Saturday, November 23, 2024

సింధూ నది పుష్కరాలు

శ్రీ ప్లవనామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు కార్తీక మాస బహుళ విదియ శనివారం(20.11.2021)న రోహిణి నక్షత్ర 3వ పాదం వృషభ రాశి శివయోగం తైతుల కరణం సింహలగ్న సమయంలో దైవ గురువు బృహస్పతి అంటే గురుడు కుంభరాశిలో ధనిష్ట నక్షత్ర 3వ పాదములో 50 శాతం బలంతో సమ స్థితిలో బాల్య అవస్థలో అడుగుపెట్టనున్నా రు. ఆ క్రమంలో ఆరోజు రాత్రి అయినది కనుక రెండవ రోజు అయిన నవంబర్‌ 21, 2021 ఆదివారం సూర్యోదయం నుంచి డిసెంబర్‌ 2 వరకు అంటే 12 రోజుల పాటు సింధూనదికి పుష్క రాలు జరగనున్నవి. ఋగ్వేదం అనేక నదులను వివరిస్తుంది. వాటిలో ”సింధు” అనే పేరు ఉంది. ఋగ్వేదములో ”సింధు”ను ప్రస్తుత సింధునది అని భావిస్తారు. ఇది దాని వచనంలో 176 సార్లు, శ్లోకాలలో 94 సార్లు ధృవీకరించబడింది. చాలా తరచుగా ”నది” సాధారణ అర్థంలో ఉపయోగించబడుతుంది. ఋగ్వేదం లో, ముఖ్యంగా తరువాతి శ్లోకాలలో, సింధు నదిని సూచించడా నికి ఈ పదానికి అర్ధం ఇరుకైనది, ఉదా. నాడిస్తుతి సూక్తా శ్లోకంలో పేర్కొన్న నదులలో సింధునది ప్రస్తావన ఉంది. ఋగ్వేద శ్లోకాలు బ్రహ్మపుత్ర మినహా అందులో పేర్కొన్న అన్ని నదులకు స్త్రీ లిం గాన్ని వర్తిస్తాయి. కానీ సింధూనది మాత్రం పుంలింగాన్ని సూచి స్తుంది. అదే సింధూ నది ప్రత్యేకత. సింధూ నది టిబెట్టులోని మానస సరోవరం, కైలాస పర్వ తాల నుంచి జమ్ము కశ్మీరులోని లద్దాక్‌ మీదుగా- గిల్గిట్‌, బాల్టిస్థా ను నుండి పాకిస్థానులోని పంజాబు రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహా సముద్రంలో కలుస్తోంది. సింధూనదికి సంబంధించిన అనేక ఉప నదులు భారత్‌లోని జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ల మీదుగా ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవే శి స్తాయి. సింధు నది ప్రపంచంలోకెల్లా 21వ అతిపెద్ద నది. సింధూనది ఒకరకంగా పాకిస్థానుకు జీవనాడి! పాకిస్తాన్లోని పంజాబ్‌ రాష్ట్రంతో సహా ఆ దేశంలోని మొత్తం 65 భూభాగం సింధూ పరీవాహక ప్రాంతమే. ఆ ప్రాంతంలో నిర్మించిన కాలు వల వ్యవస్థ, ప్రపంచంలోనే అతి పెద్దదిగా గుర్తింపు పొందింది. సింధూనది కశ్మీర్‌ లోయలో ప్రవేశించదు. కానీ సింధునది ఉప నదులు కశ్మీర్‌ లోయలో ప్రవహిస్తాయి. అయితే కొన్ని టూరి స్టు ఏజెన్సీలు సింధూ పుష్కరాల సమయంలో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నాయనే విమర్శలున్నాయి. సోనేమార్గ్‌లో ఉద్భవిం చిన ఒక వాగును కశ్మీరీలు సింధ్‌గా వ్యవహరిస్తారు. ఈ వాగు షాధిపూరా అనే గ్రామం సమీపంలోని నారాయణ్‌ భాగ్‌ వద్ద జీలం నదిలో కలుస్తోంది. రెండు నదులు కలిసే సంగమం కావ డంతో యాత్రీకులు ఇక్కడే పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారు. నిజానికి సింధునదీ లద్దాక్‌ మీదుగా పాక్‌ ఆక్రమిత గిల్గిట్‌ బాల్టిస్తాన్‌ ప్రవేశిస్తుందనే విషయం మనం మర్చిపోరాదు.
ఆచరణ విధానం
మూడుసార్లు నదిలో మునిగి, రెండు చేతులతో నదీజలా లను తీసుకొని 18సార్లు తర్పణాలుగా నదిలోనే వదలాలి.
1) ఓం సంధ్యాం తర్పయామి 2) ఓం గాయత్రీం తర్ప యామి 3) ఓం బ్రాహ్మం తర్పయామి 4)ఓం నిమృజీం తర్ప యామి 5) ఓం ఆదిత్యం తర్పయామి 6) ఓం సోమం తర్ప యామి 7) ఓం అంగారకం తర్పయామి 8) ఓం బుధం తర్ప యామి 9) ఓం బృహస్పతిం తర్పయామి 10) ఓం శుక్రం తర్ప యామి 11) ఓం శనిం తర్పయామి 12) ఓం రాహుం తర్పయామి 13) ఓం కేతుం తర్పయామి 14) ఓం యమం తర్పయామి 15) ఓం సర్వదేవతాన్‌ తర్పయామి 16) ఓం సకల పితృదేవతాన్‌ తర్ప యామి 17) ఓం సర్వఋషీన్‌ తర్పయామి 18) ఓం సర్వ భూతా ని తర్పయామి

శ్లో !! నందినీ నళినీ సీతా మాలినీ చ మహాపగా!
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపధ గామినీ!!
భాగిరధి భొగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ!
ద్వాదశైతాని నామాని యత్రయత్ర జలాశయే!!
స్నాన కాల పఠే న్నిత్యం మహా పాతక నాశనం!!

స్నానం తరువాత ప్రార్ధనా శ్లోకాలను చదువుతూ, ప్రవాహా నికి ఎదురుగా, వాలుగా, తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటన వ్రేలుతో నీటిని కదిలించి మూడు దోసిళ్ళ నీళ్ళు తీరానికి జల్లి, తీరానికి చేరి బట్టలని పిండుకోవాలి. తరువాత పొడి బట్టలు కట్టుకొని తమ సంప్రదాయానుసారం విభూతి ధరించి సంధ్యా వందనాదులు చేసుకోవాలి. తరువాత నదీ తీరానగాని దేవాల యాన గాని దైవమును అర్చించాలి.
మొదటి రోజు నారాయణనుడి అర్చన జప తర్పనాదులతో ప్రారంభించి రెండోరోజు భాస్కర. మూడవ రోజు మహాలక్ష్మి. నాలుగో రోజు గణష్‌, ఐదవ రోజు శ్రీకృష్ణ. ఆరవ రోజు సరస్వతీ. ఏడవ రోజు పార్వతీ. ఎనిమిదవ రోజు మహేశ్వర. తొమ్మిదవ రోజు అనంత. పదవ రోజునసింహ, పదకొండవ రోజు వామన, పన్నెండవ రోజు రామచంద్రుడు. ఇలా 12 రోజులు 12 దేవతలను అర్చించి 12 రోజులు 12 రకాల దానాలు ఇవ్వాలి. అలా చేయ టం పుష్కర వ్రతంగా పిలుస్తారు ఇది ఉత్తమమైనది.
అలాగే ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్రాద్ధం నిర్వహించి పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వాలి. మొదటిరోజు హిరణ్య శ్రాద్ధం. తొమ్మిదవ రోజు అన్న శ్రాద్ధం, పన్నెండవ రోజు ఆమ శ్రాద్ధం తప్పనిసరి. పుష్కర సమయంలో నదీస్నానమేకాక పితృదేవతల కు పిండ ప్రదానం చేయడం కూడా ముఖ్యం.
పుష్కర సమయంలో చేయవలసిన దానాలు
మొదటి రోజు ధాన్యము, రజితము, సువర్ణము, భూమి రెండవ రోజు వస్త్రము, లవణము, గోవు, రత్నము. మూడవ రోజు బెల్లం, కూరలు, వాహనం, గోవు, అశ్వం నాలుగవ రోజు నేయి, నువ్వులు, తేనె, పాలు, వెన్న, నూనె ఐదవ రోజు ధాన్యము, బండి, గేదె, ఎద్దు, నాగలి ఆరవ రోజు కస్తూరి, గంధపుచెక్క, కర్పూ రము, ఓషదులు ఏడవ రోజు గృహము, ఆసనము, మంచము, పల్లకి ఎనిమిదవ రోజు కందమూలాలు, అల్లం, పుష్పమాల, వెన్న తొమ్మిదవ రోజు కన్య, పఱుపు, చాప, దేవతా విగ్రహాలు పదవ రోజు వెండి, బంగారం, పూలు, ముత్యాలు పదకొండవ రోజు కంబళి, సరస్వతి, యజ్ఞోపవీతము పన్నెండవ రోజు దశ, షోడశ మహాదానాలలో అన్నిటిని దానం ఇవ్వవచ్చు. ఈ విధంగా పుష్కర వ్రతం దానాదులు ఆచరించటం అనంతకోటి పుణ్య ఫలితాలను కలిగిస్తాయి.

– డా. చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement