Thursday, October 17, 2024

ప్రత్యేక మహిళ… కుంతీదేవి!

భారతాన్ని రచించిన వేద వ్యాసుడు గొప్ప మాన వతావాదని, అందుకే భారతంలోని పాత్రలన్నీ సజీవ చిత్రాలే అంటారు. స్త్రీ పాత్రల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన పా త్రల్లో సత్యవతి, పాండురాజు భా ర్య కుంతి. సత్యవతి, కురువంశా న్ని కాపాడిన మహిళ అయితే కుంతి కౌరవుల అధర్మ పాలనను తన కొడుకుల ద్వారా అంతమొందించింది. అందుకు ఆమె ఎన్నో త్యా గాలు చేస్తూ కష్టాలననుభవిస్తూ తన కొడుకులను తీర్చిదిద్ది హస్తి నకు ధర్మరాజును పట్టాభిషిక్తున్ని చేసింది. అందుకే కుంతీదేవి చరిత్ర భారతంలో ప్రత్యేకంగా చెప్పవచ్చంటారు విశ్లేషకులు.
కుంతికి తల్లిదండ్రులు పెట్టిన పేరు పృథ. ఈమె యాదవ రాజైన శూరసేనుని ప్రథమ పుత్రిక. కృష్ణుని కన్న తండ్రి, వసు దెెవుని సోదరి. శూరసేనుని మేనమామ, కుంతీ భోజునికి పిల్లలు లేని కారణాన శూరసేనుని కుమార్తె పృథను దత్తత తీసుకొని ఆమె పేరు కుంతిగా మార్చాడు. కుంతీభోజుని ఇంట పెరగసాగింది. ఓ సందర్భంలో అత్రి మహర్షి- అనసూయల పుత్రుడు దుర్వాసుడు కుంతీభోజుని రాజ్యంలో కొన్ని నెలల పాటు ఉన్నాడు. ఆయనకు సేవ చేయ భోజుడు తన కూతురైన కుంతీదేవిని ఆయనకు సేవ చేయడానికి తగు ఏర్పాట్లు చూడడానికి నియమించాడు. ఆ సమ యంలో కుంతి కుమారి అనేక కష్టాలు సహిస్తూ ఆ ఋషికి సేవ చేసింది. అందుకు దుర్వాసుడు సంతుష్టుడై ఆ బాలికకు అధర్వణ వేదంలోని ఉపాసనా మంత్రాలను ఉపదేశించాడు. ఆ మంత్రాల ప్రభావంతో ఆమె కోరుకున్న దేవతల నుండి వరం పొందవచ్చు.
కుంతీభోజుడు ఏర్పాటు చేసిన స్వయంవరానికి వచ్చిన పాండురాజును ఇష్టపడడంతో కుంతీదేవి వివాహం పాండురాజు తో జరిగింది. ఆ తరువాత కొంతకాలానికి మాద్ర దేశరాజు కుమా ర్తెయైన మాద్రిని పాండురాజు వివాహమాడాడు. అప్పుడు కుం తి కినుక వహించింది. పాండురాజు ఏమి చెప్పాడోగాని కుంతి మాద్రిని తన స్వంత చెల్లిలా చూడసాగింది.
పాండురాజుకు వేటాడటం అంటే మహాప్రీతి. ఆయన ఒకరో జు వేటకు వెళ్లి జంటగా తిరుగుతున్న రెండు జింకల్ని చూసా డు. ఒకదానితో ఒకటి ఆడుకుంటున్న సమయంలో కొట్టా డు. ముని దంపతులే జింకల రూపం ధరించారని ఆయనకు తెలియదు. ఆ ముని దంపతులు ప్రాణా లు విడుస్తూ నువ్వు చేసిన పాపం కారణంగా నీవె ప్పుడైనా నీ భార్యను కలిసిన మరుక్షణం చస్తా వ్‌ అని శపించారు. అప్పటి నుండి తన భార్య లకు దూరంగా కాలం గడపసాగాడు పాం డురాజు. ఒకరోజు చింతాక్రాంతుడై జరిగిన విషయాన్ని కుంతికి చెప్పగా ఆమె ఆ సమ యంలో తన భర్తకు తగు ధైర్యాన్ని నూరిపో సింది. భర్త తోడే లోకంగా భావించే మహిళగా ఇక్కడ ఆమెను శ్లోఘించవచ్చు.
సంసార జీవితాన్ని అనుభవించలేని పాం డురాజు అడవికెళ్లి తపస్సు చేసి మోక్షం పొంద గోరినప్పుడు కొందరు ఋషులు, నిస్సంతానులైన వారికి మోక్షం దుర్లభం అన్న మాటలు ఆయన్ని ఇంకా కలిచివేసాయి. చివరకు తనకు తోచిన ఉపాయాన్ని కుంతితో పంచుకుంటాడు. దేవర న్యాయంతో పిల్లల్ని కనడానికి ఒప్పు కోవల్సిందిగా ఆమెను ప్రాధేయపడ్డా డు. అందుకు ఆమె ససేమిరా అంటూ తనకు బాల్యంలో దుర్వాసుని ఉపదే శం గురించి చెప్పింది. అందుకు పాం డురాజు ఒప్పుకోగానే కుంతి, యమ ధర్మారాజుతో ధర్మరాజును, వాయుదే వునితో భీముణ్ని, ఇంద్రునితో అర్జును న్ని కన్నది. ఇక్కడ మనం గమనించవ లసిన అంశం ఏమిటంటే, పతియే దై వంగా భావించిన పుణ్య మహిళగా భర్త ఇష్టపడిన తరువాతనే మంత్ర మహిమతో ముగ్గురు కుమారులని కన్నది. పాండురాజు శాపం గురించి తెలి యని సమాజం ఆమెను చిన్నచూపు చూస్తుం దని తెలిసినా భర్త కోసం మానాభిమానాలు లెక్క చేయని త్యాగమూర్తిగా కుంతిని అర్థం చేసుకోవ చ్చు. సంతోషంగా ప్రకృతిలో విహరిస్తున్న పాండురా జు మాద్రికి కూడా సంతానం కలగాలనే కోరికను కుంతి ముందు వెలిబుచ్చాడు. భర్త చెప్పిందే తడువుగా మాద్రిచే ఆ మంత్రం ఉచ్చరింప చేస్తుంది. మాద్రికిష్టమైన అశ్వినీ దేవతల కారణంగా నకుల సహదేవులు జన్మించారు. ఇక్కడ కుంతి సవితిని కూడా సం తానవంతురాలుగా చేయడం, ఆమె ఔదార్యానికి మచ్చుతున.
ఒకరోజు మాద్రిని చూసిన పాండురాజుకు ఆమెను తన కౌగి టిలో బంధించాలనిపించి ఆమెపై చేయ వేయగానే పాండురాజు మరణించాడు. కుంతి ఎంతగానో బాధపడి పతి చితిలో భర్తతో పాటు సహగమనం చెందాలని చూడగా మాద్రి ”అక్కా, నీవు అన్నింట సమర్థురాలవు. నీ ముగ్గురు కొడుకులతో పాటు నా ఇద్ద రు బిడ్డల్ని కూడా సమర్థులను చేయ” ప్రార్థించి తన భర్త చితితో ఆమె సహగమనం చేసింది. అప్పటి నుండి అయిదుగురు పిల్ల్లల్ని కుంతి పంచ పాండవులుగా పెంచింది. ఇక్కడ కూడా కుంతి ఔదా ర్యాన్ని పొగడకుండా ఉండలేము.
భీష్మ విదురుల వల్ల సహాయ సహకారాలతో కౌరవులతో సమానంగా పంచపాండవులు పెరగసాగారు. కుంతి, అహోరా త్రులు వారి అభివృద్ధికి తపిస్తుండేది. కౌరవులకు భీమార్జునులం టేనే ద్వేషం. వీరిద్దరిని హతమార్చేందుకు పన్నిన కుట్రలన్నింటి ని తన సమయోచిత జ్ఞానంతో పటాపంచలు చేస్తుండేది. లక్క ఇం టిలో పాండవులను హతమార్చ చూసినప్పుడు తన మరిదియైన విదురుని సాయంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి తన కొడుకుల ను ఆ అపాయం నుండి తప్పించి ఆదర్శ మాతృమూర్తిగా భీష్ముని తో పొగడ్తలందుకుంది. అనేకసార్లు నీ మేనత్త కుమారులను రక్షిం చవలసిందిగా కృష్ణుణ్ని ప్రాధేయపడింది. అందుకే అడుగడుగు న పాండవులకు కృష్ణుడు రక్షణ కవచమయ్యాడు.
కృష్ణుడు రాయబారిగా కౌరవ సభకు వెళ్తూ అందరి అభిప్రా యాలు తెలుసుకోగోరి కుంతిని అడగగా ఆమె ధైర్య సాహసాలతో మాట్లాడిన మాటలకు వ్యాస భారతంలో నిజమైన రాజమాత లక్షణంగా చెప్పుకుంటారు. కృష్ణునితో, ”వాసుదేవా! నా కొడుకు లు కౌరవులతో యుద్ధం చేసి సగం రాజ్యం పొందవలసిందే! ధర్మ జుడు అయిదుగురికి అయిదు ఊళ్లు ఇచ్చినా చాలనడం నాకే సిగ్గ నిపిస్తుంది. అల్లుడూ! వాళ్లు అర్ధరాజ్యం ఇవ్వనట్టయితే తప్పక నా కొడుకులచే యుద్ధం చేయిస్తా! విజయమో, వీరస్వర్గమో పొంద ప్రోత్సహిస్తాను” అనడం ఇక్కడ రాజకుటుంబంలో పుట్టిన వీర వ నితగా పేరొందడానికి చక్కని ఉదాహరణగా చెబుతారు.
ధర్మరాజును రాజుగా చేసి కుంతిదేవి, తోడికోడలు గాంధారి, బావ ధృతరాష్ట్రునితో వానప్రస్థానానికి వెళ్లడం ఆమె బంధుప్రీతి కి పేర్కొనదగిన వ్యక్తిత్వంగా చెప్పవచ్చు. వీటన్నింటి కారణంగా ఆమెను త్యాగమూర్తిగా నేటికీ కొనియాడతారు. భారతంలో కుంతిది ప్రత్యేక పాత్రే కదా!

Advertisement

తాజా వార్తలు

Advertisement