Saturday, November 23, 2024

సౌందర్యపు రాశి తిలోత్తమ జన్మ రహస్యం!

ఎంతటి అన్నదమ్ములైనా, ఒకే తల్లిదండ్రులకి పుట్టినా జీవితంలో ఎప్పుడైనా ఒక సమయంలో మనస్ప ర్ధలూ, ఈర్ష్యాద్వేషాలూ రావచ్చు. అలా రాకుండా ఉండాలంటే తగినవిధంగా ధర్మ మార్గంలో ప్రవర్తించాలి అని సందేశం ఇచ్చే కథ మనకు మహాభారతంలో కనిపిస్తుంది. ఒకసారి నారదుడు పాండవుల ఇంద్రప్రస్థానికి వచ్చా డు. ధర్మరాజు చేసిన అతిథి పూజలను అందుకొని,ద్రౌపది లేని సమయం చూసి పాండవులకి ఒక కథను చెప్పాడు. ”నికుంభుడనే రాక్షసుడికి సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు అమితమైన ప్రేమానురాగాలతో ఉండేవారు. రాక్షసులైనా బ్రహ్మను గురించి కఠోర తపస్సు చేయ తలపెట్టి వింధ్యపర్వ తాలకు వెళ్ళారు. ఆ సోదరుల తపోదీక్షకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. కామరూపం, కామగమనం, అమర త్వం, సకల మాయలూ మొదలైన వరాలని వారు కోరుకొన్నా రు. ”పుట్టిన ప్రాణి గిట్టక మానదు కావున అమరత్వం ఇవ్వ డం కుదరద”ని చతుర్ముఖుడు చెప్పాడు. వారిరువురకీ ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమాభిమానాలున్నాయి కనుక ఇద్దరూ ”ఇతరులెవ్వరి వలనా మరణం లేకుండే స్థితి”ని కోరు కొన్నారు.. వారికి బ్రహ్మ ఇచ్చిన శక్తుల వల్ల పులులూ, ఏను గుల రూపాలు ధరించి మునుల ఆశ్రమాలను దాడి చేసారు. వరగర్వంతో సాధు జనులకి కంటకంగా మారారు. ఋషు లంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టు-కొన్నారు. ఇతరులెవ్వ రి వలనా మరణం లేకుండా వరం కోరుకొన్నారు కానీ వారి లో ఒకరి వలన ఇంకొకరికి మరణం కలుగకుండ వరం కోరు కోలేదన్న సూక్ష్మాన్ని గ్రహించి వెంటనే విశ్వకర్మను పిలి పించి సృష్టిలోకెల్ల అత్యంత సౌందర్యరాశిని సృష్టించమని, సృష్టిలో అన్ని వస్తువులలోంచీ నువ్వు గింజంత ప్రమాణంలో అం దాన్ని స్వీకరించి ఆ సౌందర్యరాశిలో పొందుపరచాలని సూచించాడు. అలా విశ్వజనితమైన సౌందర్యపు ‘రాశి’ జీవం పొందింది. ఆమెకు బ్రహ్మ ‘తిలోత్తమ’ (తిల ప్రమాణంలో అన్నిటి అందం పొందింది) అని పేరు పెట్టాడు. తిలోత్తమ బ్రహ్మకు విశ్వకర్మకు నమస్కరించి కర్తవ్యోన్ముఖురాలైంది. మద్యం మత్తులో మదిరాక్షుల నడుమ భోగాలనుభవి స్తున్న సుందోపసుందుల ముందు నిలచి వయ్యారాలు పో యింది. వారిని ఆకట్టు-కొంది. ఆమెకోసం పోటీపడ్డారు. అప్పు డు తిలోత్తమ ఇద్దరిలో ఎవరు బలాఢ్యుడో అతనికే సొంత మౌతానని చెప్పింది. ఆత్మీయానుబంధంతో ఉన్న సోదరులు కాస్తా ఒకరి మీదకు ఒకరు కాలు దువ్వుకొన్నా రు. భీకరమైన పోరు సలిపి ఇద్దరూ మర ణించారు. ఆత్మీయులైన సోదరులే అయినా స్త్రీ విషయంలో తగవులు రావచ్చు కనుక పాండవు లు ద్రౌపది విషయంలో జాగ్రత్త అని చెప్పాడు నారదుడు.
నారదుని సమక్షంలోనే ధర్మరాజు తన సోదరులతో ద్రౌపదితో ఒక్కొక్కరూ ఒక సంవత్సరం భర్తగా ఉండేలా ఆ సమయంలో వేరెవరైనా ఈ కట్టు-బాటు-దాటితే ఒక సంవత్స రం తీర్ధ యాత్రలకు వెళ్ళి వచ్చేలా ఏర్పాటు- చేసాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement