విశాఖపట్నం, ప్రభన్యూస్ బ్యూరో: సింహగిరి వైకుంఠవాసుల మెట్టపై కొలువున్న వైకుంఠనాధుడికి బుధవారం ఆలయ అర్చకవర్గాలు వి శేష పూజలు ని ర్వహించారు. ఆలయ చరిత్రలో వైకుంఠ నారాయణుడు అత్యంత ప్రాచుర్యం పొందారు. అయితే ఉత్సవాల సమయంలో మాత్రమే ఇక్కడ స్వామికి దూప, దీప నైవేద్యాలు సమర్పించేవారు. అయితే తాజాగా ఆలయ ఇవో ఎం.వి.సూర్య కళ ఈ ప్రాంతాన్ని పర్యటించడం, పలువురు భక్తులు సూచించ డంతో ఇక మీదట ప్రతిరోజు వైకుంఠ నారాయణస్వామికి దూప, దీప నైవేద్యాలు సమర్పించాలని, ప్రతీరోజు ప్రత్యేక వస్త్రాలంకరణ చేయాలని అధికారులను ఆదె శించారు. ఈ మేరకు బుధవారం ఆలయ పురోహితులు, అలంకార్ కరి సీతారామాచార్యులు నేపధ్యంలో అర్చక బృందం వైకుంఠ నాధుడిని సర్వాంగ సుందరంగా అలంక రించి విశేష పూజాది కార్యక్రమాలు జరిపించారు. అంతే కాకుండా వైకుంఠ నారాయణుడి వైభవం భక్తులందరికి తెలిసే విధంగా ప్రత్యేక బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ తెలి పారు. ఏఇఓ నక్కాన ఆనందకుమార్ ఆధ్వర్యంలో పలువురు సిబ్బంది ఆయా కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement