నేడు శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి
అమ్మవారి జయంతి.
”చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణ కర్మ విభాగశ:”
వారి వారి గుణాలు/స్వభావాలు, వారు చేస్తున్న పనులు/ వారి వృత్తులను బట్టి ప్రాచీన భారతీయ స మాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే చతుర్వ ర్ణాల సముదాయంగా పేర్కొనబడింది. ధ్యాన, జప, అధ్యయన, యజ్ఞాలు, శుద్ధ-సాత్విక గుణం కలిగిన బ్రా హ్మణులకు; పాలన, దండన, ప్రజాపరిరక్షణ- సత్వ గు ణం కలిగిన క్షత్రియులకు; కృషి, వాణిజ్యాలు రజోగు ణం గల వైశ్యులకు; సేవాధర్మం, చేతివృత్తులు, వ్యవ సాయం- తమోగుణం కలిగిన శూద్రులకు కులధర్మా లుగా ఆనాడు నిర్దేశింపబడ్డాయి.
వీరిలో వర్తక వాణిజ్యాలు ధర్మబద్ధముగా నిర్వ #హస్తూ, దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టంచేసే బాధ్యత అప్ప గించబడిన వారు వైశ్యులు. వీరినే ఆర్యవైశ్యులనికూడా వ్యవ#హరిస్తారు. ధర్మబద్ధంగా వ్యాపారం చేస్తూ, దాన ధర్మాలతో పేదప్రజల సేవ చేస్తూ, సమాజంలో విశిష్ట మైన జీవన సరళిని ఏర్పరచుకొన్న వీరి శ్రేష్ఠత్వానికి గుర్తుగా వీరి పేర్ల చివరన ‘శ్రేష్ఠి’ అనే బిరుద నామం చేరింది. కాలక్రమేణ ‘శెట్టి’గా పరిణామం చెందింది.
వైశ్యుల కుల దేవత శ్రీ వాసవీ కన్యకా పర మేశ్వరి. పదకొండవ శతాబ్దంలో పెనుగొండను పాలించిన కుసుమశ్రేష్ఠి, కుసుమాంబల ముద్దుబిడ్డగా ఆమె జన్మించింది. తల్లిదండ్రులు సంతానం కోసం చేసిన పుత్రకామేష్ఠి యజ్ఞ ఫలితముగా విరూపాక్షుడు అనే కవల సోదరునితో బాటు ప్రభవించిన కన్యక అం దచందాలతో, విద్యావినయాలు, గుణగణాలతోబాటు ఆధ్యాత్మిక విలువలనూ కలిగి అందరి మన్ననలనూ పొందింది. వివాహం చేసుకోకుండా కన్యగానే జీవిం చాలనే ప్రగాఢేచ్ఛ ఆమె తల్లి తండ్రులను కూడా విస్మితు లను చేసింది. ఆమె నిర్ణయానికి తలొగ్గి ఆమె సోదరు డు, విరూపాక్షుని వివా#హం రత్నావతితో అతి వైభవం గా జరిపించారు తల్లిదండ్రులు. వేంగిరాజ్య పాలకు డు, పాండవుల వంశంలోని వాడైన నాటి చాళుక్యరా జు విష్ణువర్ధనుడు తన సామంత రాజ్యమైన పెనుగొండ కు పర్యటనకు రాగా, కుసుమశ్రేష్ఠి, తదితరులు, ఆ చక్ర వర్తికి సకల రాజోచిత మర్యాదలనూ చేశారు. విమలా దిత్యుడనే మరొక పేరు కలిగిన విష్ణువర్ధనుడు పెను గొండ వైభవాన్ని చూచి ఆశ్చర్యపోయాడు. అంతకం టే ఎక్కువగా వింధ్యవాసినీదేవి దర్శనానికి వెడుతున్న వాసవాంబ అసామాన్యమైన సౌందర్యానికి విమోహ తుడైపోయాడు. ఆమెను తనకిచ్చి వివాహం జరిపించ వలసినదిగా కుసుమ శ్రేష్ఠికి తన మంత్రులతో కబురం పాడు. వయసులో వాసవాంబ కన్నా చాలా పెద్దవాడు, పెళ్ళీడుకు వచ్చిన కొడుకు ఉన్నవాడు అయిన చక్రవర్తి వాసవాంబను కోరడం కుసుమ శ్రేష్ఠి కుటుంబానికి నచ్చలేదు. పైగా తన కూతురు కన్యగానే జీవింపదలచి ఉంది. అలాగని బలవంతుడైన చక్రవర్తిని ఎదిరించ నూ లేడు. దిక్కుతోచని స్థితిలో కుసుమ శ్రేష్ఠి తన కుల గురువైన భాస్కరాచార్యుని ఆధ్వర్యంలో 714 గోత్రా లుగా విస్తరించి ఉన్న తమ ఆర్య వైశ్యులతో సమావేశ మయ్యాడు. వారిలో 612 గోత్రాలవారు విష్ణువర్ధనుని ఎదిరించడం బలవద్విరోధాన్ని కొని తెచ్చుకోవడమే ననీ, వాసవాంబను అతనికిచ్చి పెండ్లి జరిపిస్తే యుద్ధప్ర మాదం, అందువలన కలిగే కులక్ష యం అనే ముప్పు తప్పుతాయని భావించగా- 102 గోత్రాల వారు మా త్రం కుల ధర్మానికి విరుద్ధంగా, దైవాంశగా భావించ బడుతున్న వాసవిని ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా చక్ర వర్తికి అప్పగించడం తప్పని అభిప్రాయపడ్డారు. ఇంత లో అనూహ్యంగా వాసవీదేవి ఆ సమావేశ మందిరం లోకి ప్రవేశించింది. ”అన్నలారా, తండ్రులారా!/ ఆల కించండొక్క విన్నప/మాలు బిడ్డల కాసుకొనుటకు/ ఆశలేదొక్కో?” అంటూ ఒక వినూత్న ప్రణాళికతో చక్ర వర్తిని దెబ్బ తీయాలనుకొంటున్నాను. నేనతనిని నిరాకరిస్తే, అతడు మనపైకి దండెత్తి వచ్చి మన సైన్యాన్ని, పౌరులను ఊచకోత కోస్తాడు. అహంస, సత్యాగ్రహం అనే విధానంతో మనలను మనం ఆత్మా ర్పణ గావించుకొని అతనికి బుద్ధి చెబుదాం. దృఢమైన సంకల్పదీక్షతో నన్ను అనుసరించగలవారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొనగలరు అని ఆమె పలికిన పలు కులకు ఆమె తల్లిదండ్రులతో బాటు, 102 గోత్రాల వారు తమ అంగీకారాన్ని తెలిపారు.
గోదావరీ తీరంలో బ్రహ్మకుండమనే పావన ప్రదే శంలో 103 అగ్నిగుండాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు మాఘ శుద్ధ పాడ్యమి. తమ కన్ను పడిన కన్నెపిల్లలు తమ వశం కావలసిందే అని విర్రవీగే నాటి రాజుల ఆగ డాలకు చరమ గీతం పాడడానికి- ఆడపిల్లల అభిప్రా యాలకూ విలువనివ్వాలనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వ డానికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం కంటే ప్రాణాలు గొప్పవి కావని నిరూపించడానికి, ‘ఆత్మార్పణ’ మా ర్గాన్ని ఎంచుకొన్నది వాసవీమాత. తనతో బాటూ ఆ యజ్ఞంలో ఆహుతి కావడానికి సంసిద్ధులై ఉన్న 102 గోత్రాల వారికి తన నిజరూపాన్ని ప్రదర్శించింది ఆమె. తనతోబాటు తన 102 గోత్రాల వారికీ మోక్షం కావాల ని కోరుకొన్న ‘సమాధి’ అనే వైశ్య శ్రేష్ఠుడే ఇప్పుడు తన తండ్రియైన కుసుమ శ్రేష్ఠి అని, ఆయన యొక్క, తన యొక్క జన్మ వృత్తాంతాన్ని వివరించింది వాసవీదేవి.
”పట్టమేలే రాజు అయితే రాజునేలే దైవముండదొ?
పరువు నిలుపను పౌరుషము మీకేల కలుగదొకో?”
”కాసు వీసం కలిగి ఉంటే చాలుననుకొని, వీర్యమెరుగక/ విద్యనేర్వక బుద్ధి మాలినచో కలుగవా ఇక్కట్లు? మేల్కొని బుద్ధి బలమును, బాహుబలము ను/ పెంచి దైవమునందు భారం ఉంచి రాజులలో రాజులై మనుడయ్య.”
ఇలాంటి దేశభక్తి, నిజాయితీ, దేహ బలం, బుద్ధిబ లం, సమాజసేవల గురించి ప్రబోధించింది. రాజుతో ఇలా పలికింది: పట్టపగలే నట్టి వీధిని/ పట్టబోరే జార చోరులు/ పట్టదలచితివింక నీవొక/ పట్టమేలే రాజువ ట” అంటూ ఛీత్కరించింది.
”కండకావరమెక్కి నీవీ/ దుండగము తలపెట్టి నందుకు/ ఉండదా ఒక దైవమంటూ/ ఉండి ఊర్కొనునా?”
”కులం పెద్దలు కూడిరదుగో అగ్ని సాక్షికి అగ్ని అదుగో/ కన్ను కోరిన కన్నె ఇదిగో జాలమేలొక్కో”. ”పట్టమేలే రాజు వైతే పట్టు నన్నిపుడనుచు కన్యక/ చుట్టుముట్టిన మంటలోనికి మట్టి తా చనియెన్”. ఆ దృశ్యం చూచి తన గర్వం మట్టిలో కలిసిపోగా, రక్తం కక్కుకొని, తల పగిలి రాజు మరణించాడు. కోరుకొన్న కన్య లభించకపోగా అపకీర్తి ఆకస్మిక మరణం రాజును వరించాయి. గురుజాడ వారు అన్నట్లు ”పట్టమేలే రాజు గర్వం మట్టి కలిసెను/ పదం పద్యం పట్టి నిలిచెను కీర్తులపకీర్తుల్”. వాసవీ కన్యక కీర్తి, రాజు అపకీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచిపోయాయి.
విషయం తెలుసుకొని విష్ణువర్ధన చక్రవర్తి కుమా రుడు రాజరాజ నరేంద్రుడు పెనుగొండకు తరలి రాగా, విరూపాక్షుడు అతడిని స్నేహపూర్వకంగా పరామర్శిం చి, ”గతాన్ని మరచి నవ్యమైన భవిష్యత్తును నిర్మించు కొందాం” అంటూ చేయి కలిపాడు. అంగీకరించిన రాజరాజనరేంద్రుడు పెనుగొండలోని నగరేశ్వర స్వా మి దేవస్థానంలోనే వాసవీ మాత విగ్రహ ప్రతిష్ఠ ఘనం గా జరిపాడు. అప్పటినుండీ వైశ్యుల కుల దేవ తగా వాసవీ కన్యకా పరమేశ్వరి సర్వత్రా పూజలందుకొంటూ ఉంది. దాదాపు ప్రతి పట్టణంలోనూ ఆమెకు ఆలయా లు వెలిశాయి. ఈ రోజు… అంటే వైశాఖ శుద్ధ దశమి శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి. శాంతి ని, అహంసను, ఆత్మాభిమానాన్ని, మహళల ఆత్మ గౌరవాన్ని, ఆర్యవైశ్యుల కీర్తిని నిలబెట్టినందుకు విశ్వ మంతా ఆమెకు నీరాజనాలర్పించే రోజు. ఆ తల్లిని పూజించి, ఆమె బోధనలను ఆచరించి పునీతులమవు దాం. ”శుభం కురు మహాదేవి వాసవ్యై తే నమోనమ:”.
(ఈ వ్యాసంలో పేర్కొన్న కవితా పంక్తులన్నీ మహాకవి గురజాడ అప్పారావుగారి ‘కన్యక’ ఖండికలో నివి. వారికి కృతజ్ఞతా పూర్వక నివాళులు.)