- హిందూ సనాతన ధర్మములో తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు.
- ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము.
- చెవులు కుట్టించుకున్న హ్రుదయ సంబంద రోగములు రావు.
- ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.
- తడి పాదములతో భోజనము చేసిన ఆయుర్వుద్ధి.
- తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.
- స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్య గల అక్షరములతో పేర్లు పెట్టుట మంచిది.
- శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మరాశి.
- బంగారం కుజునికి, వెండి గురువుకు, రాగి రవికి, ఇత్తడి బుధునికి, ఇనుము శనికి.
- రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.
- బుధవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను ఇంటి ముందు వ్రేలాడ కట్టుకుంటే నరఘోషలు తొలుగుతాయి.
- యాత్రలలో మార్గ మధ్యమున పరుండునపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకుని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.
- తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు, అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.
- ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హూమం చేయునపుడు, శివునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కూర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.
- ఇద్దరు కూతుర్లకు ఒకేసారి వివా#హం చేయవచ్చు, కాని ఇద్దరు కొడుకులకు ఒకేసారి వివా#హం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి. లేదా సంవత్సర భేదం జరగాలి.
- తులసి, బిల్వ దళాలను ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.
హిందూ సనాతన ధర్మాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement