తిరుమల, ప్రభన్యూస్:కొవిడ్ కారణంగా దాదాపు రెండు సంవత్సరాల తరువాత టిటిడి సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ సర్వదర్శనం ప్రారంభించింది. ఇందులో భాగంగాఫిబ్రవరి నెలలో నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిబ్రవరి నెలలో 10 లక్షల95 వేల 724 మంది భక్తులు దర్శించుకున్నారు. రూ.79.34 కోట్లు హుండీ కానుకల ద్వారా లభించింది. 5.35 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాకు సమర్పించారు. 13.63 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించగా దాదాపు 1.64 లక్షల గదులను భక్తులకు కేటాయించారు. 329.04 ఎంఎల్డి నీటిని వినియోగించారు. ఇక 27.76 లక్షల యూనిట్లు విద్యుత్‌ను వినియోగించారు. 64.90 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు. 3378 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement