విశాఖపట్నం(సింహాచలం), ప్రభన్యూస్ బ్యూరో:ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు , సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజాది కార్యక్ర మాలు నిర్వహిం చారు. విశేష హోమాలుతో పాటు అభిషేకాలు, అర్చనలు గావించారు. కళ్యాణ మహొ త్సవం పూర్తి చేసుకున్న సింహాద్రినా ధుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను తెల్లవారు జామునే సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంత రం గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలుతో అభిషేకం జరిపారు. అనంతరం మంగళాశాస నాలు గావించి స్వామి దర్శనం భక్తులకు కల్పించారు. విశేష హోమాలు జరిపించి అందులో భక్తులను భాగస్వాములను చేశారు. సాయంత్రం సిరులొలికించే సింహాద్రినాధుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను సర్వాభరణాలుతో అందంగా అలంకరించారు. అప్పటికే చూడముచ్చటగా సిద్ధం చేసిన పల్లకిలో స్వామి, ఉభయ దేవేరీలను ఆశీనులను చేసి సింహగిరిపైన మాడవీదుల్లో తిరువీధి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు స్వామికి మంగళహారతులతో ఘన స్వాగతం పలికి స్వామి, అమ్మవార్లను సేవించి దర్శించుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement