తిరుమల, ప్రభన్యూస్: శ్రీవారి బ్రహ్మోత్స వాల్లో అక్టోబర్ 11న గరుడ సేవ నాడు ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి తెలిపారు. అదే రోజులు ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేస్తారని చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఆ వివరాలను ఈవో విలేకరులకు వెల్లడించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈనెల 7 నుంచి 15వ తేదీ వరకు 9 రోజుల పాటు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనుమన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, అక్టోబర్ 6 న అంకురార్పణం, అక్టోబర్ 11 న గరుడ వాహనం, అక్టోబర్ 12న సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం, 14న ఉదయం రథోత్సవాని కి బదులుగా సర్వభూపాల వాహనం 15న ఉదయం చక్రస్నానం (అయిన మహల్‌లో) రాత్రి ధ్వజా రోహ ణం, 16న శ్రీవారి బాగ్ సవారి ఉత్సవం జరగనున్నా యని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తా రని తెలిపారు. అదే రోజుల పలు అభివృద్ది కార్యక్ర మాలను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద చెన్నైకి చెందిన దాత శేఖర్‌రెడ్డి విరాళంతో నిర్మిస్తున్న గో మందిరాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందు లో గో ప్రదక్షిణ, గో తులాభారం, గో ప్రాశస్త్యాన్ని భక్తు లకు తెలియ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అలిపిరి నుంచి తిరుమల వరకు నడకదారి పై కప్పును రిలయన్స్ సంస్థ రూ.25 కోట్ల విరా ళంతో పున: నిర్మించిన మార్గాన్ని బ్రహ్మో త్సవాల్లో భక్తులకు అందుబాటిలోకి తీసుకు వస్తామని తెలిపారు. తిరుమల ఎస్వి మ్యూ జియంలో శ్రీవారి వైభవాన్ని, చారిత్రక ప్రాశస్త్యా న్ని, వివిధ కాలాల్లో పలువురు చక్రవర్తులు, రాజులు, సామంతులు, మం త్రులు మొదలైన వారు అందించిన అల నాటి గంగాళాలు, సంగీత పరికరాలు, శ్రీ వారి ఆభరణాల నమూనాలు మొదలైన వాటిని భక్తులు సందర్శించేందుకు వీలుగా టాటా గ్రూప్, టెక్ మహేంద్ర, మ్యాప్ సిస్టం సంస్థల సహకారంతో ఏర్పాట్లు చేపడుతున్నామని వివ రించారు. ఈ నెల 11న బ్రహ్మోత్సవాల గరుడ సేవ రోజును ఎస్విబిసి హిందీ, కన్నడ భాషలలో ప్రసారా లను ప్రారంభిస్తా మని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ.ధర్మారెడ్డి, జేఈవోలు సదాభార్గవి, వీర బ్రహ్మయ్య, సీవీఎస్‌వో గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సిఈవో సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
18 ఏళ్ల లోపు వారికీ కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే 18 ఏళ్ల లోపు వయసు వారు కూడా కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ తప్పని సరిగా తీసుకుని రావాలని టీటీడీ ఈవో జహవర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల అన్నమయ్య భవనం వద్ద శుక్ర వారం తనను కలసిన మీడియాతో ఈవో మాట్లాడారు. కోవిడ్ వ్యాప్తి నివారణ లో భాగంగా, భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని, శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్టీ పీసీఆర్ పరిక్ష నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని నిబంధన విధించా మన్నారు. 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ లేనందు వల్ల వారు నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తేవాలని ఈవో చెప్పారు. అక్టోబర్ 11వ తేది శ్రీవారి బ్రహ్మో త్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు.