి ప్రీతికరం. కాబట్టి అవి కూడా రెడీ చేసుకోవాలి.
పూజ అనంతరం మహాలక్ష్మి అష్టకమ్, కనకధారాస్తవం, లక్ష్మీ సహస్రనా మం, అష్టలక్ష్మీ స్తోత్రం చదివితే అమ్మవారు మరింత ప్రసన్నురాలవుతుం దని పెద్దల మాట.
మహాలక్ష్మకి షడ్రసోపేత మహానైవేద్యం అయిన తర్వాత ఒక ముత్తైదు వుకు తొమ్మిది బూరెలు కానీ, తొమ్మిది గారెలు కానీ దక్షిణతోపాటు వాయ నం ఇవ్వాలి.
వరలక్ష్మి పూజ రోజున ఇంట్లో శాకాహారమే భుజించాలి.
ముత్తైదువుకు వాయనం ఇచ్చి పంపిన తర్వాతనే భోజనం చేయాలి.
పూజ చేసుకున్నవారు రాత్రి భోజనం చేయకూడదు. టిఫిను చేయాలి.
పూజ అయిన తర్వాత వరలక్ష్మీదేవికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వాసన చె ప్ప కూడదు. అలా చెబితే ఇంటి నుంచి లక్ష్మీదేవిని పంపినట్లే అవుతుంది.
ఈ రోజు దానం చేస్తే కోటిజన్మల పుణ్యం లభిస్తుందని పండితులు చెబు తున్నారు.
పూజ ముగిసేదాకా ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు.
పూజ చేసుకున్నవారు ఎవరితోనూ పరుషంగా మాట్లాడకూడదు. ఎవ రినీ తిట్టకూడదు. ప్రశాంతంగా వుండాలి.
ఆచరించాల్సిన విధులు
Advertisement
తాజా వార్తలు
Advertisement