సంకట తేఁ హనుమాన ఛుడావై|
మన క్రమ బచన ధ్యాన జోలావై||
సంకటం జీవితంలో భాగమే. సంకటం అంటే విపత్తు. భరించరాని బాధ, వ్యధ! హనుమను ధ్యానించటం వలన సంకటం పట్టు సడలి బాధల నుండి విముక్తి కలుగుతుంది. హనుమను ఏవిధంగా ధ్యానించాలి? మనసును హనుమ నామ, రూప, భావములపై నిలపాలి. ఏకాగ్రతను సాధించాలి. అటూ ఇటూ పరుగెత్తే మనసును నిశ్చలం చేయాలి. నిశ్చిత బుద్ధితో,
అచలం చేయాలి. మనసులో కలిగే ఆలోచనా ప్రవా హాన్ని నియంత్రించాలి. ఈ స్థితిలో కర్మలు
చేయాలి. ఆందోళన లేని సరళ భావనలతో, సునిశిత బుద్ధితో, విచక్ష ణతో, శక్తితో చేసే కర్మాచరణ విజయాన్ని సిద్ధింపచేస్తుంది. ఈ సాధనలో మాటలను తగ్గించాలి. మాట్లాడవలసిన సమయం లో ఉద్వేగము, తొట్రుపాటు, వేగము, ఆవేగము, కాఠిన్యము లేని మధుర, మంజుల సంభాషణ చేయాలి.
స్పర్ధకు తావీయని రీతిలో మాట్లాడాలి.
మనసు, వాక్కు, కర్మల సంవిధానమే త్రికరణ శుద్ధి.
హనుమ మనసు రామాంచితం.
హనుమ వాక్కు రామనామస్మరణాంచితం.
హనుమ కార్యకలాపమంతా రామకార్య సమంచితం.
కనుక హనుమమహాత్ముడు. అంటే ఆత్మగా నిలకడ
చెందిన వాడు.
హనుమను ధ్యానించటం అంటే, ఏ పని చేసినా త్రికరణ శుద్ధితో చేయాలి. ఎపుడైతే సమన్వయం సాధింపబడిందో
సంక టం, సంశయం, సందేహం, సందిగ్ధం కలుగవు. స్పష్టత, సౌమ్యత, సమతుల్యత ఏర్పడి విజయం కైవస మౌతుంది.
– వి.యస్.ఆర్.మూర్తి
9440603499
హనుమ మనసు రామాంచితం!
Advertisement
తాజా వార్తలు
Advertisement