విశాఖపట్నం, ప్రభన్యూస్ బ్యూరో: రెండేళ్లు విరామం తరువాత వైశాఖ శుద్ధ తదియ రానే వచ్చింది. భక్తకోటి యావత్తు ఎప్పుడెప్పుడా ఆ సింహాద్రినాధుని నిజరూపదర్శ నం సాక్షాత్కరిస్తుందని ఎదురు చూస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది ఆ స్వామి చల్లగా కరుణించాడు. భక్తకోటి ఆశించిన విధంగా నిజరూపంలో దర్శనమిచ్చాడు. కనులారా దర్శించు కున్న భక్తులు పులకరించిపోయారు. సింహాద్రినాధుడి చందనోత్సవం అత్యంత విజయవంతంగా ముగిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి నిజరూపదర్శనం భక్తులకు లభించింది. ఇక మంగళవారం రాత్రి స్వామిని చల్లబ రిచేందుకు , శాంతింపజేసేందుకు నిర్వహించిన సహస్రఘ టాభిషేకం అపురూపంగా నిలిచింది. సుమారు మూడున్నర గంటల పాటు స్వామికి విశేష పంచామృతాభిషేకాలు నిర్వహించారు. చూసేందుకు భక్తులకు రెండు కళ్లు చాల లేదన్నట్లు వైధిక వర్గాలు మైమరిపించాయి. చినజీయర్ స్వామితో పాటు అహోబిలం జీయర్‌స్వామి, ఇతర జీయర్లు, ఆలయ వైధిక వర్గాలు నిరంతరం సహస్రఘటాభిషేకాన్ని కనుల పండుగచేశాయి. తొలుత చినజీయర్ గర్భాలయంలో ఉన్న స్వామికి అభిషేకం గావించారు. అప్పటికే అర్చక పరివారం స్నపనం పూర్తి చేసింది. ఆ కలశలతో ఒక వైపు స్వామికి అభిషేకం జరుగుతుండగా మరో వైపు చినజీయర్‌తో పాటు సుమారు 351 మంది ఋత్విక్‌లు పలుమార్లు వెయ్యి కలశలతో గంగధార నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి స్వామికి అభిషేకించారు. ఆ తరువాత నిజరూపంలో ఉన్న స్వామికి విశేష అభిషేకాలు పూర్తి చేశారు. సహస్రఘటాభిషేకం ముగిసిన తరువాత ఆరాధనలు గావించి భక్తులకి అవకాశదర్శనం కల్పించి చినజీయర్ తీర్ధగోష్టి నిర్వహించారు. ఆ తరువాత శాస్త్రోక్తంగా మూడు మణుగుల చందనాన్ని స్వామికి సమర్పించారు.
చందనోత్సవం విజయవంతం
గతంలో కంటే భిన్నంగా ఈ ఏడాది చందనోత్సవం జరిగింది. ప్రతీ ఏటా సుమారు 80వేల మంది భక్తులు స్వామిని దర్శించు కోవడం జరిగేది. మిగిలిపోయిన భక్తులు మరుసటి రోజు గుమ్మడిపండు అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకునే వారు. అయితే ఈ ఏడాది ఆలయ వర్గాలు ముందుగానే భక్తులు రద్దీని ఊహించాయి. కరోనా సందర్భం గా రెండేళ్ల పాటు భక్తులను అనుమతించలేదు. దీంతో ఈసారి సుమారు రెండు లక్షల మంది భక్తులకు తగ్గట్లుగా ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేశాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా మూడు క్యూలైన్లు సమకూర్చారు. సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక ప్రవేశం, రూ.1000 (విఐపి), రూ.1200 , రూ.1500 వివిఐపి, ప్రోటోకాల్ టిక్కెట్ల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా తెల్లవారు జామున ఆలయ వంశపారం పర్యధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తొలిదర్శనం పూర్తి కాగానే అన్ని క్యూలైన్లు నుంచి ఒకేసారి భక్తులను స్వామి దర్శనానికి పంపించారు. దీంతో సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. విఐపి, వివిఐపిలకు సామాన్య భక్తులకు సంబంధం లేకుండా దర్శనాలు కొనసాగడంతో భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. సుమారు లక్ష మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకున్న ట్లు ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ డి.భ్రమరాంబ, నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, ఇతర ఆలయాల నుంచి వచ్చిన డిప్యూటీ కమిషనర్లు, సహాయ కమిషనర్లు, జీవీఎంసీతో పాటు పలు విభాగాల అధికారులు, సిబ్బంది ఉత్సవాన్ని విజయవంతం చేయడం లో సమిష్టిగా పనిచేశారు. పోలీసులు భద్రతా పరంగా పూర్తిస్థా యిలో సేవలందించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ విభాగం పోలీసులు నిరంతరం పనిచేశారు. అందరూ కలిసి సింహాద్రినాధుడు నిజరూపాన్ని భక్తులకు కనులారా చూపించారు. దీంతో పాటు ఈ ఏడాది ఉత్సవంపై అధికారు లు ముందు నుంచి తర్జన భర్జనలు పడ్డారు. రెండేళ్లు స్వామి నిజరూప దర్శనం లేకపోవడంతో ఈ ఏడాది ఎలా ఉత్సవం జరుగుతుందన్నది ఒక వైపు కొంత ఆందోళన కలిగించే అంశంగా మారింది. జిల్లా అధికార యంత్రాగం, ఆలయ అర్చికపరివారం, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికార గణం, సిబ్బంది ఎవరి స్థాయిలో వారు ఉత్సవం విజయవం తానికి పనిచేయడంతో ఎటువంటి చిన్న చిన్న లోటుపాట్లు సైతం లేకుండా చందనోత్సవం అపురూప ఘట్టం ముగిసింది. చందన విసర్జన అనంతరం సింహగిరిపై భారీ వర్షం కురవడంతో భక్తులంతా ఆ స్వామి మహిమగా భావించి గోవింద అంటూ హరినామ స్మరణలు చేశారు. ఇది కూడా ఆ స్వామి నిజరూప దర్శనం ప్రతీకగా అభివర్ణించారు.
శారదాపీఠాధపతులు ప్రశంసలు
మరో వైపు విశాఖ శారదాపీఠాధి పతులు చందనోత్సవం నిర్వహణ పట్ల పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈ ఉత్సవాన్ని విజయవంతం చేశారని ఆలయ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్, ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం భక్తులుగా మారి సేవలందించడాన్ని స్వామీజీలు ప్రశంసి ంచారు. ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ, ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఎంతో కష్టించి పనిచేసి ఉత్సవాన్ని విజయవంతం చేశారన్నారు. సామాన్య భక్తులకు సైతం ఎంతో అపురూపంగా దర్శనం కల్పించారని స్వామీజీలు ఆకాంక్షించారు.
భారీగా ఆదాయం
చందనోత్సవం సందర్భంగా దర్శనం టిక్కెట్ల విక్రయాలు, ప్రసాదాలు, రవాణా వ్యవస్థ, ఇతర విభాగాల ద్వారా అప్పన్న ఆలయానికి భారీగా ఆదాయం సమకూరింది. సుమారు రూ.3 కోట్లకు పైగానే ఆదాయం లభించే అవకాశాలున్నాయి. మరో వైపు స్వామి దేహంపై నుంచి ఒలిచిన చందనం సుమారు 100 కేజీలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ చందనాన్ని సిబ్బంది ప్యాకెట్లుగా తయారు చేసి నేడో, రేపో భక్తులకు విక్రయిం చన ున్నారు. ఉత్సవాన్ని విజయవంతం చేసిన అందరికి ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
సాఫీగా చందనోత్సవం
Advertisement
తాజా వార్తలు
Advertisement