Monday, November 18, 2024

అచంచల విశ్వాసం

విశ్వాసం అనేది అతి విశిష్టమైనది. విలక్షణమైనది. బలోపేతమైనది. బల వత్తరమైనది. విశ్వాసమే అన్నిటికీ పునాది. విశ్వాసం ఉన్నచోట అన్నీ ఉంటాయి. విశ్వాసం ఉన్నవాడు విలక్షణుడవుతాడు. విశిష్టుడవుతాడు. వశి ష్టుడవుతాడు. విశ్వాసం శ్వాసను నింపుతుంది. శ్వాసను పెంచుతుంది. విశ్వాసం మనసుని కదలిస్తుంది. మనషిని కదిలిస్తుంది. మనిషిని మనీషిని, మహతాత్ము డ్ని, మహోన్నతుడ్ని చేస్తుంది. విశ్వాసం విశ్వాన్ని నడిపిస్తుంది. విశ్వానికి నడక లు నేర్పుతుంది. విశ్వాన్నంతటినీ పాదాక్రాంతం చేస్తుంది. విశ్వాన్ని గెలుస్తుంది.
అయితే విశ్వాసమనేది ఎలా ఉండాలి? ఏ రకమైన విశ్వాసం ఉండాలి? విశ్వాసమనేది నిశ్చలంగా ఉండాలి. అచంచలమై ఉండాలి. అచంచలమైన పరి పూర్ణ విశ్వాసం ఉండాలి. అయితే అచంచలమైన విశ్వాసమంటే? అదెలా ఉం టుంది? విచారణ చేద్దాం.
సాయం సమయంలో మనం సముద్రం ఒడ్డుకి వెళ్లి కూచుంటాం. అలలు ఎదురుగా ఎగసెగసి పడుతుంటాయి. దగ్గరలో ఉన్న పెద్దరాయికి కెరటాలు చెళ్ళున తగులుతూ ఉంటాయి. నిరంతరాయంగా కెరటాలు రాయిని తాకుతుం టాయి. రాపిడి పుట్టిస్తూ ఉంటాయి. అయినా ఆ రాయి మాత్రం ఏమాత్రం పట్టిం చుకోదు. ఏమాత్రం సడలిపోదు. కరిగిపోదు. కదిలిపోదు. ఒరిగిపోదు. ఒంగి పోదు. బలహనమైపోదు. అలా నిటారుగా నిలబడుతుంది. నిశ్చలంగా నిర్మలం గా తొణకక బెణకక అలా నిలబడి ఉంటుంది. నిశ్చింతగా ఉంటుంది. అదీ అచం చలమైన విశ్వాసమంటే!
జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తలదించక, తలవంచక, అన్నిటికీ భగవంతుడున్నాడు, అన్నీ తానే చూసుకుంటాడనే పరిపూర్ణ విశ్వాసమే అచంచ లమైన విశ్వాసం.
పూర్వం ఓ ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళిద్దరిలో ఒకరు పరమ ఆస్తికుడు. మరొకడు కరడుగట్టిన నాస్తికుడు. ఆస్తికుడు సర్వదా దైవస్పృహలో ఉంటాడు. నామజపం చేస్తుంటాడు. పూజలు, వ్రతాలు వగైరా చేస్తుంటాడు. ఆ ధ్యాత్మిక గ్రంథాలు చదువుతుంటాడు. భజనలు, కీర్తనలలో మునిగి తేలుతుం టాడు. మొత్తానికి సమస్తమూ అతనికి భగవంతుడు, భగవత్తత్వమే. అంతా అత నికి దైవమయమే.
ఇక రెండోవాడు. పదహారణాల దైవ వ్యతిరేకి. దేవుడికి కనీస గౌరవం కూడా ఈయడు. భగవంతుని విషయాలంటే అంతెత్తున లేస్తాడు. దేవుడ్ని చులకన చేస్తూ మాట్లాడతాడు. వితర్కం, కుతర్కంతో దేవుడ్ని ఏమాత్రం అవకాశం దొరి కినా తూర్పార బట్టడమే రెండోవాడి వ్యాపకం. మొత్తానికి దేవుడి విషయంలో మిత్రులిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది.
కొంత కాలం తర్వాత మిత్రులిద్దరూ ఓ చోటుకి కాలినడకన వెళ్తున్నారు. ఎత్తుపల్లాలతో గుంతలతో రోడ్డు ఎగుడు దిగుడుగా ఉంది. రోడ్డుకి వేసిన కంకర బైటకొచ్చి నోరెళ్ళబెడుతోంది. దారిలో ఓచోట ఆస్తికుడి కాలికి రాయి తగిలి గాయమయ్యింది. కాలికి కట్టు కట్టుకున్న తర్వాత మిత్రులిద్దరూ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరికొంత దూరం వెళ్ళాక నాస్తికుడికి చిన్న బంగారు ఉంగ రం దొరికింది. దొరికిన అవకాశాన్ని ఆస్తిక మిత్రుడి మీద నాస్తిక మిత్రుడు ఉప యోగించాడు.
”మిత్రమా! నువ్వేమో అనుక్షణం దేవుడు దేవుడని దేబిరిస్తూ ఉంటావు. అన్నీ దేవుడే చూసుకుంటాడని అనుకుంటూ ఉంటావు. అలాంటి నీకు ఏం జరి గింది? దెబ్బ తగిలి కాలికి గాయమైంది. దైవాన్ని నమ్ముకోవడం వల్ల లాభం జరి గింది? అంటూ ఎగతాళి చేసాడు నాస్తికుడు. అంతటితో ఊరుకోకుండా నాకేమో బంగారు ఉంగరం దొరికింది. దేవుడ్ని విశ్వసించడం వల్ల నీకు కాలుకి దెబ్బ తగి లింది . దైవత్వం అనేది ఓ మిధ్య, దేవుడు లేనే లేడని చెప్పే నాకు బంగారు ఉం గరం దొరికింది. ఎవరికి మేలు జరిగింది? దేవుడి ఉనికినే ప్రశ్నిస్తున్న నాకే మంచి జరిగింది. ఇప్పటికైనా దేవుడు లేడనే నాస్తిక వాదమే నిజమని తెలుసుకో” అని ఆస్తికుడిపై పైచేయి సాధించేందుకు నాస్తికుడు ప్రయిత్నించాడు. ఆస్తికుడికి ఏం అనాలో, ఏం చేయాలో తోచలేదు. జరుగుతున్నది అర్ధం కాక విచారం పట్టుకుం ది. రాత్రి భోజనాలయ్యాక మిత్రులిద్దరూ ఓ చోట పడుకున్నారు.
నిద్రలో ఆస్తికుడికి ఓ కల వచ్చింది. కలలో సాక్షాత్తూ తను నమ్మే దేవుడు కని పించి యిలా చెప్పాడు. రోడ్డుమీద పడి ఉన్న రాయి వల్ల నీకు గాయమైందని ను వ్వు అనవసరంగా బాధపడకు. నిజానికి ఓ కాలసర్పం కాటుతో నువ్వివాళ మర ణించవలసి ఉంది. నీకు నా మీద ఉన్న అచంచలమైన భక్తి, విశ్వాసం కారణంగా కాలసర్పం కాటు నీకు తప్పింది. అందుకు బదులుగా నీ కాలికి రాయి తగిలి చిన్న గాయంతో పెద్ద ప్రమాదం తప్పి బ్రతికి పోయేవు. అందుకు సంతోషించు.
ఇక నీ మిత్రుని సంగతి. ఈ రోజు నీ మిత్రుడికి వేలవేల కోట్ల విలువైన ఓ పెద్ద నిధి లభించవలసి ఉంది. అయితే అతడి నాస్తికత్వం కారణంగా, దైవద్వేషం, దూషణ కారణంగా ఆ నిధి వంతు కేవలం చిన్న బంగారు ఉంగరమే నీ మిత్రుడికి దొరికింది. అది గ్రహంచు అని చెప్పి దేవుడు అంతర్ధానమయ్యాడు.
దైవం మీద విశ్వాసం వలన కలిగే మేలును, అదే సమయంలో దైవం మీద వ్యతిరేకత వల్ల వచ్చే ముప్పును సవివరంగా చెప్పే చిన్నకథ యిది.
అందుకే దైవం మీద మనం అచంచలమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి. అనవసరమైన దైవ వ్యతిరేకతను త్రుంచుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement