నీవు నడుస్తున్న ఆధ్యాత్మిక మార్గంలో నీ స్నేహితులు, బంధువులు నీకు సహకారాన్ని అందించకపోతే, వారి వెంటపడి వారి మార్పుకు ఎందుకు నీ మనసును పాడు చేసుకోవాలి? నీవు ఏమి చెప్పినా వారు నీ మాట వినరు అని నీకు తెలుసు. ఇందుకు ఉత్తమ పద్ధతి నీ మార్పుకై నీవు పాటుపడటం. ఒక న ది తన నీటిని త్రాగండి అని అందరినీ కోరుకోదు. నదిలోని నీరు స్వచ ్ఛంగా, పారుతూ, మధురంగా ఉంటే జనులు స్వతాహాగా దాని వద్దకు వస్తారు. అదే విధంగా, నీ ఆధ్యాత్మిక కృషితో ఎంత ఆకర్షణీయంగా నువ్వు తయారుకావాలంటే ప్రతి ఒక్కరూ నీ మార్గంలోకి వచ్చి చేరాలనుకుంటారు, స్వతహాగా.
మనుకున్న మోహము కారణంగా మనం ఈ మార్గంలో ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. దీని కారణంగా మన ఉన్నతి ఇతరుల మీద ఆధారపడి లేదు అన్న విషయాన్ని మరచిపోతున్నాము. ప్రతి ఒక్కరూ తమలోని విశేషతల అనుసారంగా విలక్షణంగా మెరుస్తూ ఉంటారు. ఈ సంగతి మర్చిపోయిన మనం ఇతరులు మన గురించి మంచిగా ఆలోచించాలి అన్న ప్రయత్నంలో మునిగిపోయి అదే అలవాటుగా అయిపోతుంది. మన హితం కోసం ఇతరులను ఈవిధంగా ఉపయోగించుకోవడం ఒక విధంగా మోస పూరితమే అవుతుంది. ఈ కపటము దు:ఖాన్ని కలిగిస్తుంది. మన దృష్టిని మన లక్ష్యంపై సారిస్తే ఈ అలవాటు నుండి దూరం కావచ్చు. లేకపోతే, సంకుచిత భావాల ప్రభావంలోకి వస్తున్న కారణంగా మాటిమాటికీ మనలోని ఆత్మిక శక్తులను కోల్పోతూ ఉంటాము. ఇలా పోగొట్టుకునే బదులు, మన కర్మలపై మనం శ్రద్ధ వహించాలి. మన ం ఇటువంటి వాటి నుండి విముక్తులైనప్పుడే ఇతరులనూ ముకులం చెయ్యగలము.
-బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి