Wednesday, November 27, 2024

స్త్రీశక్తి విజయానికి సంకేతం విజయదశమి

ఈచరాచర జగత్తుని నడిపించేది శక్తి. ఆ శక్తినే ఆదిశక్తి, పరాశక్తి అంటారు. ఆశక్తి త్రిగుణాత్మకంగా ఉంటు-ంది. తమో గుణ ప్రధానమైనప్పుడు మహాకాళి అనే పేరుతో, రజో గుణ ప్రధానమైనపుడు ఆశక్తిని మహాలక్ష్మి అని పిలుస్తారు. స్వత్తగుణంతో ప్రకాశించే శక్తి మహాసరస్వతి. సర్వచైతన్య స్వరూపిణిగా వెలు గొందే తల్లి లలితా పరాభట్టారిక. ఇవి స్థూలం గా చెప్పుకొనేవి. నిజానికి ఎక్కడ ఏ రూపమైన శక్తి ఉన్నా అది ఆఆదిపరాశక్తి వ్యక్తస్వరూపమే. పరమాత్ముడు శక్తుడు. ఆయన శక్తి జగ దంబ. ఈసృష్టి సమస్తం వారి విలాసం. దానినే దివ్య శృంగారం అని అంటారు. ఇవే కాదు మహాశక్తి ఎప్పుడు ఎక్కడ దుష్టసంహారం చేయ వలసిన అవసరం వచ్చినా, శిష్టరక్షణ చేయవల సిన అవసరం కలిగినా జీవులపై ఉన్న అంతు లేని ప్రేమతో అవతరిస్తూ వచ్చింది. ఎంతైనా జగన్మాత కదా! అన్ని సందర్భాలలోను ఆ తల్లి ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమినాడు అవతరించి నవమినాడు రాక్షససంహారం చేయటం జరిగిం ది.కనుక ఆదిపరాశక్తిని ఆసమయంలో పూజిం చి అనుగ్రహం పొందటం సంప్రదాయం.
విజయదశమి
సమాజంలో ఎప్పుడూ మంచిచెడూ కలిసే ఉంటాయి. వాటి మధ్య జరిగే సంఘర్షణలో మంచి గెలవటానికి ప్రతీక విజయదశమి. అలా మంచి గెలవటానికి ఎప్పుడు ఏ శక్తి కావాలో ఆ శక్తిగా అవతరించి సజ్జనులకు తోడ్పతుంది జగన్మాత. అది శరీరంలో అనారోగ్యం కావ చ్చు, మనస్సులో ఉన్న దుర్గుణాలు, దురాలోచ నలు కావచ్చు, సమాజంలో ఉన్న దురాచారా లు, మూఢనమ్మకాలు, ప్రకృతిని, పర్యావరణా న్ని కలుషితం చేసే మాలిన్యాలు కావచ్చు, సృష్టి నియమాలకి విరుద్ధంగా కలకాలం బతికిఉండా లనే స్వార్థంకావచ్చు, ఒకజాతినో, వర్గాన్నో చుల కన చేసే అహంకారం కావచ్చు, ఒక జాతినో, వర్గాన్నో అవమానం చెయ్యటం కావచ్చు- ఇటు-వంటి ఎన్నో చెడు లక్షణాల మీద విజయం సాధించిన రోజు విజయదశమి. ముఖ్యంగా స్త్రీల పట్ల చులకనభావం కలిగిన దున్నపోతు మనస్తత్వం మీద స్త్రీ శక్తి విజయానికి సంకేతం విజయదశమి. సద్భావనలు పెంపొందించుకునే రోజు. అందుకే ఒకరినొకరు అభినందించుకుం టూ జమ్మి పత్రాలని బంగారం పేరుతో పంచు కుంటారు.
శమీవృక్ష పూజ, ఆయుధ పూజ
విజయ దశమి రోజు ఆయుధ పూజ, శమీ వృక్ష పూజ, పాలపిట్ట దర్శనం చేసుకుంటే తమ బ్రతుకులు తరిస్తాయని విశ్వాసం. అజ్ఞాత వాసానికి వెళ్ళేటప్పుడు పాండవు ల ఆయుధాలు, ఆభరణాలను జమ్మిచెట్టు మీద భద్రపరుస్తారు. అజ్ఞాతవాసం ముగిసేవరకు వాటిని జాగ్రత్తగా కాపాడమని జమ్మి చెట్టుకు నమస్కరిస్తారు. అజ్ఞాతవాసం పూర్తయ్యే సమ యంలో, దశమి రోజు ఆయుధాలను అర్జును డు పైకితీసి పూజచేస్తాడు. తర్వాత ఉత్తర గోగ్ర #హణం యుద్ధంలో విజయం సాధిస్తాడు. అం దుకే ఆశ్వీయుజ శుద్ధ దశమి విజయదశమిగా ప్రఖ్యాతమైంది. తమ జీవితాలలో విజయాలు సాధించాలని, ప్రజలు వారి పనిముట్లను, యం త్రాలను, పరికరాలను వ్యాపార సముదాయా లను అలంకరించి, పసుపు కుంకుమలతో పూజ లు చేస్తారు. పుస్త్తకాలను పూజిస్తారు. నూతన కార్యక్రమాలకు విజయ దశమి రోజున శ్రీకారం చుడతారు. శమీవృక్షానికి పూజలుచేస్తారు. శమీ వృక్షం అంటే జమ్మిచెట్టు.
”శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియ దర్శినీ.”
శమీ వృక్షం శత్రువులను నాశనం చేస్తుం దని, పాండవుల ఆయుధాలను మోసిందని, రామునికి ప్రియమైనదని ఈ శ్లోకం అర్ధం. శ్రీరాముడు రావణునితో యుద్ధానికి లంకకు వెళ్తున్నప్పుడు, రాముడు శమీవృక్షాన్ని పూజిం చాడని రామాయణం చెబుతోంది. ఇలా పురాణకాలం నుంచి శమీ వృక్షానికి పూజలు చేస్తే విజయం చేకూరుతుందనేది ప్రజ లందరి విశ్వాసం. అందుకనే విజయ దశమి రోజున అపరాజితను పూజిం చి, పైన చెప్పిన ”శమీ శమయతే…” శ్లోకం చదువుకుంటూ, జమ్మి చెట్టుకు ప్రదక్షణం చేస్తా రు. తర్వాత పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. శమీ వృక్ష పూజ చేసిన తర్వాత పాలపిట్ట దర్శ నం కావాలని అంతా కోరుకుంటారు. పాండవు లు అజ్ఞాత వాసం అయి తిరిగివెళ్తున్నప్పుడు, పాలపిట్ట దర్శనం అయ్యిందని మహాభారతం చెబుతోంది. నవరాత్రులలో అర్చనలు, ఆరాధ నలే కాకుండా కొన్ని ప్రాంతాల వారు బొమ్మల కొలువులు పెడతారు. బ్రహ్మ అనే మాటకి వికృ తి బొమ్మ. ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ చేసిన ప్రపంచానికి ప్రతిరూపమే బొమ్మల కొలువు. ఎన్నో విశిష్టతలు, విశేషాలు, సంప్రదాయ కత, సమిష్టి తత్వం, అర్ధం, నేపధ్యం, సందడీ సమారోహం ఉన్న విజయ దశమి హందువులు అంద రికీ ఎంతో ప్రముఖమైనది. ప్రశస్తమైనది.

Advertisement

తాజా వార్తలు

Advertisement