మహాభారతం పంచమ వేదం. వ్యాసమహర్షి ఈ కలియుగ ప్రజలు పాటించవలసిన ధర్మాలు, భగవతత్త్వము, జ్ఞాన యోగం వంటి వాటిని ఎన్నో ఉపాఖ్యానాల రూపం లో అందించారు. అందులో ఒకటి ఈ సూర్య సృష్టి.
సప్త ఋషులలో ఒకరైన జమదగ్ని మహర్షి తన భార్య రేణుకా దేవితో కలసి, ఆశ్రమం దూరంగా నున్న బహరంగ ప్రదేశంలో వినోదానికై ఒకరోజు శస్త్ర ప్రయోగం చేస్తున్నాడు. దూరంగా పడిన బాణాలను భార్య రేణుక తెచ్చి మరల ఆయనకు అందింస్తుండేది
ఇలా ఆయన శస్త్ర ప్రయోగం చేయడం, ఆమె తీసుకురావడం ఒక క్రీడగా మారింది. సూర్యుడు నడిమింటికి (మిట్ట మధ్యాహ్నం) వచ్చాడు. రేణుక ఆ ఎండ తీవ్రతకు అలసిపోతోంది. దానివల్ల బా ణాలు ఏరి తీసుకురావడానికి, కొంత జాగు చేసి వస్తుంటే జమదగ్ని మహర్షి ”లోలాక్షీ! ఇంత జాగు చేసేవేమిటి?” అని అడిగితే ”సూర్యు ని తేజస్సువల్ల నేల వేడెక్కింది. కాళ్ళు కాలుతూండడం వల్ల వడి వడిగా రాలేకపోయాను. తల కూడా వేడెక్కింది. చెట్టునీడలో కొంతసేపు నిలవడం వల్ల ఆలస్యమైంది” అంటూ రేణుక శ్వేధం (చెమట)తో ఉన్న ముఖాన్ని, శరీరాన్ని తుడుచుకొంటోంది.
ఆమె పరిస్థితిని చూసి మహర్షి క్రోధంతో ”ఏమేమి సూర్యుడు నిన్ను బాధించాడా? ఆ ఫలితం ఇప్పుడే అనుభవిస్తాడు. నా అస్త్రాల మంటలో క్రమ్మి వేస్తాను. అని అస్త్ర విద్యను ప్రయోగించబోగా ఆకా శంలో జ్యోతి స్వరూపుడుగా ఉన్న సూర్యుడు గ్రహించి ఓ బ్రాహ్మణ వేషంలో వచ్చి, మహర్షికి నమస్కరించి, ”శాంతం వహం చండి. క్రోధాన్ని చాలించండి” అన్నాడు.
అప్పుడు మరింత కోపంతో జమదగ్ని మహర్షి ”చాలించు నీ మాటలు. ఎవ్వరివి నువ్వు? ప్రక్కకు తప్పుకో! ఆ భగభగమనే సూ ర్యుడిని నేలపై కూలుస్తాను.” అంటూ శస్త్ర ప్రయోగానికి సిద్ధమవు తున్నాడు. ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోకుండా ప్రక్కకు తప్పుకొని, మునీంద్రా! మీలాంటి మహర్షులు ఇటువంటి క్రూరపు నడవడిక కలిగి ఉండరు కదా! ఎండవేడిమి వల్లనే కదా మేఘాలు ఏర్పడతా యి. వర్షాలు కురుస్తున్నాయి పంటలు పండుతాయి. వక్ష సంపదకు మూలం సూర్య కిరణాలే కదా! ఓషధుల సంపద పెరుగుతుంది. పంచభూతాలకు ఆధారమవుతుంది. సూర్యచంద్రుల గమనం చేస్తేనే కదా ప్రకృతికి ఆధారభూతమవుతుంది. సూర్యుడుకి కష్టం కలిగిస్తే ఇదంతా లోపిస్తుంది.!” అన్నాడు. ఇంత చెప్పినా జమదగ్ని మహర్షి శాంతించలేదు. సూర్యుడు మనసులో భయపడి, ”మునీ శ్వరా! నేనే సూర్యుడను. నావల్ల ఏ ఆపదలు, కీడు కలిగినా సహం చండి. మీ హృదయం దయ, కరుణలతో కూడినదని అన్ని లోకా ల్లో కొనియాడడం విని సంతోషం పొందుతున్నాను. మిమ్మల్ని శర ణు వేడుతున్నాను.” అన్నాడు.
సూర్యుని మాటలకు మహర్షి శాంతించాడు. సూర్యు డు తన సంకల్ప బలంచేత గొడుగు, పాదరక్షలు సృష్టించి ఇచ్చి, ఇవి ఇంత కుపూర్వం లేవు. ఈ గొడుగు వల్ల నా వేడి ఏమీ శరీరానికి తాకదు. ఈ పాదరక్షలు ధరించడం వల్ల భూతాపం నుండి పాదాలకు రక్షణ ఉంటుంది. మహర్షీ! అపూర్వమైన ఈ సృష్టి విలాసంలో సృష్టించ బడిన ఈ వస్తువులు దయతో విప్రులకు, పండితులకు, వృద్ధులకు, ఎవరికైనా దానం చేయడంవల్ల ఇహ, పరలోకాల్లో సౌఖ్యాన్ని సుస్థిరం చేస్తుంది.” అని చెప్పగా మహర్షి సంతోషించి, సూర్యుడుని గౌరవించి, సాగనంపాడు.
వాటికి ఆ పవిత్రత ఉండబట్టే వివాహ సమయంలో నిర్వ హంచే స్నాతకంలోను, బ్రహ్మోపదేశం సమయంలోను, సన్యాస దీక్ష సమయంలోనూ వినియోగిస్తారు. శ్రాద్ధ సమయాలలోను, వేసవి ప్రారంభ సమయంలోను గొడుగు, చెప్పులు దానం చేస్తుంటారు. వీటి దానం ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది.
సంకలనం: ఎ.రంగారావు
7989462679