Friday, November 22, 2024

హిందూ సనాతన ధర్మాలు

  • హిందూ సనాతన ధర్మములో తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు.
  • ముక్కులు కుట్టించుకున్నచో దృష్టి దోషము కలగదని నమ్మకము.
  • చెవులు కుట్టించుకున్న హ్రుదయ సంబంద రోగములు రావు.
  • ఎడమ హస్తము పరమాత్మ అనియు, కుడి హస్తము జీవాత్మ అనియు ఈ రెండు ఏకము కావలెనను ఉద్దేశముతో రెండు చేతులు కలిపి నమస్కరించుచున్నాము.
  • తడి పాదములతో భోజనము చేసిన ఆయుర్వుద్ధి.
  • తడి పాదములతో శయనించిన ఆయుక్షీణం.
  • స్త్రీలకు బేసి సంఖ్య గల అక్షరములతో, పురుషులకు సరి సంఖ్య గల అక్షరములతో పేర్లు పెట్టుట మంచిది.
  • శిశువు పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటె ఆ స్థానం వారి జన్మరాశి.
  • బంగారం కుజునికి, వెండి గురువుకు, రాగి రవికి, ఇత్తడి బుధునికి, ఇనుము శనికి.
  • రుద్రాక్ష ఎంత పెద్దదైతే అంత మంచిది, సాలగ్రామం ఎంత చిన్నదైతే అంత మంచిది.
  • బుధవారం నాడు బూడిద గుమ్మడి కాయను, గురువారం నాడు కొబ్బరి కాయను ఇంటి ముందు వ్రేలాడ కట్టుకుంటే నరఘోషలు తొలుగుతాయి.
  • యాత్రలలో మార్గ మధ్యమున పరుండునపుడు పాదరక్షలను తలక్రింద పెట్టుకుని పరున్నచో మృత్యుభయం తొలగి సులభ మార్గమధ్య మేర్పడును.
  • తాంబూలం ఇచ్చేటపుడు తమలపాకు, అరటిపండు తొడిమలను ఇచ్చేవారి వైపు, కొసలు తాంబూలం పుచ్చుకునే వారివైపు ఉండాలి.
  • ఇరువురు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చునప్పుడు దక్షిణ ముఖం అను ఆక్షేపణ రాదు. అలాగే హూమం చేయునపుడు, శివునకు అభిషేకం చేయునపుడు నాలుగు వైపులందు నలుగురు కూర్చుండిన దిశల ఆక్షేపణలు ఉండవు.
  • ఇద్దరు కూతుర్లకు ఒకేసారి వివా#హం చేయవచ్చు, కాని ఇద్దరు కొడుకులకు ఒకేసారి వివా#హం చేయకూడదు. కనీసం ఆరు మాసాలు తేడా ఉండాలి. లేదా సంవత్సర భేదం జరగాలి.
  • తులసి, బిల్వ దళాలను ఒకసారి పూజ చేసిన తర్వాత కడిగి మరల మరొకసారి పూజించవచ్చును.
Advertisement

తాజా వార్తలు

Advertisement