Saturday, November 23, 2024

మహిషాసుర మర్థిని

అయిగిరి నందిని నందితమోహిని విశ్వవినోదిని నందినుతే
గిరివర వింధ్యశిరో2ధి నివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హి శితికంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికతే
జయ జయహే మహిషాసురమర్థిని రమ్యకపర్ధిని శైలనుతే!!
ఇలా రాగయుక్తంగా సాగే మహామహే మోపేతమైన మహిషా సుర మర్ధిని స్తోత్రమును భక్తి శ్రద్ధలతో దుర్గానవరాత్రులలో నవమి
రోజున మహిషాసుర మర్థిని రూపం లో యున్న అమ్మ అనుగ్రహం కోసం భక్తులు పఠిస్తారు. మానవులలో వున్న జడత్వ భావనలు, వ్యతిరేక భావనలు తొలగిపోయి స్వచ్ఛ మైన భావనలు పాదుకుంటాయి. మహేషము ధిక్కా రమునకు ప్రతీక. మహషుడు గర్వమునకు, మదమునకు అంధకార మునకు ప్రతీక. మహిషాసురుని వధ గురించి దుర్గా సప్తశతిలో రెండు, మూడు, నాల్గవ అధ్యాయములలో విపులముగా వివరించబడినది.
ఉద్యద్భాను సహస్రకాంతి మరుణ క్షౌమాం శిరోమాలికాం
రక్తాలిప్త పయోధరాం జపపటీం విద్యామభీతిం వరం
హస్తాబ్జైర్దధతీం త్రినేత్రవిలసత్‌ వక్త్రా రవింరశ్రియం
దేవీంబద్దహిమాంశు ఖండముకుటాం వందే2 రవింద స్థితామ్‌ !!
మహిషాసురుడు అనే రాక్షసుని చేతిలో త్రిమూర్తులతో సహా దేవతలందరూ పరాజితులౌతారు. అప్పుడు దేవతలందరూ తమతమ శక్తులను ధారపోసి పార్వతీదేవిని యుద్ధానికి పంపుతారు. అపడు ఆ తల్లి మహిషాసుర సంహారము గావిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసి ధర్మా న్ని గెలిపించే అత్యంత ఉగ్రమైన రూపం మహిషాసురమర్ధిని అవ తారము. తొమ్మిదవ రోజైన నవమిని మహర్నవమి అని కూడా వ్యవహరిస్తారు. ఈరోజు మంత్రసిద్ధి కలుగుతుంది కనుక సిద్ధిదా అని కూడా పిలుస్తారు.
ఈరోజు దుర్గాసప్తశతి పారాయణ, ఖడ్గమాలాస్తోత్ర పారాయణ అత్యంత ఫలదాయకము. ఈరోజు అమ్మవారికి పానకం, వడపప్పు, గారెలు, పులిహోర నైవేద్యంగా సమర్పించాలి. ఎరుపు రంగు వస్త్రాలతో అమ్మవారిని అలంకరించాలి. విజయవాడ కనకదుర్గమ్మ ఈ రోజు మహిషాసురమర్థినిగాను, శ్రీశైలం భ్రమరాంబ మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.

– డా. దేవులపల్లి పద్మజ
98496 92414

Advertisement

తాజా వార్తలు

Advertisement