Tuesday, November 26, 2024

30 మందితో టీటీడీ పాలకమండలి

– నియామక ప్రక్రియ పూర్తి.. జీవో జారీ
– వారిలో ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు

అమరావతి, ఆంధ్రప్రభ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 30మందితో కొత్త పాలకమం డలిని ఏర్పాటు- చేసి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 24 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌అఫిషియో సభ్యులు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు ఈ మండలిలో ఉన్నారు. సభ్యులుగా పోకల అశోక్‌, మల్లాడి కృష్ణారావు, టంగుటూరి మారుతి ప్రసాద్‌, మన్నె జీవన్‌రెడ్డి, డాక్టర్‌ బండి పార్థసారధిరెడ్డి, డా.జూపల్లి రామే శ్వరరావు, ఎన్‌. శ్రీనివాసరావు, రాజేశ్‌ శర్మ, బోరసౌరభ్‌, మురం శెట్టి రాములు, కె. విద్యాసాగర్‌, ఏపీ నందకూమార్‌(ఎమ్మెల్యే), పచ్చిపాల శాంతకుమార్‌, వేమిరెడ్డి ప్రశాంత్‌ రెడ్డి, డా. కేతన్‌ దేశాయ్‌, బూదాటి లక్ష్మీనారాయణ, మిలంద్‌ కేశవ నర్వేకర్‌, ఎమ్మెల్సీ శ్రీధర్‌, అల్లూరి మల్లేశ్వరి, డాక్టర్‌ ఎస్‌ శంకర్‌, ఎమ్మెల్యే విశ్వనాధరెడ్డి, బుర్రామధుసూదన్‌ యాదవ్‌, కిలివేటి సంజీవయ్య, కాటసాని రాంభూపాల్‌ రెడ్డి ఉన్నారు. ప్రిన్సిపల్‌ సెక్రటరీ రెవెన్యూ (ఎండోమెంట్స్‌), ఎండోమెంట్స్‌ కమిషనర్‌, తుడా ఛైర్మన్‌, టీటీడీ ఈవో, ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉంటారు. ఎమ్మెల్యే భూమా కరుణాకర్‌ రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌, ప్రత్యేక ఆహ్వానితులుగా నియ మించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యా లయంలో బుధవారం సీఎం జగన్‌ను కలిసిన అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ పాలక మండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు- తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. గత పాలక వర్గంలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది పాలకమండలి సభ్యులు, 8మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యు లుగా నియమితులయ్యారు. అయితే ఈసారి ఆ సంఖ్యను కుదించారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement