Saturday, November 23, 2024

హనుమంత వాహనంపై శ్రీరాముడి రాజసం

ఒంటిమిట్ట,ప్రభన్యూస్‌:అన్నమయ్య జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగం గా నాలుగవ రోజు బుధవారం రాత్రి స్వామి వారు హనుమంత వాహనంపై అభయ మిచ్చారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనసేవ వైభవంగా జరిగింది. భక్తులు అడుగడుగునాకర్పూరహారతులు సమ ర్పించిస్వామివారిని దర్శించుకు న్నారు. కళాబృందాల కోలాటాలు ఆకట్టు-కున్నాయి. త్రేతాయుగంలో రామభక్తునిగా, భగవద్బ éక్తులలోఅగ్రగణ్యుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు హనుంతుడు. రాముడు భక్తాగ్ర గణ్యుడైనహనుమకు ఆత్మతత్వాన్ని బోధించినట్లు- ప్రాచీన వాఙ్మయం నుం డి తెలుస్తోంది. హనుమంతుడు తనను సేవించే భక్తులకు ఆత్మోన్నతిని ప్రసాది స్తు న్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదా యంలో హనుమద్వాహన సేవను సిరియ తిరు వడిగా కీర్తిస్తారు. వాహనసేవలో ఈ కార్యక్రమంలో డెప్యూటీ- ఈవో రమణ ప్రసాద్‌, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూప రిం- ట-ండెంట్‌ పి.వెంకటేశయ్య, -టె-ంపుల్‌ఇన్స్పెక్టర్‌ధనుంజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement