భక్తులకు అభయమిచ్చి మోక్ష ప్రాప్తి కలిగించేవారు పరమాత్మ. ఆ పర మాత్మ స్వరూపులే వేదవ్యాసుల వా రు. దు:ఖితులకు అభయమిచ్చి దు:ఖ స్పర్శలేని పరమపదం వైపుకు నడిపిస్తూ మోక్షం ప్రసాదించు తపస్వి.
అటు మహాభారతం చూస్తే భక్తికి, ధ ర్మానికి నిదర్శనమైన ధర్మరాజుకు అడుగ డుగునా తోడ్పడి, అండగ నిలిచి, అత్యవస ర సమయాలో నేనున్నాను అని అభయా న్ని అందించిన అవతారమూర్తి వ్యాసదేవుల వారు. యుద్ధం వలన కలిగిన అశాంతి నివారణ అయి స్థిరమయిన సామ్రాజ్యం ఏర్పడాలంటే ధర్మరాజు చేత అశ్వమేధ యాగం చేయటానికి ప్రోత్సహంచారు. కానీ ఆ యాగానికి కావలసిన ధనం ధర్మరాజు వద్దలేదు. అటు వంటి సమయంలో వ్యాసులవారు ధర్మరాజును ధనం లేద ని నీవు భయపడకు అని అభయం ఇచ్చి, హమాలయాలలో మరుత్తు మహారాజు దాచియుంచిన నిధి కలదు అని చెప్పి స్వయంగా తన పర్యవేక్షణలోనే శాస్త్రోక్తంగా రక్షా మంత్రా లతో పూజ జరిపి ఆ నిధిని సాధించిపెట్టారు. ఈ విధంగా అనేక సందర్భాలలో మహాభారతంలో అభయప్రదాతగా మన తండ్రి తన భక్తులను రక్షించారు. కీటకానికి సైతం అభ యప్రదాతగా నిలిచి ముక్తిని ప్రసాదించారు వ్యాసులవారు.
అనన్యభక్తితో ఆ ఏకైక పరమాత్మను స్మరిస్తూ, పట్టుకు ని ఉన్నట్లయితే మోక్షం పొందుతారని అభయమిచ్చిన మన తండ్రి వ్యాసభగవానుల వారిని స్మరించుకుందాం.
అభయ ప్రదాత…వేదవ్యాసుడు
Advertisement
తాజా వార్తలు
Advertisement