ప్రతి పురుషుడు స్నా నం చేసిన వెంటనే నొసట విభూతి పెట్టుకుంటుంటారు. శివు నకు అత్యంత ప్రీతికరమైన విభూతిని ప్రతి ఒక్కరూ ధరించవచ్చు. అనారోగ్యంతో బోధపడేవారు స్నానం చేయలేనప్పుడు అత్యవ సర సమయాల్లో తల మీంచి స్నానం చేయవలసిన అవసరం వస్తే విభూతిని రాసుకొని కొంచెం నీళ్ళు జల్లు కుంటే పవిత్రులవుతారని పెద్దలంటారు. అసలు విభూ తి ఎందుకు పెట్టుకోవాలి? విభూతి అంటే ఏమిటి అనేది కూడా తెలియనివారు కొందరున్నారు. విభూతి అంటే రావి, మోదుగ మొదలైన సమిధలతో యజ్ఞం, హోమాలు చేసినప్పుడు హోమ గుండంలో సమిధలు కాలగా మిగిలిన భస్మాన్ని విభూతి అంటా రు. అంతేకాకుండా ఆవుపేడతో చేసిన పిడకలను కాల్చగా వచ్చేది కూడా విభూతిగా వాడుతుంటారు. గృహస్థు విభూతిని నీటితో తడిపి నొసటపైన, హృదయంపైన, చేతులపైన పెట్టుకుంటారు.
”శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణమ్!
లోకే వశీకరం పుంసాం భస్మత్రైలోక్య పావనమ్!!
ఈ శ్లోకాన్ని చదువుతూ విభూతి పెట్టుకుంటారు. ఏ మంత్రా లు రానివారు పై శ్లోకంతో కాని, ‘నమ:శ్శివాయ’ అనే పంచాక్షరీ మంత్రంతో గాని భస్మధారణ చేయాలి. స్త్రీలు, సన్యాసులు పొడి విభూతినే పెట్టుకోవాలంటారు. ఏ వస్తువు కాలిపోయినా బూడిద ను కాలిస్తే బూడిదే మిగులుతుంది. అంటే నాశనం లేనివి వస్తువు తో నాశనం లేని వాన్ని కొలుస్తున్నాం. అన్నీ బూడిదే అయిపోతా యనే వైరాగ్య భావమూ కలుగుతుంది. విభూతి ధరించడం వల్ల శరీరంలో చమట వల్ల వచ్చే రోగాలు రాకుండా ఉంటాయి. శరీరా నికి కావలసిన వేడిని ఒకేవిధంగా ఉండేట్లు చేస్తుంది. ఇది చర్మ రోగాలు రాకుండా శరీరం కాపాడుతుంది. విభూతి పెట్టుకోవ డం వల్ల రక్తంలోని దోషాలు పోతాయి. రక్తప్రసారం సరిగా అవు తుంది. ఆయువువృద్ది అవుతుందంటారు. విభూతి ధరించడం వల్ల శాంత స్వభావం అలవడుతుందనే ఉద్దేశంతోనే యోగులు దీనిని ధరిస్తుంటారు. విభూతి తెలుపు రంగులో ఉంటుంది. కను క ఇది నిర్మలత్వాన్ని సూచిస్తుందంటారు. అందుకే ప్రతి ఒక్కరు విభూతిని ధరించవచ్చు.
నిర్మలత్వానికి ప్రతీక… విభూతి!
Advertisement
తాజా వార్తలు
Advertisement