సౌజ్యం త్రివర్తి సంయుక్తం వహ్ననా యోజితం మయా,
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే
త్రాహమాం నరకార్ణోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే!
శ్రేష్ఠమైన నేతిలో మూడువత్తులతో వెలుగొందుచూ, మూడు లోకాల యొక్క గాడాం ధకారాన్ని పోగొట్టగల మంగళప్రదమైన జ్యోతి త్రయాన్ని వెలిగించి సర్వాంతర్యామియైన నీకు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. దివ్యజ్యోతి స్వరూపమైన ఓ దైవమా! నన్ను ఈ ఘోర నరకం నుండి రక్షించు.
ఇలా స్వామిని వేడుకుంటూ దీపారాధన చేస్తూ హారతులనిస్తుంటాం. హారతి భక్తుని లోని ఆత్మకు ప్రతీక. హారతి భక్తునిలో ఓ దివ్యతేజాన్ని కలిగిస్తుంది. ఆ పరంధామునిపై మనసును లగ్నం చేయడానికి హారతి ఉపకరిస్తుంది. దేవుని పూజలో ధూపదీపాల్లాగే, కర్పూరంతో ఇచ్చే మంగళహారతికి. కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది.
కర్పూరం చంద్ర సంకాశం జ్యోతి స్పూర్య మివోదితం|
భక్త్యా దాస్యామి కర్పూర నీరాజన మిదం శివం||
అంటూ కర్పూరంతో ఇచ్చే హారతిని నీరాజనం అంటారు. ఇంతేకాక హారతిని నేతిలో నానబెట్టిన దూది వత్తులతో కూడా కొన్ని సందర్భాలలో ఇస్తారు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, పదకొండు, పదహారు, ఇరవై ఒకటి ఇలా వివిధ సంఖ్యల వత్తులతో హారతులిస్తారు. కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకా లలోనూ, #హందువులు తమ పూజా కార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయో గిస్తారు. పురాతన కాలంలో స్వల్పంగా దీపాల కాంతి ఉన్నపుడు భగవంతుని రూపం అంత స్పష్టంగా కనిపించేది కాదు. అప్పుడు హారతి ఇస్తే ఆ వెలుగులో చక్కగా స్పష్టంగా భగ వంతుని మూర్తిని దర్శించే భాగ్యం భక్తులకు కలిగేది. హారతి సంప్రదాయానికి ఇంత ప్రాము ఖ్యత రావడానికి ఇది ఒక కారణం కావచ్చును. అయితే హారతి ఇవ్వడానికి ప్రధాన కారణం దిష్టి తీయడం. ఇదేకాక కర్పూరం వెలిగించినప్పుడు కమ్మని వాసన వస్తుంది. కర్పూర వాయువు గాలిని శుభ్రపరుస్తుంది. హారతిని కళ్లకు అద్దుకునే సమయంలో భక్తులా గాలి పీలుస్తారు. అప్పుడందులోని ఔషధ గుణాలు శరీరం లోపలి భాగాల్ని శుద్ధి చేస్తాయి. ఇదే హారతి వెను కనున్న నిగూఢమయిన రహస్యం.
కర్పూరం పుట్టుక
ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారవుతుంది అనుకుంటారు. కానీ కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మల నుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి (కర్పూర తులసి) జాతుల నుండి కూడా కర్పూరాన్ని తయారు చేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద గాట్లు పెడతారు. ఆ గాట్ల లోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడు గుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం, చక్కని సువాసన వెదజల్లుతుంది. ఆకు లు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటా యి. కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కోరకం ఒక్కోవిధంగా ఉపయోగపడుతుంది.
పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, కాచి వడబోసిన పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయో గాలకు, వంటలలో, కాటుకని దీనితోనే చేస్తారు. అంజనం వేయడానికి వాడతారు.
హారతి కర్పూరం: టర్పీసీటైస్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.
రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.
భీమసేని కర్పూరం: స#హజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధాలలో వాడతారు.
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
#హమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
#హమ కర్పూరం: ఇది మందులాగా చల్లగా ఉంటుంది.
ఇవేకాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దా#హము, #హక్కరి, పోతా శ్రయము, పోతాశము, తారాభ్రము, తు#హనము, రాత్రి కరము, విధువు, ముక్తాఫ లము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూ రం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.
స్వభావం కర్పూరం: మనుషుల స్వభావాలని కర్పూరంతో పోలుస్తారు. ఈ రకం మను ష్యులకి గ్ర#హణశక్తి ఎక్కువగా ఉంటుంది. ఏది చెప్పినా ఇట్టే గుర్తుండి పోతుంది. అంటే ఏక సంధాగ్రా#హులన్నమాట. మంచి విషయాలను వెంటనే ఆచరణలో పెడతారు, కర్పూరం లాంటి స్వభావం కలవారు వెలిగిస్తే చాలు, అందరినీ వెలిగిస్తూ జ్ఞానాన్ని పంచుతారు.
కళ్యాణం- కర్పూరం: కళ్యాణాలలో కర్పూరానికి ఒక ప్రత్యేకత ఉంది. వధూవరులు దండలు మార్చుకునేటప్పుడు ఈ కర్పూర దండలు తప్పక మార్చుకుంటారు.
దిష్టి-కర్పూరం: నీరాజనం దేవునికి దిష్టితీసే ప్రక్రియే.
ఆరోగ్యం- కర్పూరం: ఆయుర్వేద చికిత్సలో కర్పూ రాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు.