ప్రకృతితో అనుబంధాన్ని ఏర్పరచుకొని…
ఆ ప్రకృతిలోనే గడపాలని తెలియజేసేది బతుకమ్మ పండుగ. నేడు భాద్రపద కృష్ణ అమావాస్య. దేశ విదేశాల్లో బతుకమ్మ సంబరాలు జరుపుకునే శుభ తరుణమిది. నేడు ఎంగిలి బతుకమ్మ పేరుతో మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి వేడుకలు జరుపుకుంటారు.
మన మానవ జన్మ ప్రకృతిలో భాగమే.. ప్రకృతితో మనం అను బంధాన్ని ఏర్పరచుకొని… ఆ ప్రకృతిలో గడపాలని తెలియజే సేది బతుకమ్మ పండుగ. పువ్వులను ప్రకృతి స్వరూపిణి పార్వ తిమాతగా ఆరాధిస్తాం. అలాంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను రూపొందించి మహళలంతా కలిసి లయ బద్ధంగా… బతుకమ్మ చుట్టూ ప్రదక్షిణ చేస్తూ… రామాయణ మహాభారత గాథలను జానపద శైలిలో పాటలు పాడుతూ.. ఆటలాడుతూ పూజించే శుభ సమయమిది.
ప్రతీ సంవత్సరం మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వర కు తొమ్మిది రోజులు జరుపుకునే పూల పండుగ బతుకమ్మ.హందూ మహళలు ఎంతో నియమ నిష్టలతో భక్తి, శ్రద్ధలతో మహా వైభవంగా జరు పుకునే తీరైన వేడుక.
తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ పెద్ద పండుగ. ఈ పండుగ తర్వాతే మిగతా పండుగలు, అంత గొప్పగా, అత్యంత భక్తి శ్రద్ధలతో సనా తన బతుకమ్మ పండుగను నిర్వహస్తారు. బతుకమ్మ వివిధ రంగురం గుల పూల పండుగ, గృహలక్ష్మిలు భక్తి నిష్టల పండుగ ఇంటింటి పం డుగ. ప్ర కృతి దేవతను పూలతో పేర్చి బతుకమ్మ రూపంలో ఆరాధిస్తారు. దీంతో తెలంగాణా ప్రజలు ప్రకృతి ఆరాధకులుగా గౌరవించబడుతున్నా రు. అయితే ఏదో ఒక నేపథ్యం, సంఘటనలకు ప్రభావితులైన ప్రజ లందరూ ఏకమై వాటి స్ఫూర్తితో, వాటి స్మృతితో జరుపుకునే కార్యక్రమా ల పరంపరలో పండుగలుగా మారతాయి. ఆవిధంగా నిర్వహంపబడు తున్న నేపథ్యంలో తెలంగాణా సనాతన సంస్కృతిలో బతుకమ్మ పండు గకు ఎన్నో గాథలున్నాయి. వివిధ అభిప్రాయాలూ, విశ్వాసాలూ, విశేషా లూ ఉన్నా యి. వాటి గురించి.. తెలుసుకుందాం.
ద్వాపార యుగం నుంచి… ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని చుట్టూ చేరి గోపికలు ప్రతినిత్యం ఆడి, పాడి శ్రీకృష్ణునిపై భక్తి గానామృతంతో పుల కించిపోవడాన్ని స్పూర్తిగా తీసుకొని యువతులు… తాము ఆడి, పాడిన కార్యక్రమం… రానురాను బతుకమ్మ పండుగగా వాసికెక్కిందని పౌరాణి కులు చెబుతారు. లోకకంటకుడైన మహషాసురుడు అనే రాక్షసుడిని దుర్గాదేవి యుద్ధంలో సంహరించి లోకకల్యాణం గావించింది. ఈ క్ర మంలో యుద్ధంలో మహాలయ అమావాస్యనాడు అలసిపోయి సుషుప్తా వస్థల్లోకి వెళ్ళింది. దీంతో మహళలంతా అమ్మవారికి సేదతీర్చి యథా స్థితికి తీసుకురావడానికి ఆట, పాటలతో సేవలు చేశారు. తొమ్మిదో రోజు తల్లి అలసట తీరి పూర్వ వైభవంతో మహోజ్వల ప్రకాశితయై బాసించి నది. దీంతో మహళా ప్రపంచమంతా ఎంతో ఆనందోత్సాహాలతో పండు గ చేసుకుంటూ లోకమాత అయిన దుర్గామాత…. సర్వజనులకు బతుకు నిచ్చే అమ్మ వారైనందున ఆమెకు ‘బతుకమ్మ’ అని నామకరణం చేసి ఆమె స్మృతికి ఏటా తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగ జరుపుకోవడం తెలంగాణా మహళా మణులకు సనాతనంగా సంస్కృతి అయిందని పురాణికులు చెబుతారు. అలాగే శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవత పూజ నుంచి బతుకమ్మ పండుగ వచ్చిందని వైశ్యులు చెప్పుకుంటారు.
తామరపువ్వు లక్ష్మీదేవి అవతారం. ఓ రాజు ఓ కొలనులో తామర పువ్వును వేశాడు. దాంతో కొలను చుట్టూ తంగేడు పూలు పూస్తాయి. ఈ క్రమంలో విష్ణుమూర్తి అక్కడ ప్రత్యక్షమై రాజు వేసిన తామరపువ్వును లక్ష్మీదేవతగా చేస్తాడు. ఈమెను లక్ష్మీదేవి అవతారంగా కొలవండని చెబు తారు. ఆ లక్ష్మి అవతారం పువ్వువల్ల కొలనులోని పూలన్నింటికి బతుకు వచ్చినందున ఆ దేవతను బతుకమ్మగా ప్రజలు కొలిచారు.
బతుకమ్మ తొమ్మిది పేర్లు… తొమ్మిది నైవేద్యాలు
మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజు బతుకమ్మకు నువ్వులూ, నూకలూ, నైవేద్యంగా సమర్పిస్తారు.
2వరోజు అటుకుల బతుకమ్మకు ఉడకబెట్టిన పప్పుబెల్లం, అటుకులు నైవేద్యం పెడతారు. 3వరోజు ముద్దపప్పు బతుకమ్మకు తడిబియ్యం, పాలు, బెల్లం 4వరోజు నాసబియ్యం బతుకమ్మకు తడిబియ్యం, పాలు, బెల్లం 5వరోజు అట్ల బతుకమ్మకు అట్లు 6వరోజు అలిగిన బతుకమ్మకు అట్లు 7వరోజు వేపకాయల బతుకమ్మకు చేప పండ్ల ఆకారంలో బియ్యం పిండి నైవేద్యం పెడతారు.
8వరోజు వెన్న ముద్దల బతుకమ్మకు వెన్న, నువ్వులు, బెల్లం
9వరోజు సద్దుల బతు కమ్మకు 5 లేదా 9 రకాల సద్దు లను సమర్పిస్తారు.