Friday, November 22, 2024

25 మందితో టీటీడీ పాలకమండలి

అమరావతి, ఆంధ్రప్రభ: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఖరారైంది. 25మందితో ఏర్పాటు కానున్న పాలక మండలితోపాటు మరో 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉండేలా కూర్పు చేశారు. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురు, కర్నాటక, తమిళ నాడు నుంచి ఇద్దరేసి సభ్యులతో పాటు మహరాష్ట్రకు కూడా ప్రభుత్వం పాలక మండలిలో చోటు ఇవ్వనుంది. ఈమేరకు ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడను న్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి పాలక మండలిలో చోటు చేసుకోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తుంటారు. ఏటా పాలక మండ లిలో చోటు కోసం ఆసక్తి చూపేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. పాలక మండలిలో చోటు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వంలోని ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున సిఫారసులు వస్తుంటాయి. కొద్ది రోజుల కిందట టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డినే రెండోసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం పాలక మండలి సభ్యు ల నియామకంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రుల నుంచి పాలక మండలిలో చోటు కోసం సిఫారసు వచ్చినట్లు తెలు స్తోంది. పలువురు ఎమ్మెల్యేలు కూడా చాన్స్‌ ఇవ్వా లంటూ ప్రయత్నించారు. ఈ క్రమంలో సీఎం కూడా పాలక మండలి కూర్పులో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొలుత తెలంగాణ కోటా కింద 10మందికి చోటు కలిపిం చాలని భావించినప్పటికీ ఐదుగురికి మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు. పొరుగున ఉన్న కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఇద్దరేసి చొప్పున అవకాశం దక్కనుంది. మహరాష్ట్ర నుంచి ఇద్దరిని తీసుకుంటారా? లేక ఒకరికే అవకాశం ఇస్తారా? అనేది ఉత్తర్వులు వెలువడితే తప్ప స్పష్టం కాదు. పాలక మండలి ఎక్స్‌-అఫీషియో సభ్యులుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ప్రభుత్వ విప్‌ డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సుధాకర్‌కు అవకాశం దక్కనుంది.
50మంది ప్రత్యేక ఆహ్వానితులు..
టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితులుగా 50మందికి చోటు దక్కనుంది. ఇందులో వివిధ రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ధర్మపరిరక్షణ కోసం పని చేస్తున్న వారిని తీసుకోనున్నారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల సీఎంలు సూచించే వారు కూడా ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో ఉండనున్నారు. విధాన పరమైన నిర్ణయాల్లో వీరి ప్రమేయం ఉండదని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. ట్రస్టుబోర్డులో ఆహ్వానితులుగా మాత్రమే వీరు పరిమితమై సలహాలు, సూచనలు అందజేస్తారు. వాటిని పాలక మండలి పరిశీలించి అమలు చేయడమా? లేదా? అనేది నిర్ణయిస్తుంది. ఇప్పటికే పాలక మండలి కూర్పు తుదిదశకు వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో పాలక మండలి నియామకంపై ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement