తిరుమల, ప్రభన్యూస్ :శ్రీవారి సర్వదర్శనం ఇక అందరికీ లభించనుంది. ఇప్పటివరకు చిత్తూరు జిల్లా వాసు లకు పరిమితం చేస్తూ రోజుకు 2వేల టోకెన్లు జారీ చేస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్యను 8వేలకు పెంచుతూ నిర్ణయం తీసు కున్నారు. ఏ ప్రాంతంవారైనా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకన్న దర్శనం కోసం భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ నెలకొనడంతో సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. తమిళులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన పెరటాసిమాసం నెల 17 వ తేదీ నుంచి ప్రారంభం కావడంతో తమిళనాడు రాష్ట్రం నుంచి అధి క సంఖ్యలో భక్తులు తరలి వసున్నారు. టోకెన్ల జారీ కేంద్రమైన శ్రీనివాసం వద్ద రోజూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అందరికీ సర్వదర్శనం అవకాశం కల్పించాలని నిర్ణయించారు. కోవిడ్ – 19 కారణంగా టిటిడి చరిత్రలో ఎన్నడు లేని విధంగా గతేడాది శ్రీవారి ఆలయంలో 80 రోజుల పాటు శ్రీవారి దర్శనాలను నిలిపివేసిన టీటీడీ, అ టు తరువాత కేంద్రం ఇచ్చిన సడలింపులతో గతేడాది జూన్ 8 వ తేది నుంచి టిటిడి శ్రీవారి దర్శనాన్ని పున: ప్రారంభించగా కోవిడ్ ఆంక్షల దృష్ట్యా ముందుగానే భక్తులకు దర్శన టొకెన్లను జారిచేసి, కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులను స్వామివారి దర్శనానికి అనుమ తిసున్నది. గతంలో లా భక్తులందరిని తిరుమలకు అనుమ తించ కుండా కేవలం దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే టీటీడీ శ్రీవారి దర్శనానికి అనుమతిస్తుం డడంతో గతేడా దిన్నరగా శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి విపరీతమైన డిమాండ్ నెలకొంది. అది ఎంతలా అంటే టిటిడి ప్రతినెలా మాసంకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుండగా, టికెట్ల కోటా అంతా గంటల వ్యవధిలోనే భక్తులు కొనుగోలు చేసేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి భక్తుల నుంచి భారీ డిమాండ్ ఉన్నప్పటీకీ కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తుంది. మధ్య-మధ్యలో సర్వదర్శనం భక్తులకు ముందుగానే తిరుపతిలో టోకెన్లను జారి చేసి స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్న టిటిడి సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న సమయంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 11 వ తేది నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని పూర్తిగా రద్దు చేసింది. అప్పటి నుంచి కూడా కేవలం ప్రత్యేక ప్రవేశ దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్టు, వర్చువల్ అర్జిత సేవా టికెట్లు కలిగిన 20 నుంచి 25 వేల మంది భక్తుల మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నది. దీంతో డబ్బు ఉన్న వారికే శ్రీవారి దర్శనం లభిస్తోందన్న విమర్శలు వచ్చాయి. భక్తుల నుంచి వస్తున్న వి జ్ఞాపనలతో పాటు పలు రాజకీయ పక్షాల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈనెల 8 వ తేదీ నుంచి సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభించి నిత్యం కేవలం 2 వేల టోకెన్లను మాత్రమే జారీ చేస్తూ అధి కూడా చిత్తూరు జిల్లా వాసులకే మాత్రమే పరిమితం చేసింది. ఇప్పుడు మరింతమందికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టు ఆన్‌లైన్‌లో టోకెన్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతవరకు ఆఫ్‌లైన్‌లో ఎస్‌డి టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement