Friday, November 22, 2024

భగవంతుని నివాస స్థానం!

అనేక తలలు అనేక ముఖాలు అనేక కళ్ళు అనేక కాళ్ళతో భగవంతుడు అంతటా వ్యాపించి ఉంటాడు. అన్నింటా భగ వంతుడు ఉంటాడనే విషయాన్ని ”సహస్ర శీర్షా: పురుష: సహస్రాక్ష సహస్ర పాద్‌…” అంటూ పురుష సూక్తం వివరి స్తోంది. భగవంతుడు ఉండే ప్రదేశాన్ని, మరోవిధంగా, మరో ఇలా చెబుతారు. భక్తుడి హృదయంలో భగవంతుడు ఉంటా డు అంటారు. భగవంతుడు హృదయ నివాసి అని అంటారు. భక్తుడి హృదయం భగవంతుని నివాస స్థానం అని చెబుతారు.
భగవంతుడు ఉండే స్థానం విషయంలో పైన చెప్పిన రెం డూ భిన్నంగా ఉన్నట్టు అనిపిస్తాయి. భగవం తుడు సర్వత్రా ఉంటాడని ఓవైపు చెబుతూనే, మరోపక్క భక్తుడి హృదయం లో భగవంతుడు ఉంటాడు అనే విషయం విన్నప్పుడు/ చెప్పి నప్పుడు, ఏమిటీ గందర గోళం అనిపిస్తుంది. పరస్పర విరు ద్ధంగా అనిపించే ఈ రెండు విషయాలకు సమన్వయం కుద రక అయోమయంలో పడిపోతాం. విషయం ఏమిటో అర్ధం కాక ఆధ్యాత్మికమంటే అర్థంకాని బ్రహ్మ పదార్ధంగా భావిస్తాం.
ఓసారి ఓ కుర్రాడికి ఈ సందేహమే వచ్చింది. తల, నుదు రు, కాళ్ళు, భుజాలు, చేతులు, పొట్ట, ఇలా ఎన్నో భాగాలు భక్తు డి శరీరంలో ఉండగా, భక్తుడి హృదయాన్నే తానుండే స్థానం గా, ఆ భగవంతుడు ఎందుకు ఎంచుకున్నాడో ఎంతగా ఆలో చించినా అంతు చిక్కలేదు ఆ కుర్రాడికి. ఎందరినో ఈ విష యం గురించి ఆ కుర్రాడు అడిగాడు. ఎవరూ సరైన సమాధా నం చెప్పలేకపోయారు. చివరకు ఆ కుర్రాడు తిన్నగా పెద్ద గురు వుగారి దగ్గరికి వెళ్లాడు. విషయం అంతా చెప్పి తన సందేహాన్ని నివృత్తి చేయమని గురువుని ప్రార్ధించాడు.
అప్పుడు గురువుగారు… ”వెయ్యి ఎకరాల భూమి ఉన్న ఓ జమీందార్‌ తనకు ఇష్టమైన చోట తాను నివాసం ఉంటే, అది తప్పని ఆయన్ని ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉంటుందా?” అని ఆ కుర్రాణ్ణి ప్రశ్నించారు.
”ఆయన స్థలం ఆయన ఇష్టం. ప్రశ్నించేహక్కు ఎవరికీ ఉండదు.” అని సమాధానమిచ్చాడు కుర్రాడు. అప్పుడు గురు వుగారు ”ఆ వెయ్యి ఎకరాల్లో మనం ఓ ప్రాంతాన్ని ఎంచుకుని, అందులో ఒక ప్రదేశాన్ని చూపిం చి, అందులో మీరు ఉండండి అని మనం జమీందార్‌ని ఆజ్ఞాపించగలమా? అని మరో ప్రశ్న వేసారు గురువుగారు. ‘ఆజ్ఞాపించలేం.’ అని సమాధానమిచ్చా డు కుర్రాడు. అప్పుడు గురువుగారు ”అయితే ఆ జమీందార్‌ గాలీ వెలుతురు బాగా వచ్చే అనువైన స్థలాన్ని తానే ఎంచుకుని, తనకు అనుకూలమైన స్థలంలో నివాసం ఏర్పాటు చేసు కుంటా డు. అవునా?” అని ఆ కుర్రాణ్ణి ప్రశ్నించారు. ”అవును. ఆ జమీందార్‌ అలానే చేస్తాడు. అది అతనిష్టం.” అని సమాధాన మిచ్చాడు కుర్రాడు.
”అవును కదా! భగవంతుడు కూడా అంతే! సర్వం సమ స్తం ఆ భగవంతునిదే కాబట్టి తనకు అనువైన అనుకూలమైన చోటు, శుభ్రమైన చోటు, పరిశుద్ధమైన చోటు హృదయం కాబట్టి, భక్తుడి హృదయాన్ని తన నివాస స్థానంగా భగవం తుడు ఎంచుకున్నాడు.” అని చెప్పటాన్ని కొంచెం ఆపి శిష్యుడి వైపు చూసారు గురువుగారు. ఆశ్చర్యంగా వింటున్నాడు శిష్యు డు.”దేవుడు నివాసం ఉండే చోటును నిర్మలంగా పవిత్రంగా స్వచ్ఛంగా భక్తుడు ఉంచుకోవాలనుకుంటే, ఉంచుకోవడానికి అవకాశం ఉండేది శరీరం మొత్తంలో ఒక్క హృదయం మాత్ర మే అనువైనది. కాబట్టి భక్తుడికి ఆ సౌలభ్యం ఇవ్వడం కోసమే భక్తుడి హృదయాన్నే తన నివాసంగా భగవంతుడు ఎంపిక చేసుకున్నాడు.” అని చెప్పటం ముగించారు గురువుగారు.
శిష్యుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. విషయం పూర్తిగా అర్థమైంది.భగవంతుడు తన నివాసంగా భక్తుని హృ దయాన్ని ఎందుకు ఎంచుకున్నాడో చెప్పేందుకు చమత్కా రంతో కూడిన సహతుకమైన గమ్మత్తయిన కథ యిది.
అందుకే ”ఆధ్యాత్మికాన్ని అర్ధం చేసుకోవటంలోనే ఉంది ఆధ్యాత్మిక రహస్యమంతా.” అన్నారు పెద్దలు. సాధన చేసి ఆధ్యాత్మికాన్ని అర్ధం చేసుకోవాలి. ఆచరించి అనుభవానికి తెచ్చుకోవాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement