Tuesday, November 26, 2024

స్వాప్నిక భ్రాంతి…!

మానవుడు ఒక ముత్యపు చిప్పను చూసి దానిలోని అత్యంత తనుకులీనే కాంతివ లన రజతం అనుకొంటాడు. తరువాత దగ్గరకు సమీపించి చూడగా ఆ భ్రాంతి తొలగిపోతుంది. అలాగే స్వప్నంలో అనేక యాత్రా దులు చేస్తూ పుణ్యక్షేత్రాలను దర్శించినట్లు అనిపిస్తుంది. మెలకువ రాగానే ఆ భ్రాంతి తొలగిపోతుంది. ఇలా ద్వైత భ్రాంతి అంత తొందర గా తొలగిపోదు. అది చాలా దీర్ఘమైనది.
మనం రాత్రి ఒక గదిలో పడుకుంటే ఆ రాత్రి కలలో విమానం ఎక్కి కాశీ వెళ్ళి, గంగాస్నానం, విశ్వేశ్వర దర్శనం ఆ తర్వాత రామేశ్వ ర యాత్ర, సముద్రస్నానం, రామనాథ దర్శనం వంటివన్నీ జరిగా యి. మెలకువ రానంతవరకు అది నిజంగా జరిగినట్లే అనిపిస్తూ ఉంటుంది. మెల కువ వచ్చాక అబ్బే అదేం జరగలేదు, 4, 5 గంటల్లో ఇంత యాత్ర జరపడం సాధ్య మా? కాదు. ఇది అసత్యమే అని ఆ యాత్రా భ్రాంతి తొలగిపోతుంది. కలగం టున్నంతసేపూ నిజంగా కాశీలో ఉన్నట్లే, యాత్ర జరిగిపోయినట్లే అనిపించినా, మెలకువ వచ్చాక అదంతా మిధ్యయే అనే నిర్ణయం కలు గుతుంది. అలాగే వ్యవహారంలో కూడా జగత్తులో సర్వ మూ సత్యమే అనిపిస్తుంది. ఇలా ఎందుకు? ద్వైత భ్రాంతి ఉండేవరకు. ఎప్పుడైతే ద్వైత భ్రాంతి తొలగిపోతుందో వెనువెంట నే అద్వైత సాక్షాత్కారం వెలువడుతుంది. అద్వైత సాక్షాత్కారం ఎప్పుడు కలుగుతుందో అపుడు ఇంకేమీ లేదు, అరే అపుడు చూడ వలసిందేముంది? వినవలసిందేముంది? అనిపిస్తుంది. దీనికి మ నం ఆశ్చర్యపడనవసరం లేదు. వ్యవహారంలో అలాగే అనుకోవ డం భ్రాంతి పడడం జరుగుతుంది. స్వప్నంలో ఆ భ్రాంతి ఉన్నంత సేపూ తదనుగుణమైన వ్యవహారమున్నట్లే, ఈ ద్వైత భ్రాంతి ఉన్నం త వరకూ జగత్‌ సత్యమనే వ్యవహారముండనే ఉంటుంది. స్వాప్నిక భ్రాంతి మెల కువ వచ్చే వరకూ మాత్రమే. ఇది సుదీర్ఘం. అదే వ్యత్యాసం. కనుక ఆలోచించి, నిత్యానిత్య వివేకంతో ”బ్రహ్మ సంత్య్‌ జగత్‌ మిథ్య జీవ: బ్రహ్మైక నా పర:” అనిగ్ర#హంచాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement