నిద్ర లేచింది మొదలు ‘ఇది నాది, అది నీది’ అనే అహంకార భావం తో ప్రవర్తిస్తారు కొందరు మనుషులు. ఆస్తులు కూడబెట్టడం, అనుభ వించడమే లక్ష్యంగా ఎన్నెన్నో నీచ కార్యాలు చేస్తుంటారు. తాము అనుకున్నది జరగనీయకుండా చేస్తూ అడ్డొచ్చినవారిని అణగదొక్కు తారు. అవసరమైతే తుదముట్టిస్తారు. కామక్రోధ మదమాత్సర్యాల తో తలబిరుసెక్కి ఇంగిత జ్ఞానమున్న మనుషులమన్న సంగతి మర చిపోయి ప్రవర్తిస్తారు. అలాంటివారు తప్పక చదవాల్సిన కథ ఇది. ఒకరోజు జనక మహారాజు కళ్లెదుట ఒక బ్రాహ్మణుడు ఒక అను చితమైన పని చేసాడు. అది చూసిన జనకుడికి పట్టరాని కోపం వ చ్చింది. ఆ బ్రాహ్మణున్ని తన రాజ్యం విడిచి వెళ్లిపొమ్మన్నాడు. అన గా రాజ్య బహష్కరణ శిక్ష విధించాడు. అప్పుడా బ్రాహ్మణుడు ఎం తో వినయంగా ”మీ ఆజ్ఞ శిరసావహస్తాను మహారాజా? మీ రాజ్యం ఎంతవరకు వ్యాపించి ఉందో హద్దులు చెప్పినట్లయితే అవి దాటి మరో స్థానం వెతుక్కుని వెళతాను” అన్నాడు. ఆ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహంచిన జనకుడికి మతిపోయింది. చాలాసేపటి వర కు మౌనంగా ఉండిపోయాడు. కాసేపటికి తేరుకున్న జనకుడు ”ఈ రాజ్యం మా తాతల నుండి నాకు వచ్చింది. అందువల్ల ఇది నాది అనే భావన ఎప్పుడూ నాలో కలగలేదు. ఇవి ఈ రాజ్య హద్దులని కూడా నేను చెప్పలేను. నేనుండేది మిథిలనే అయినా నా రాజ్యమని చెప్పడానికి వీలు కాదు. నా రాజ్యమని చెప్పడానికే లేనప్పుడు మిమ్ము నా రాజ్యం నుండి వెళ్లిపొమ్మనే హక్కు నాకు లేదు. అలాంటి నేను మిమ్మల్ని వెళ్లిపొమ్మని ఎలా చెప్పానో తెలియక బాధపడుతున్నాను. నాలో ఈ ఆలోచన రేకెత్తించడా నికే మీరా అనుచిత కార్యం చేసినట్టుంది. ఇంతకీ మీరెవరు మహా నుభావా” అనడిగాడు విచారంగా. బ్రాహ్మణుడు ”అది తెలుసుకునే ముందు మరో ప్రశ్నకి జవాబు చెప్పండి. మీరున్న ఈ నగరం, మీరు పాలిస్తున్న ఈ రాజ్యం రెండూ మీవనే భావన లేకుండా పరాయి సొత్తును వాడుకుంటున్నామన్న ఆలోచనలతో, అనాసక్త భావంతో ఎలా ఉండగలుగుతున్నారు” అని ప్రశ్నించాడు. జనకుడు ”ఈ రాజ్యం, ధనం వంటివన్నీ ఎప్పటికైనా నశించేవే కదా మహాశయా. మన కంటికి కనబడేవన్నీ శాశ్వతం కాదని నాకు తెలుసు. నా దృష్టిలో నాదంటూ ఏదీలేదు. అసలు నాదనే వస్తువే దైనా లోకంలో ఉంటుందా? ముక్కు, కళ్ళు, నోరు, చెవులు మొదలగు ఇంద్రియాలన్నీ తెలుసుకోగలిగినవే అయినా అవి కూడ నశించేవే. ఏదీ నాది కాదనుకోవడంవల్లనే భూమ్యాకాశాలు మొదలైన పంచ భూతాలు నన్ను బంధించడం లేదు. పైగా నేను చెప్పినట్టు ప్రవర్తిస్తు న్నాయి” అని వివరించాడు. అప్పుడా బ్రాహ్మణుడు ”రాజా! నీ మాటలు విన్న తరువాత చాలా సంతోషం కలిగింది. అభినందిస్తున్నాను. నిన్ను పరీక్షించడానికే వచ్చిన యమ ధర్మ రాజును నేను. తామరాకు మీద నీటి బిందువులా ఉన్న నీ మనోస్థితికి సంతోషించాను. వివే కంతో పరిపక్వమైన నీ హృదయం శాశ్వతంగా, శాంతిప్రదాయకమై గాఢమై నిలుచుగాక” అని ఆశీర్వదించి మాయమయ్యాడు. నిత్యజీవితంలో మానవులు తామరాకు మీద నీటి బిందువుల్లా ప్రవర్తించాలి తప్ప వ్యామోహం పెంచుకోరాదనే సందేశం ఇచ్చే ఈ కథ మహా భారతం అశ్వమే ధ పర్వంలోనిది.
Advertisement
తాజా వార్తలు
Advertisement