Saturday, November 23, 2024

నేటి రాశి ప్రభ (3-4-2021)

మేషం:
ముఖ్య పనులు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యపరంగా చికాకులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.

వృషభం :
విద్యార్థులు సత్తా నిరూపించుకుంటారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మిథునం :
నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

కర్కాటకం :
పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనారోగ్య సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం :
రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు.

కన్య :
ముఖ్యమైన పనులలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వాహన, గృహయోగాలు. నూతన ఉద్యోగలాభం. వ్యాపార, ఉద్యోగాలలో ఉన్నతి.

తుల :
పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

వృశ్చికం :
కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ఆధ్యాత్మిక చింతన.

ధనుస్సు :
రుణాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. నూతన ఒప్పందాలు. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మకరం :
కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కారం. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కుంభం :
ప్రయాణాలు వాయిదా వేస్తారు. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం :
వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement