ఒకసారి 1913వ సంవత్సరంలో మహారాష్ట్ర లోని సతారా జిల్లా నుండి టోసర్ అనే సనాతన సాంప్రదాయంలో పుట్టిన భక్తుడు శ్రీ సాయి గురించి విని ఆయన నుండి ఏమైన ఆధ్యాత్మిక ఉపదేశం పొం దాలని శిరిడీకి వచ్చి మశీదులో శ్రీ సాయికి ఎదురు గా కూర్చున్నాడు. అప్పుడు శ్రీ సాయి టోసర్ను చూసి నవ్వుతూ ”ఈ సకల చరాచర సృష్టిలో ఏ జీవుల మధ్యా బేధం లేదు, అన్ని జీవులు ఆ పరమా త్మ నుండి పుట్టినవే, అన్నింటిలో విశ్వవ్యాప్తమై వున్న వస్తువునే ఆత్మ అని అంటారు” అని టోసర్ వైపు చూసి ” వెళ్ళి సాఠే వాడాలో మౌనంగా కూర్చో నీకు కావలసింది వెంటనే దక్కుతుంది” అన్నారు. ఆ మాటలు టోసర్కు అర్ధం కాలేదు. కాని సాయిపై విశ్వాసంతో వాడాకు వెళ్ళి సాయి జపం చేస్తూ కూ ర్చున్నాడు. అతడు అక్కడ కూర్చున్న కొద్ది క్షణాలకే అతడి కళ్ళు అప్రయత్నంగా మూసుకుపోయాయి. మనసు అంతర్ముఖమై సమాధి స్థితిని పొందాడు. ఎన్నో అపూర్వమైన అనుభవాలు కలిగాయి. ఆ విధం గా ఎంతో పూర్వ జన్మ పుణ్యఫలం వుంటే గాని, ఎన్నో సంవత్సరములు కఠోర సాధన చేస్తే గాని ఎవరికీ లభ్యం కాని ఆత్మ సాక్షాత్కారం అతనికి కలిగింది.ఏ విధమైన బోధ లేక ఉపదేశం చేయకుండా, శక్తిపా తం చేయకుండా కేవలం చూపులతో ఆత్మ సాక్షాత్కా రం కలిగించిన బాబా వారి అపూర్వమైన యోగ శక్తికి అతడు ఆశ్చర్యపోయాడు. వెంటనే పరుగు పరుగు న వెళ్ళి బాబా వారి కాళ్ళపై పడి కృతజ్ఞతలను తెలి యజేసుకున్నాడు. అతడే బాబా వారి అపూ ర్వమైన, అద్భుతమైన కరుణా కటాక్షముల వలన, అనుగ్రహ ఫలితం వలన ‘నారాయణాశ్రం’ అనే ఒక గొప్ప సన్యాసి అయ్యి, బాబా వారి మహమలను, సిద్ధాం తాలను ప్రచారం చేసి చివరకు బాబాలో ఐక్యం అయ్యాడు. చూసారా! శ్రీ సాయినాధుని అపూర్వ మైన యోగ శక్తి. ఎటువంటి సాధన చేయించక, మంత్రం ఉపదేశం చేయక, తంత్ర పూజాది కార్య క్రమాలను చేయించక ఏమాత్రం శ్రమ లేకుండా టోసర్కు అనుపమ లభ్యం కాని ఆత్మ సాక్షాత్కారం కలిగించారు. అందుకే శ్రీ సాయి బ్రహ్మాన్ని ఉపదేశిం చే సామాన్య గురువు కాదు, బ్రహ్మాన్ని ప్రత్యక్షంగా దర్శింపజేసే పరమ గురువు.
మరొక సందర్భంలో బాలక్ రాం మాన్కర్ అనే సాయి భక్తుడు అధ్యాత్మికంగా ఉన్నత స్థితులను పొందేందుకు నిత్యం శ్రీ సాయిని పూజిస్తుండే వాడు. కాని తన దైనందిన జీవితంలో చికాకుల వలన తగి నంతగా ప్రగతి సాధించలేకపోయాడు. తరచుగా మనసు చంచలత్వానికి లోనవుతుండడం వలన తగిన భక్తి, శ్రద్ధ, ఏకాగ్రతలను సాధించలేకపో యాడు. తన భార్య గతించిన తర్వాత అతడు పూర్తిగా శిరిడీలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నా డు. అతని శ్రద్ధకు సంతోషించిన బాబా అతడిని మత్స్యేంద్రనాధుడు తపస్సు చేసిన మచ్చెంద్రగఢ్కు వెళ్ళి రోజులు మూడు పూటలా ధ్యానం చేయమని చెప్పారు. బాబా మాటలకు సరే అని, మాన్కర్ మచ్చేంద్రగఢ్కు వెళ్ళి సాధన ప్రారంభించాడు. అక్కడి వాతావరణం సాధనకు అనుకూలించడం వలన అతడు చక్కగా ధ్యానం చేయసాగాడు. త్వర లోనే అతని ఆరోగ్యం కూడా బాగుపడింది. ఒకనాడు ధ్యానం పూర్తయ్యాక, బాబా అతనికి భౌతికంగా దర్శ నమిచ్చారు. అతడు సంభ్ర మాశ్చర్యాలతో నమస్క రించుకోగానే ” నా సర్వ వ్యాపకత్వాన్ని నీవు ఇంత వరకు గ్రహంచలేకపోయావు, నేను శిరిడీ లోనే కాక ఈ విశ్వమంతా వ్యాపించి వున్నానని నిరూపించేం దుకే నీకు ఇక్కడ దర్శనమిచ్చాను, భక్తుడు ఎక్కడ నన్ను స్మరిస్తే నేను అక్కడే ప్రత్యక్షమౌతానని ఇప్పటి కైనా గ్రహంచండి” అని అతనిని దీవించి బాబా అంతరార్ధమయ్యారు. సరిగ్గా ఆ రోజునే బాలక్ రాం మాన్కర్ తన అధ్యాత్మిక జీవితంలో సరికొత్త జీవి తాన్ని ప్రారంభించినట్లయ్యింది. ఆ రోజు నుండి అతని సాధన అద్భుతంగా సాగింది. ఎన్నో దివ్యమై న అనుభవాలు కలుగసాగాయి. మంత్ర సిద్ధి కలిగిం ది. బాబా దర్శనం తరచుగా కలిగేది. తన తర్వాతి జీవితంలో అధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థాయికి మాన్ కర్ ఎదిగి చివరకు బాబా లో ఐక్యమయ్యాడు. ఒక మామూలు భక్తుడికి అనుపమ లభ్యం కాని దివ్య సాక్షాత్కారాన్ని ప్రసాదించి అతడిని అధ్యాత్మికంగా ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహంప జేశారు.
సాయి చూపే ఆత్మసాక్షాత్కార సాధనం
Advertisement
తాజా వార్తలు
Advertisement