సాధన అంటే భగవంతుని కోసమని, లేదా తననితాను ఉద్ధ రించుకోవడం కోసమని, ఎవరైనా భావిస్తే, అదో మొక్కు బడి క్రతువుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి సాధనను ఒక స్థాయికి తీసుకురావడానికి మనం ఎంతో కష్టపడాలి. ఆ తర్వాత అది మనల్ని వదలమన్నా వదలదు. అంతశ్చేతన కొన్ని రోజులపా టు దేనికి అలవాటుపడి కొనసాగిస్తే, దాని కోసమే అర్రులు చాస్తుంది. జాతి ఉన్నతిని సాధన నిర్దేశిస్తే, సంస్కారయుతమైన సాధన వ్యక్తి తాలూకు అద్భుత అలౌకిక అనిర్వచనీయమైన గుణ గణాల్ని దశదిశలా వ్యాపింపజేస్తుంది. వ్యక్తి వికాసానికి, అభివృద్ధికి సంస్కృతి సంబంధమైన సాధన ఎంతగానో తోడ్పడుతుంది. అలాగే ధార్మిక, సామాజిక, దేశ పురోభి వృద్ధి సంస్కారయుతమైన సాధనవల్లే సాధ్యమవుతుంది. సాధన అనగా కేవలం పూజాది కలాపాలే కాదు. మన మనోమ య ప్రపంచాన్ని శుద్ధి చేసుకోవడం కూడా, తానో మనిషిని, ము ఖ్యంగా సాధకుణ్ణనే సంగతే మరచి అహంకారమే అలంకారంగా చర్చిస్తూ ఉంటాడు. మాటల్లో కర్కశత్వం, కుసంస్కారం, పరిహా సం ప్రస్ఫుటం అవుతుంటాయి. శరీరానికి సంబంధించిన యోగ ప్రక్రియలన్నీ పరిమిత ప్రయోజనం కలిగి ఉంటాయి. కొందరికి సాధన వల్ల యోగశక్తులు లభించవచ్చు. ఇంద్రియాలను వశపరచుకోవడానికి సాధన ఎంతో అవస రం. ఎందుకంటే ఇంద్రియాలు ఎంతో శక్తివంతమైనవి. అవి బల వంతంగా విషయ వాసనల వైపు అంటే కోరికల వైపు మళ్ళిస్తాయి. మనసును వాటి అధీనంలో పెట్టుకుంటాయి. అందువల్ల మానవు లకు మనోనిగ్రహం అత్యవసరమవుతుంది. ఇంద్రియాలతోపాటు మనసును స్వాధీనంలో సాధనతో ఉంచుకున్న వ్యక్తికి శాంతి, ఆనందం లభిస్తాయి. ఏమిటి సాధన అని ప్రశ్నించుకుంటే ఎన్ను కున్న ధ్యేయాన్ని స్వశక్తితో సాధించే గొప్ప ప్రయత్నమని జవాబు చెప్పుకోవచ్చు. కొన్ని లక్ష్యాలు, బాహ్యోపకరణాల సాధనతో సరి పుచ్చేవి. మరికొన్ని ఆంతరిక సాధనకుగానీ లభించనివి. పరం పదం అలాంటిది. అది అంతరంగ సాధన. లేదా ఆంతర్య శోధనగా చెప్పుకోవచ్చు. దు:ఖం నుండి దూరమవ్వడానికి జీవుడు స్వయం గా సాధనాత్మయ ప్రయత్నం చేయాలి. ఈ ప్రేరణకు దు:ఖమే కార ణం అని తెలుస్తుంది. ఎవనికి దు:ఖం కలిగిందో వాడే దాని నుండి విముకు ్తడవటానికి ప్రయత్నించగలడు.
జీవితాన్ని ఎంత నిశితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయ కలిగితే, అంతే వేగంగా అవాంతరాలై చిక్కు ప్రశ్నలెన్నో తలెత్తుతా యి. కానీ ఆత్మ చైతన్యం దృష్ట్యా సాధన చేస్తే సృష్టి తత్వమే అన్ని రహస్యాలనూ ఛేదించే సమాధానంగా ఆవిష్కృతమౌతుంది. ఒకరికి ఉన్న దాన్ని గురించి ఈర్శ్యా ద్వేషాలకు గురికావడం నీచమైన మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఉన్నత స్థాయికి ఎదిగేం దుకు మార్గం అంకిత భావంతో చేసే శ్రమ మాత్రమేనని గుర్తెరగాలి. శ్రమించడానికి శక్తి లేనప్పుడు ఉన్న దానితోనే తృప్తిపడే మనస్త త్వాన్ని కలిగి ఉండటమే గొప్ప సాధనా సుగుణం. మనుషులంతా భౌతిక వ్యక్తులు కాబట్టే శుద్ధ భక్తిని సాధన చేస్తే కానీ పారమార్థిక వ్యక్తులు కాజాలరు. భౌతిక వ్యక్తిత్వంతో పరమాత్మను పొందడం అసాధ్యం. భక్తులపై అనుగ్రహం ప్రదర్శించేందుకే భగవంతుడు భూమిపై అవతరిస్తాడని ఉపనిషత్తులు అంటున్నాయి. సహించేదంతా సాధనే. దున్నినా, తన్నినా, తవ్వినా తన నుం డి ప్రేమను జీవుడికి ఆహార, ఐశ్వర్య రూపంలో ఇచ్చే భూమిది సహ జ సహనాత్మకమైన సాధనే. గృహస్థ జీవితంలో ఉంటూ ఆధ్యాత్మిక శిఖరాలను అందుకున్నవారినీ, సంఘ సంస్కర్తలను మేధావులను నూత్న భావజాలంతో ప్రపంచగతిని ప్రభావితం చేసినవారినీ, ఏ సమాజం అంత సులభంగా అంగీకరించలేదు. సాధనతో సర్వం సాధించవచ్చునన్న అనుభ వాన్ని నేర్చుకుంటే మంచిది. మానవ జన్మలన్నీ ఆగాలు, ఆధ్యాత్మిక సాధనలో అవన్నీ యోగాలు అవు తాయి. మధ్యలోవన్నీ యాగాలు. సామాన్య వ్యక్తిత్వ సంపన్నుల జీవన విధానమంతా ఆగ, యాగ, యోగాల పరిధిలో నడుస్తుంది.
నిజానికి ప్రతి మనిషిలోనూ గొప్ప సాధన ఉంటుంది. కానీ అది నిద్రాణంగా ఉంటుంది. మనల్ని మనం సాధనాబలంతో ఎలా మలచుకోదలచుకున్నామో, ఎలా ఉండాలని అనుకున్నామో, ఇవ న్నీ కూడా చంద్రుడి దిశ యొక్క అవగాహనతో సాధ్యమవుతాయి. ఈ దిశలన్నీ కూడా మనలో వేర్వేరు సాధనా లక్షణాలను సృష్టిస్తాయి. సరైన సాధన గుణ అవగాహనతో వీటిని మన బాగుకు ఉపయోగించుకోవచ్చు. చంద్రుడి స్థానాలు భౌతిక శరీరంపై, మానసిక ప్రవృత్తిపై ఎలా
ప్రభావం చూపుతుంటాయో అచ్చం అలాగే…
– ఎస్ ఆర్ భల్లం
98854 42642