పండుగలు, శుభకార్యాలకు పూజలో తప్పకుండా వుండ వలసిన ఆకులు తమలపాకులు. అవి దేముడికి తాంబూ లం సమర్పించడానికే కాదు దీపారాధనకు కూడా ఉప యోగించవచ్చు. ప్రత్యేక పూజలు చేసే సమయంలో దీపా రాధన చేస్తాము కదా! అయితే ఆ దీపారాధన కోసం వెలి గించే దీపాన్ని తమలపాకులపై పెట్టి వెలిగించడం ద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందుకోవచ్చని ఆధ్యా త్మిక పండితులు అంటున్నారు.
ముగ్గురు అమ్మలు కొలువుండే అత్యంత పవిత్రమైన ఆకు తమలపాకు. దాని కాడలో అమ్మల గన్న అమ్మ పార్వతీదేవీ కొలువై వుంటుందని.. తమలపాకు చివర్లో లక్ష్మీదేవి వుంటుందని.. మధ్యలో చదువుల తల్లి సరస్వతీ దేవీ నివాసం వుం టుందని విశ్వాసం. అందుకే పూజ చేసే సమయంలో తమ లపాకుపై దీపం వెలిగించడం వల్ల ఈ ముగ్గురి అమ్మల ఆశీర్వాదం మనకు లభిస్తుందని చెబుతారు. అయితే ఈ దీపాన్ని ప్రతిరోజు ఉదయం వెలిగించడం వల్ల కూడా ముగ్గురి అమ్మల అనుగ్రహం కలుగుతుందని, అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతారు.
తాజా తమలపాకులు ఆరింటిని తీసుకోవాలి. ముఖ్యం గా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా వుండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు.
అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమల పాకుల పైకాడను తుంచుకోవాలి. అలా తుంచిన ఆరు ఆకు లను నెమలి ఫింఛం వలె పూజగదికి ముందున్న ఓ టేబుల్ పై సిద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను వుంచి తుంపిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెలో వున్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. సుఖసంతోషా లు చేకూరుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇందుకు కారణం తమలపాకు ముగ్గురమ్మ లు కొలువై వుండటమేనని ఆధ్యాత్మిక పండితులు పేర్కొం టున్నారు.
ముగ్గురి అమ్మల ఆశీర్వాదానికి…
Advertisement
తాజా వార్తలు
Advertisement