సహకారము నాలుగు విషయాలపై ఆధారపడి ఉంటుంది.
మొదటిది, నిరంతరం శుద్ధమైన భావాలు మరియు ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉండటము. నిరంతరం ఉన్నత భావాలను పెంచుకోవడంలో నువ్వు అజాగ్రత్తగా
వ్యవహరిస్తే నీ స్వభావము దెబ్బ తింటుంది.
రెండవది, భగవంతునిపై విశ్వాసము. భగవంతుడు అన్నీ చేయిస్తున్నారు అని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు నీలో స్పర్థను, ఈర్ష్యను కలిగిస్తాయి.
మూడవది, నీ తోటివారిని, సన్నిహితులను నమ్ము. ఇతరులపై నీకున్న ఈ నమ్మకము ఉల్లాసాన్ని కలిగించి ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.
చివరగా, నీ ఉద్దేశాలను నిరంతరం సులభమైన, సహజమైన భాషతో వ్యక్తపరుచు. అప్పుడు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండి వారు కూడా తమను ఆ కార్యంలో భాగస్వాములుగా భావిస్తారు.
-బ్రహ్మాకుమారీస్.
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి