Saturday, November 23, 2024

హస్తినలో శారదాపీఠం

న్యూఢిల్లి, ఆంధ్రప్రభ : దేశ రాజధాని నగరం ఢిల్లిలో శారదాపీఠం ఆశ్రమాన్ని నెలకొల్పనున్నామని విశాఖ శారదాపీఠం స్వామి స్వాత్మ్యానంద తెలిపారు. చాతుర్మాస దీక్ష ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న స్వామి, గురువారం ఢిల్లిdలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఢిల్లిలో ఆలయాన్ని, ఆశ్రమాన్ని నిర్మించాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు స్థలం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన తెలిపారు. ఒకట్రెండు ప్రాంతాల్లో స్థల పరిశీలన చేశామని, అయితే తెలుగువారందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలో నిర్మించాలను కుంటున్నామని తెలిపారు.
సనాతన ధర్మ పరిరక్షణలో విశాఖ శారదాపీఠం ఎంతో విశిష్ట సేవలందిస్తోందని, తాజాగా విశాఖ ఏజెన్సీ నుంచి గిరిజనులను తీర్థయాత్రలకు తీసుకె ళ్లామని తెలిపారు. దళిత, గిరిజనుల కోసం ఎన్నో ధార్మిక, సేవా కార్యక్రమాలు నిర్వ#హస్తున్నామని చెప్పారు. శారదా పీఠం కార్యక్రమాలను దేశ రాజధానికి కూడా విస్తరించాలని స్వరూపానందేద్ర స్వామి ఆలోచన అని, ఆ క్రమంలో ఢిల్లిలో ఆశ్రమం ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఉత్తరాదిన ఇప్పటికే తమకు కాశీ మహా క్షేత్రంతో పాటు రిషికేశ్‌ గంగానది తీరాన ఆశ్రమం ఉందని తెలిపారు. హదరాబాద్‌ లోనూ నిర్మాణం పూర్తికా బోతుందని వెల్లడించారు. ఢిల్లిలో ఆశ్రమం ద్వారా ఇక్కడ నివసించే తెలుగువారితో పాటు ఉత్తరా దివారికి కూడా శారదాపీఠం సేవలను విస్తరించాల న్నదే తమ గురువు స్వరూపానందేంద్ర స్వామి సంక ల్పమని స్వాత్మ్యానంద స్వామి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement