పరస్పరం విడిపోవడానికి కారణమైన రవాటి నుండి దూరంగా వెళ్లడమే సహనానికి ఆధారము
అంతర్ముఖునిగా అయి ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తి చేసుకున్నందుకు కలిగే ప్రాప్తియే సహనము. నీవు నీ అహంకారాన్ని తగ్గించుకోగలిగితే నీ కోపానికి కూడా సమాధానము దొరకుతుంది. దీని ద్వారా బాహ్య పరిస్థితులను కూడా చక్కబెట్టగలవు. నీలోని అహం పోయినప్పుడు నీవు దేనినైనా సావకాశంగా తీసుకోగలవు. లేకపోతే ఎప్పటిలాగే నువ్వు-నేను, నేను- నువ్వు అంటూ అసహనం కారణంగా గొడవలు జరుగుతూనే ఉంటాయి. నీవు నిజాయితీగా, నిస్వార్థంగా ఉంటే అప్పుడు నువ్వు ఇతరుల అవసరాలను అర్థం చేసుకున్నప్పుడు నువ్వు ఇతరులను అర్థం చేసుకోగలవు. ”నన్ను అర్థం చేసుకోవాలి” అన్న మాట ”నేను అర్థం చేసుకోవాలి” అని, ”వాళ్లు మారాలి” అని కాక ” వారికి అవసరమైనది నేను ఇస్తాను” అని మారుతుంది. సహనము, శాంతి, పరిపక్వత పెరుగుతాయి. ఆత్మిక సహనము అంతరిక వివేకమును పెంపొందిస్తుంది. ఈ వివేకము ఏ పుస్తకాల ద్వారా లభించదు.
అంతర్ముఖులుగా అయి మౌనంలో ఉండి భగవంతుని వారసత్వంతో స్వయాన్ని నింపుకో. ఎప్పుడూ గుర్తుంచుకో, నువ్వు ఏదీ నిరూపించనవసరం లేదు. ఏది సత్యమో అది తేటతెల్లమవుతుంది. శ్రేష్ఠ కర్మలతో ఇతరుల హృదయాలను గెలుచుకోవడం వలన నీ జీవితంలో సంతోషం కలుగుతుంది.
-బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి