Friday, November 22, 2024

అభయ ప్రదాత… హేరంబ గణపతి!

విఘ్నరాజు వినాయకుని… గజా ననుడు… గణాధిపతి… మోదకప్రియుడు… లక్ష్మీగణ పతి… హేరంబ గణపతి… ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. అసలు వినాయకుని హరంబ గణపతి అని ఎందుకు పిలు స్తారో తెలుసా!!
మానవాళికి వారు చేసే పాపాల వల్ల దు:ఖం కలుగు తుంది. తెలిసో తెలియకో పాపం చేసి భరించరాని ఆ దు: ఖాన్ని అనుభవిస్తూ ఇక ఆపాపా లను చెయ్యబోము, మరి మాకు తరుణో పాయమేది అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారికి దు:ఖా న్ని పోగొట్టుకొనేందుకు తగిన సాధనంగా హరంబోపనిషత్‌ కనిపిస్తుంది. గణపతి రూపాలలో హరంబ గణ పతి అనే ఓ రూపం ఉంటుంది. ఈ రూపంలోని స్వామిని ఆరాధిస్తే కలిగే మేలు అంతా ఇంతా కాదు. హరంబ గణపతికి పది చేతులుంటాయి. అభయ ముద్ర, వరదముద్ర, పాశం, దంతం, రుద్రాక్షమాల, పాశం, గొడ్డలి, ముద్గరం, దండం, పద్మాలను ఆ చేతులతో ధరించి ఉంటాడు. తొండంతో మోదకాన్ని ధరించి సింహ వాహనాన్ని ఎక్కి ఉంటాడు. ఈ స్వామికి ఐదు గజ ముఖాలుంటా యి. ఈ స్వామిని ధ్యానిస్తే సర్వశుభాలు, విజయాలు చేజిక్కుతాయి. ఈ విషయాన్ని హరంబో పనిషత్‌ ప్రారంభంలో సాక్షాత్తూ పరమేశ్వ రుడు పార్వతీదేవికి వివరించి చెప్పాడు. ప్రాణులంతా ఎలా దు:ఖాలను పోగొట్టుకొని సుఖాలను పొందగలరు? దానికి సంబంధించి న ఉపా యాన్ని చెప్పమని పార్వతి శివుడిని అడుగుతుంది. అప్పుడు శివుడు తన అనుభవంలోకి వచ్చిన విషయాన్నే ఆమెకు వివ రించి చెప్పాడు. పూర్వం త్రిపురాసుర సంహారం దేవతలంద రికీ గొప్ప కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎంతమంది దేవతలు ఎన్ని విధాలుగా పోరాడినా ఫలితం లేకపోయింది. చివరకు లయ కారకుడైన ఈశ్వరుడే స్వయంగా యుద్ధ రంగంలోకి దిగా డు. తన యోగబలంతో సహా ఎన్ని బలాలను ప్రయో గించినా శత్రు సంహారం సాధ్యంకాలేదు. అప్పుడు హరంబ గణపతిని ధ్యానిం చి పరమాత్మ సారభూతమైన ఆ గణపతి శక్తిని పొంది దాన్ని తన బాణంలో నిక్షిప్తం చేసి శత్రువు మీదకు సంధించాడు శివుడు. ఆ మరుక్షణంలోనే త్రిపుర సంహారం జరిగిపోయింది. బ్రహ్మ, విష్ణు తదితర దేవతలు కూడా హరంబ గణపతి రక్ష వల్లనే తమతమ స్థానాలలో సుఖంగా ఉండగలుగుతున్నారు. ఈ కారణంవల్లే తొలివేల్పుగా, సర్వదేవతా పూజనీయుడిగా గణేశుడు వెలుగొందుతున్నాడు. ఈ విఘ్నరాజు ప్రభువులకే ప్రభువు. ఆయనను ఉపాసించి సంసార సాగరం నుంచి, కష్టాల కడలి నుంచి సుఖంగా బయటపడవచ్చని శివుడు పార్వతికి తెలియ చెప్పాడు. గణపతి సింధూర వర్ణంతో అలరారుతుంటాడు. ఆయన అతి పురాతనుడు. ఆ స్వామి పక్కన లక్ష్మి ఉంటుంది. ఆయనను పూజించినా, ధ్యానించినా సర్వ శుభాలూ సమకూరుతాయి. ఆయన వల్లనే మునులు కూడా సంసార సాగరాన్ని దాటగలుగుతున్నారు. ఆయనే బ్రహ్మ. ఆయనే హరి. ఇంద్రుడు, చంద్రుడు, పరమాత్మ, సమస్త జగత్తుకూ సాక్షి. అభయప్రదాత కూడా ఆయనే. మాన వాళి దు:ఖాలను పోగొట్టుకోవటం కోసం ఆ స్వామిని పూజించ టం కంటే సులభ మైన మార్గం మరొకటి లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement