విశాఖపట్నం, ప్రభన్యూస్ బ్యూరో: సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం లో గురు వారం నృసిం హదీ క్షలు వైభవంగా ప్రారంభమ య్యాయి.కార్తీకమాసం శుక్లపక్షం, చతుర్దశి పర్వదినం పురస్క రించుకొని పెద్ద ఎత్తున భక్తులు శాస్త్రోక్తంగా నృసింహ స్వామి మాలలను ధరించారు. ఆలయ ఇన్ఛార్జ్ ప్రధానార్చకులు ఇరగవరపు వెంకటరమణాచార్యులు, ఆలయ పురోహితులు కరి సీతారామా చార్యులు తదితరులు తొలుత సింహాద్రినాధుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు. షోడషోపచార పూజా కార్యక్రమాలు, విశ్వక్షేణ, ఆరాధన, పుణ్యహవచనంలతో స్వామి, అమ్మవార్లను ఆవాహన చేయడం జరిగింది. అనంతరం భక్తులకు శాస్త్రోక్తంగా మాలధారణలు గావించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామి మాలలు, నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం మాలలు ధరించిన భక్తులందరికి సింహాద్రినాధుడి గర్బాలయంలో దర్శనం కల్పించారు. ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ ఆధ్వర్యంలో ఏఇఓ నక్కాన ఆనందకుమార్, వేదపండితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా గురువారం మాలలు ధరించిన భక్తులు మండలి దీక్షలు వచ్చేనెల 29 నాటితో ముగియను న్నాయి. ఇక ఈనెల 26న 32 దీక్షలు ప్రారంభించిన భక్తులు వచ్చే నెల 29 నాటితో దీక్షలు ముగియనున్నాయి. ఇదిలా ఉండగా ప్రతీఏటా మాదిరిగానే శుక్రవారం సాయంత్రం సింహాద్రినాధుడు వరాహపుష్కరణికి నదీహారతి ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఆలయ వర్గాలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement